E-Paper
Advertisement

Vijay Alliance Buzz: విజయ్‌ను వెంటాడుతోన్న 11.. సింహం సీఎం కావాలంటే, పొత్తే దిక్కు!

Vijay Alliance Buzz: విజయ్‌ను వెంటాడుతోన్న 11.. సింహం సీఎం కావాలంటే, పొత్తే దిక్కు!
Advertisement

Vijay Alliance Buzz: టీవీకే పార్టీ అధినేత విజయ్ సాధించిన గెలుపు.. తమిళనాడుతో పాటు ఏపీలోనూ ప్రకంపనలకు కారణమైంది. విజయ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా పోటీ చేసి.. తొలి ప్రయత్నంలోనే 108 స్థానాలు గెలుచుకున్నారు. డీఎంకే (DMK), అన్నా డీఎంకే (AIADMK) వంటి బలమైన పార్టీలను వెనక్కినెట్టి.. అతిపెద్ద పార్టీగా టీవీకే (TVK)ను నిలబెట్టారు. అయితే విజయ్ సాధించిన ఈ సక్సెస్ ను ఏపీలోని వైసీపీ (YSRCP) తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సినీ నటుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని మరోమారు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ వచ్చారు. ఇక్కడే వారికి బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ‘సింహం సింగిల్’ జగన్ తరహాలో వారు ఆకాశానికెత్తిన విజయ్.. పొత్తు దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీని వెంటాడని 11 అంకె.. ప్రస్తుతం విజయ్ కు సమస్యగా మారిందని కూడా అంటున్నారు.

పొత్తు దిశగా విజయ్ అడుగులు!

తమిళనాడులో ఒక పార్టీ అధికారం చేపట్టాలంటే మెుత్తం 234 స్థానాలకు గానూ 118 (మ్యాజిక్ ఫిగర్)లో విజయం తప్పనిసరి. అయితే విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలు మాత్రమే సాధించింది. దీంతో అధికారం చేపట్టాలంటే విజయ్ కు మరో 10 స్థానాలు కచ్చితంగా అవసరం. కాబట్టి అనివార్యంగా విజయ్ పొత్తు పెట్టుకోకతప్పదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ – టీవీకే పార్టీల మధ్య పొత్తు విషయమై చర్చలు కూడా సాగుతున్నట్లు జాతీయ మీడియాతో కథనాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు విజయ్ సుముఖత వ్యక్తం చేసినట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. తమిళనాడులో కాంగ్రెస్ సాధించిన 5 స్థానాలకు తోడు ఇతర చిన్న పార్టీలను కలుపుకొని మ్యాజిక్ ఫిగర్ దాటాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వైసీపీ హైలెట్ చేస్తూ వస్తున్న ‘సింహం సింగిల్’ కాన్సెప్ట్ నీరుగారిపోవచ్చు.

11 అంకె.. వైసీపీపై ట్రోల్స్!

Advertisement

విజయ్ ను జగన్ తో పోలుస్తూ.. అతడి గెలుపును తమదిగా ప్రచారం చేసుకుంటున్న వైసీపీ శ్రేణులపై.. నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ఈ స్థాయి విజయం వచ్చినప్పటికీ.. వైసీపీకి గాలి సోకి టీవీకేకి సైతం 11 అంకె కష్టాలు మెుదలయ్యాయని కామెంట్స్ చేస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ కు 10 స్థానాలు అవసరం కాగా.. అది దాటాలంటే 11 స్థానాలు అవసరమని గుర్తుచేస్తున్నారు. ఆ 11 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడ గట్టడం విజయ్ కు తలనొప్పిగా మారిందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లు (18) కూడా ఆ పార్టీకి రాకపోవడంతో ప్రత్యర్థులు వైసీపీని ఎద్దేవా చేస్తూ వస్తున్నారు.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల జాతర.. ఐఫోన్, గూగుల్, శాంసంగ్ ఫోన్లపై.. కనీవినీ ఎరుగని డిస్కౌంట్లు..!

పవన్ చేసిందే కరెక్టా?

Advertisement

ఇదిలా ఉంటే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకుండా విజయ్ పోటీ చేసి.. గ్రాండ్ విక్టరీ సాధించడాన్ని చూపెడుతూ పవన్ కు చురకలు అంటించాలని వైసీపీ భావించింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఆ పార్టీ నేతలు.. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా చురకలు కూడా అంటించారు. అయితే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో రాజకీయ పరిస్థితులు వేరని నిపుణులు అంటున్నారు. ఏపీ ప్రజలు కులాలు, పార్టీల వారీగా చీలిపోయిన అంశాన్ని గుర్తుచేస్తున్నారు. ఒకవేళ పవన్ కూడా సింగిల్ గా పోటీ చేసి ఉంటే.. అప్పటికే చీలిపోయిన ఓట్ షేరింగ్ వల్ల జనసేనకు పెద్దగా ఓట్లు వచ్చేవి కాదని అంటున్నారు. అయితే జగన్ ను ఓడించాలన్న సంకల్పంతో పాటు.. పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలన్న నేర్పుతో పవన్ పొత్తు పెట్టుకొని సక్సెస్ అయ్యారని ప్రశంసిస్తున్నారు. ఏపీ రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే పవన్ చేసింది కరెక్టే అని అంటున్నారు. ఇప్పుడు విజయ్ సైతం పొత్తు దిశగా అడుగులు వేస్తుండటం.. పవన్ ను విమర్శిస్తున్న వారికి చెంపపెట్టు లాంటిదని చెప్పుకొస్తున్నారు.

Also Read: Poco C81 vs Poco C81x: రెండూ మధ్యతరగతి ఫోన్లే.. పైగా ధర తక్కువ.. ఫీచర్ల పరంగా ఏది బెస్ట్?

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×