E-Paper
Advertisement

తిరుమల లడ్డూ వ్యవహారం.. చెవిరెడ్డి, భూమున, ధర్మారెడ్డిపై కఠినచర్యలు! వైవీకి బిగ్ రిలీఫ్, విజయసాయిరెడ్డి చూపంతా

తిరుమల లడ్డూ వ్యవహారం.. చెవిరెడ్డి, భూమున, ధర్మారెడ్డిపై కఠినచర్యలు! వైవీకి బిగ్ రిలీఫ్, విజయసాయిరెడ్డి చూపంతా
Advertisement

Amaravati: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం చివరి అంకానికి చేరిందా? ఏకసభ్య కమిటీ నివేదిక ఇవ్వడంతో చర్యలకు సిద్ధమైందా? రాజకీయ నేతలు-ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం రెడీ అయ్యిందా? జరుగుతున్న పరిణామాలను విజయసాయిరెడ్డి గమనిస్తున్నారా? ఈ వ్యవహారంపై రేపోమాపో ఆయన మీడియా ముందుకు రానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

తిరుమల లడ్డూ వ్యవహారం.. చెవిరెడ్డి, భూమున, ధర్మారెడ్డిపై కఠినచర్యలు!

Advertisement

తిరుమల కల్తీ నెయ్యి కేసు వ్యవహారం చివరి అంకానికి చేరింది. ఏక సభ కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరడంతో కఠినచర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. ఈ కేసులో మాజీ ఈవో ధర్మారెడ్డి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను కమిటీ ప్రధానంగా ప్రస్తావించింది. వీరితోపాటు పలువురు ఉద్యోగులను పేర్కొంది.

వారిపై కఠినచర్యలకు సిద్ధమైనట్టు సచివాలయం వర్గాలు చెబుతున్నాయి. పైముగ్గురు నేతలు భవిష్యత్తులో తిరుమలలో ఎలాంటి పదవి చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తోందని సమాచారం. కమిటీ ప్రస్తావించినట్టుగా కీలక అధికారులను సస్పెండ్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

Advertisement

వైవీకి రిలీఫ్ వ్యవహారం.. విజయసాయిరెడ్డి చూపంతా అటువైపు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి నిర్ణయాలపై విమర్శలు లేకపోలేదు.  కొనుగోలు కమిటీ సభ్యుల హోదాలో టెండరు నిబంధనల సడలింపుకు వీరిద్దరూ పచ్చజెండా ఊపినట్లు గుర్తించింది. కన్వీనర్ హాజరు లేకుండానే సమావేశంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, డైరీలను రెండేళ్లపాటు ఎంపానల్ చేయాలన్న సూచనను నిర్లక్ష్యం చేశారట.

టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ వ్యవహారం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. ఆయన పాత్రపై దర్యాప్తు ఫోకస్ చేయలేదు. ఒకవిధంగా చెప్పాలంటే వైవీ సేఫ్‌గా బయటపడినట్టే. ఈ కుంభకోణం లో స్పష్టమైన పాత్ర కనిపిస్తున్నా నిందితుడిగా చేర్చలేదు సిట్. కేవలం ఆయన ​పీఏ చిన్నప్పన్న లంచం ఎవరి వద్దకు వెళ్లిందో తేలకుండానే దర్యాప్తు ముగిసింది. ​

ALSO READ: రాళ్ల‌తో కొట్టి చంపండి..! అద‌ప్పుడు కేసీఆర్ స్ట్రాట‌జీ.. ఇప్పుడు క‌విత నోటి వెంటా అవే..!

బ్యాంకు ఖాతాలు పరిశీలించకుండానే నిందితుల జాబితా నుంచి సుబ్బారెడ్డిని తప్పించడం అనేక అనుమానాలు లేకపోలేదు. దీనిపై కూటమిలో చర్చ జరుగుతోంది. ఈ విధంగా చర్యలు తీసుకోవాలి? సిట్ నివేదిక, కమిటీ నివేదికతో చర్చలు చేపట్టాలని భావిస్తోంది. శనివారం హైదరాబాద్ సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య దీనిపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ నివేదిక, కమిటీ రిపోర్టు అంశాలను విజయసాయిరెడ్డి క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు మరోవైపు వార్తలు వస్తున్నాయి. దీనిపై రేపో మాపో ఆయన మీడియా సమావేశానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకున్నా తర్వాత మీడియా ముందుకొస్తారా? ముందే వస్తారా అనేది చూడాలి.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×