E-Paper
Advertisement

మ‌హిళా బిల్లు కాద‌ది.. బాబ్డ్ హెయిర్ రిజ‌ర్వేష‌న్ ….. అప్ప‌ట్లో దుమారం రేపిన లాలూ వ్యాఖ్య‌లు.. ఇప్పుడు ఇది చ‌ర్చ‌కు రావ‌డం లేదెందుకు?

మ‌హిళా బిల్లు కాద‌ది.. బాబ్డ్ హెయిర్ రిజ‌ర్వేష‌న్ …..  అప్ప‌ట్లో దుమారం రేపిన లాలూ వ్యాఖ్య‌లు.. ఇప్పుడు ఇది చ‌ర్చ‌కు రావ‌డం లేదెందుకు?
Advertisement

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లును ఇప్పుడు ఏ పార్టీ వ్య‌తిరేకిండ‌చం లేదు కానీ.. దీన్ని చాలా ఏండ్ల కింద‌నే అడ్డుప‌డ్డ పార్టీలున్నాయి. అస‌లు ఈ రిజ‌ర్వేష‌న్ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పేద వ‌ర్గాల మ‌హిళ‌ల కోసం కాకుండా.. ఉన్న‌త వ‌ర్గాల మ‌హిళ‌ల‌కు కేటాయించేందుకేన‌నే వాద‌న బ‌లంగా వినిపించాయి. కానీ ఇప్పుడా వాద‌న బ‌లంగా లేదు. మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లా? అది జ‌ర‌గ‌ని ప‌ని అని డిసైడ్ అయ్యారా? ఏదో ఒక‌టి మ‌హిళ‌ల ప్రాతినిథ్యం రాజకీయాల్లో పెరిగితే చాలు అనే భావ‌న‌కు వ‌చ్చేశారా? కార‌ణాలేమైనా.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును అడ్డుకునే పార్టీలు ఇప్పుడు లేన‌ట్టేన‌ని చెప్పాలి. కానీ చాలా కాలం క్రిత‌మే ఈ బిల్లును బాబ్డ్ హెయిర్ రిజ‌ర్వేష‌న్‌గా అభివ‌ర్ణించాడు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్.

ఆనాటి ప‌రిస్థితులు ఇప్పుడు మ‌ళ్లీ చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. మ‌హిళా బిల్లును డీ లిమిటేష‌న్‌తో ముడిపెట్ట‌డం వ‌ల్ల కూడా అంత డీ లిమిటేష‌న్‌పైనే ప‌డ్డారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయ‌మ‌నే వాద‌నే బ‌లంగా వెళ్లింది. ఇది రాజ‌కీయ కుట్ర అని, మ‌ళ్లీ ఎన్డీయే కూట‌మి అధికారంలోకి వ‌చ్చేందుకే ఇదంతా చేస్తున్నద‌ని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. కానీ మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌లో స‌బ్ కోటా పెట్టాల‌నే వాద‌న అంత బ‌లంగా లేదు. కొన్ని పార్టీలు డిమాండ్ చేసినా.. అదంత బ‌లంగా లేదు. ఓ సూచ‌న లాగే వెళ్తున్న‌ది. ఇప్పుడు డీ లిమిటేష‌న్ బిల్లును ఇంత అర్జెంటుగా, ఇంత హ‌డావుడిగా చేయాల్సిన ఆగ‌త్యం ఏమొచ్చంద‌నే వాద‌నే బ‌లంగా వెళ్లింది. కేంద్రం మ‌హిళా బిల్లుతో పాటు డీ లిమిటేష‌న్‌, రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుల‌ను ఓకేసారి పార్ల‌మెంటులో పెట్టడాన్ని కూడా ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుబ‌డుతున్నాయి.

Advertisement

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును సాకుగా చూపి.. డీలిమిటేష‌న్ బిల్లును పాస్ చేయించుకోవ‌డం ద్వారా ఉత్త‌రాది రాష్ట్ర‌ల్లో పెరిగిన సీట్ల సంఖ్య‌తో బీజేపీకి లాభం జ‌రుగుతుంద‌నే వాద‌న ఉంది. దీని ద్వారా మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌నేది బీజేపీ కుట్ర ప‌న్నుతున్న‌ద‌ని, దీనికి ద‌క్షిణాది రాష్ట్రాల‌ను బ‌లిపెడుతున్న‌ద‌నే వాద‌న, విమ‌ర్శ‌లు బ‌లంగా వ‌స్తున్నాయి. వ‌న్‌థ‌ర్డ్ మెజారిటీ అవ‌స‌రం కానున్న నేప‌థ్యంలో ఎన్డీయే దీన్ని ఎలా పాస్ చేయించుకోనుంది. మ‌ద్ద‌తు ల‌భిస్తుందా? అనే చ‌ర్చ ఓ వైపు కొన‌సాగుతుండ‌గా.. తాము మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో చిత్త‌శుద్ధితో ముందుకు వెళ్లామ‌ని, కానీ ప్ర‌తిప‌క్షాలే ఈ బిల్లును పాస్ కాకుండా చేశాయ‌ని రాజ‌కీయంగా మైలేజీ పొందే ప్ర‌య‌త్నం కూడా చేసేందుకు బీజేపీ రెడీగా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ హ‌డావుడిలో మహిళా రిజ‌ర్వేష‌న్ల‌లో స‌బ్ కోటా విష‌యం ప‌క్క‌కు పోయింది. అస‌లు దాన్ని ప‌ట్టించుకునేవారే లేరు. కానీ.. ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మాయావతి అనే ముగ్గురు నాయకులు రిజర్వేషన్ బిల్లుకి అడ్డంగా నిలబడిపోయారు. దీని ద్వారా ఉన్న‌త వ‌ర్గాల మ‌హిళ‌ల‌కే మేలు జ‌రుగుతుంద‌నే వాద‌న ఈ ముగ్గురు బ‌లంగా తీసుకొచ్చారు. ఈ రిజ‌ర్వేష‌న్ల ద్వారా ఆధిప‌త్య కులాల స్త్రీలే అధికారంలో కూర్చుంటారు త‌ప్ప‌… మా కులాల సంగ‌తేందీ? అని అప్ప‌ట్లోనే నిల‌దీశారు. దీన్ని బ‌లంగా అడ్డుకున్నారు కూడా. ఈ నేప‌థ్యంలో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆర్టీడీ పార్టీ ఈ బిల్లును బాబ్డ్ హెయిర్ రిజ‌ర్వేష‌న్ కింద అభివ‌ర్ణించ‌డం అప్ప‌ట్లో దుమారం రేపింది.

Advertisement

ఆర్జేడీ కీల‌క నేత అబ్దుల్ బారీ సిద్దిఖీ మాట్లాడిన మాట‌ల తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. “లిప్‌స్టిక్ వేసుకునే, బాబ్‌కట్ హెయిర్ ఉన్న మహిళలే (అంటే నగర, ఆధిపత్య వర్గాల మహిళలు) లాభపడతారు” అని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌రువాత ఈ వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న సారీ కూడా చెప్పారు. కానీ లాలూతో పాటు ములాయం సింగ్ యాద‌వ్‌, మాయ‌వతిల అభిప్రాయాల‌తో పార్టీల‌క‌తీతంగా చాలా మంది ఏకీభ‌వించారు. క‌చ్చితంగా స‌బ్ కోటా లేక‌పోతే… నిమ్న‌వ‌ర్గాల మ‌హిళ‌ల‌కు రాజ‌కీయంగా ఇది ఎటువంటి లాభాన్ని తెచ్చిపెట్ట‌ద‌నే వాద‌న ఇంకా బ‌లంగా ఉంది. కానీ బ‌య‌ట‌కే రావ‌డం లేదు. ఇప్పుడున్న పార్టీలు దీన్ని అంత సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. ఇప్పుడు ఇది సైడ్ ట్రాక్ ప‌ట్టి.. డీలిమిటేష‌న్‌.. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం… అనే టాపిక్‌ల మీదే ఎక్కువ‌గా పోతున్న‌ది.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×