E-Paper
Advertisement

ఆర్టీసీ యూనియ‌న్ల పోయిన ప్రాణం తిరిగొచ్చింది!

ఆర్టీసీ యూనియ‌న్ల పోయిన ప్రాణం తిరిగొచ్చింది!
Advertisement

రండిరో కూల‌న్నా… సంఘం పెడ‌దామూ సంగ‌తేందో చూద్దాము..! లెఫ్ట్ భావ‌జాలంతో సాగిన ఈ పాట తెలియ‌ని కార్మికులుండ‌రు. యూనియ‌న్ నేత‌లుండ‌రు. కార్మికుల దినోత్స‌వం నాడే ఆర్టీసీ కార్మిక సంఘాల‌న్నింటితో సీఎం రేవంత్ భేటీ కావ‌డం ప్రాధాన్య‌తను సంత‌రించుకున్న‌ది. త‌మ స‌మ‌స్య‌ల సాధన‌కు స‌మ్మెకు దిగ‌డం.. అందులో ఒక‌రు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెంద‌డం విషాదాన్ని నింపింది. ఇది ఇంకా తీవ్ర‌రూపం దాల్చ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు మ‌రింత ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంతా అనుకున్నారు. కానీ సీఎం రేవంత్ చొర‌వ తీసుకున్నారు.

దీనికి చ‌ర్చ‌ల రూపంలో ముగింపునిచ్చారు. స‌మ‌స్య తీవ్ర‌త‌ను గ‌మ‌నించి వెంట‌నే స్పందించ‌డం ఎంతో మేలు చేసింది. కానీ మొండిగా పోతే మ‌రింత న‌ష్టం క‌చ్చితంగా వాటిల్లేదే. గ‌తంలో పాల‌న చూశారు. ఆర్టీసీ స‌మ్మె 50 రోజుల పాటు సాగించిన నేప‌థ్యం తెలంగాణ‌కు ఉంది. వాటిని ఇప్ప‌టికీ త‌లుచుకుని భ‌య‌ప‌డుతుంటారు. బాధ‌ప‌డుతుంటారు. ఉద్య‌మ నేత‌గా పేరొంది.. తెలంగాణ‌కు సీఎం అయిన కేసీఆర్ పాల‌న‌లో ఆర్టీసీ స‌మ్మెపై ఉక్కుపాదం మోప‌డం ఎవ‌రి ఊహ‌కు అంద‌నిది. యూనియ‌న్ల రాజ‌కీయాలు మాకెందుక‌ని.. వాటినే ర‌ద్దు చేసిన ఉదంతం ఉద్య‌మ రాష్ట్రంగా పేరొందిన తెలంగాణ‌కు అదెప్పుడు గుర్తుంటుంది.

Advertisement

అలాంటి రోజులు చూసిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల‌కు.. మేడే రోజు ఓ మ‌రుపురాని దినంగా గుర్తుండిపోతుంది. సీఎంతో క‌లిశారు. యూనియ‌న్ల గుర్తింపును తిరిగి కొన‌సాగించే అంశంపైనా సానుకూలంగా స్పందించారాయ‌న‌. మేడే రోజు త‌మ హ‌క్కులు తిరిగి పొంద‌బ‌డ్డామ‌నే సంతోషం ఆ కార్మిక‌లోకంలో క‌నిపించాయి. ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా 14 కార్మిక సంఘాలు సీఎంతో భేటీలో పాల్గొన్నాయి. ఆర్టీసీ తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్, ఆర్టీసీ తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్ (ఆర్‌), టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్, టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియ‌న్, టీఎస్ ఆర్టీసీ నేష‌న‌ల్ మ‌జ్దూర్ యూనియ‌న్, టీఎస్ ఆర్టీసీ కార్మిక ప‌రిష‌త్‌, టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్‌, తెలంగాణ ఆర్టీసీ బ‌హుజ‌న కార్మిక యూనియ‌న్‌, తెలంగాణ ఆర్టీసీ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్‌, టీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘ్‌, టీఎస్ ఆర్టీసీ సామాజిక తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్‌, టీఎస్ ఆర్టీసీ తెలంగాణ జాతీయ మ‌జ్దూర్ యూనియ‌న్‌, తెలంగాణ స్టేట్ ఆర్టీసీ బ‌హుజ‌న్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్… ఈ సంఘాల నేత‌లంతా సీఎంతో భేటీ అయ్యారు.

స‌మ‌స్య‌ల‌పై మాట్లాడారు. స‌ర్కార్ సానుకూలంగా స్పందించింది. ప్ర‌భుత్వం ఆర్టీసీ కార్మికుల హ‌క్కుల‌ను కాపాడుతుంద‌న్నారు సీఎం. ఆర్టీసీ స‌మ్మె తీవ్ర‌రూపం దాల్చితే చ‌లిమంటలు వేసుకునేందుకు ప్ర‌తిప‌క్షం రెడీగా ఉంది. త‌మ పాల‌న‌లో ఒక‌లా.. ఇప్పుడు మ‌రోలా డ‌బుల్ స్టాండ‌ర్డ్స్ రాజ‌కీయాల‌ను గ‌మ‌నించింది ఆర్టీసీ లోకం. స‌ర్కార్ కూడా వెంట‌నే దిగి వ‌చ్చింది. ఈ స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించ‌డంతో జ‌నం ఊపిరి పీల్చుకున్నారు. పాల‌కులెవ‌రున్నా.. స్పందించాల్సిన తీరు ఇలా ఉండాల‌ని ఆద‌ర్శంగా నిలిచింది రేవంత్ స‌ర్కార్ అని ఆర్టీసీ కార్మికులు కొనియాడారు.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×