E-Paper
Advertisement

త‌లైవాకు త‌త్వం బోధ‌ప‌డ్డ‌ది.. ధైర్య‌మే స‌రిపోవ‌డం లేదు! మౌన‌ముని పాత్రే బెట‌ర‌ట‌!

త‌లైవాకు త‌త్వం బోధ‌ప‌డ్డ‌ది.. ధైర్య‌మే స‌రిపోవ‌డం లేదు! మౌన‌ముని పాత్రే బెట‌ర‌ట‌!
Advertisement

త‌లైవా ర‌జినీకి మొన్న‌టి ఎన్నిక‌ల ఫలితాలు గ‌ట్టి షాక్‌నే ఇచ్చిన‌ట్టున్నాయి. అస‌లే త‌న త‌త్వం.. భ‌య‌ప‌డే మ‌న‌స్త‌త్వం.అందుకే పార్టీ ఏర్పాటు చేయ‌కుండా నీళ్లు న‌ములుతూ కాలం గ‌డిపాడు. తాజాగా ఆయ‌న చేసిన కామెంటొక‌టి చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఏం మాట్లాడినా త‌ప్పు బ‌డుతున్నారు. ఏం మాట్లాడ‌క‌పోయినా త‌ప్పుబ‌డుతున్నారు. మొత్తానికి త‌ప్పులు వెతుకుతున్నారు..కాబ‌ట్టి మ‌న జాగ్ర‌త్త‌లో మ‌నం ఉంటే బెట‌ర్‌! అని అన్నారు.

అంటే ఇక‌పై ఏ విష‌యాల్లో వేలు పెట్ట‌కూడ‌దు.. సైలెంట్‌గా ఉండాల‌ని డిసైడ్ అయ్యాడ‌న్న‌మాట‌. పాత విష‌య‌మే. ఆయ‌న మొద‌టి నుంచీ అలాగే ఉన్నాడు. కాబ‌ట్టి ఆ మెంటాల‌టీ పార్టీ పెట్ట‌డానికి కావాల్సిన దైర్యాన్ని ఇవ్వ‌లేదు. ముందుకు న‌డ‌ప‌లేదు. కానీ విజ‌య్ గెలిచిన త‌రువాత .. ఇదేమంత పెద్ద విజ‌యం కాద‌నే విధంగా త‌న‌లోని అసూయ భావాన్ని బ‌య‌ట‌పెట్టుకుని త‌న‌ను తాను త‌గ్గించుకున్నాడు. త‌ను కూడా పార్టీ పెట్టి ఉంటే సీఎం అయ్యేవాడిన‌న్నారు. ఇలాంటి మాట‌లు ఎవ‌రూ హ‌ర్షించ‌రు.

Advertisement

విజ‌య్ ప‌డిన క‌ష్టానికి త‌గినట్లుగా ర‌జినీ స్పందించ‌లేదు. అవ‌మానించే రీతిలో మాట్లాడాడు. ఇదే అత‌ని పెద్ద‌రికాన్ని త‌క్కువ చేసింది. కుంచిత మ‌న‌స్త‌త్వ‌మ‌ని బ‌య‌ట ప్ర‌పంచానికి తెలిపింది. విజ‌య్ పార్టీ పెట్ట‌డం.. సీఎం కావ‌డం.. త‌న క‌ళ్ల‌ముందే చ‌క‌చ‌కా జ‌రిగిపోవ‌డాన్ని రజినీ జీర్ణించుకోలేదు. విజయ్ గెలిచిన వెంట‌నే .. మాజీ సీఎం స్టాలిన్‌ను క‌లిసి ప‌రామ‌ర్శించాడు. త‌న మిత్రుడు కాబ‌ట్టి వెళ్లాన‌ని అన్నాడు. మిత్ర‌ధ‌ర్మం కాబ‌ట్టి ఓకే అనుకోవ‌చ్చు. అంత‌టితో ఆగితే, త‌న ప‌ని తాను చేసుకుంటే బాగుండేది. కానీ విజ‌య్‌పై నోరు పారేసుకున్నాడు.

త‌న‌ను త‌క్కువ చేసి చూడొద్ద‌ని చెప్ప‌డం కోసం.. విజయ్‌ విజ‌యాన్ని త‌క్కువ చేసి చూపే ప్ర‌య‌త్నంలో త‌నకు తాను సెల్ప్ గోల్ అయ్యాడు. ఇవ‌న్నీ ప‌రిణామాల త‌రువాత వ‌చ్చిన రియాక్ష‌న్ చూసి త‌ట్టుకోలేక‌పోయిన‌ట్టున్నాడు త‌లైవా. అందుకే ఆయ‌న త‌న 173వ చిత్రం ధ‌ర్మ‌న్ మూవీ కార్య‌క్ర‌మం వేదిక‌గా ర‌జినీ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశాడు.

Advertisement

విజ‌య్‌ను సీఎం అయిన త‌రువాత క‌ల‌వ‌క‌పోవ‌డం, ఆయ‌న బ‌ర్త్ డేకు విషెస్ చెప్ప‌క‌పోవ‌డంపైనా ఆయ‌న స్పందించిన తీరు చ‌ర్చ‌కు రావ‌డంతో ఇలా త‌ను మ‌ళ్లీ మౌన ముని పాత్ర వేయ‌డ‌మే బెట‌ర‌ని అనుకుంటున్న‌ట్టున్నాడు. మ‌రి క‌మ‌లాస‌న్ కూడా పార్టీ పెట్టాడు క‌దా. ఆయ‌నకు ఈ బాధ లేదు. ప్ర‌కాశ్ రాజ్ ఏ పార్టీ పెట్ట‌లేదు. కానీ త‌గుదున‌మ్మా అని అన్నింట్లోనూ వేలు పెట్టి కామెంట్ చేస్తున్నాడు.

ఎవ‌రిష్టం వారిది. కానీ ఇలా లోప‌లొక‌టి, బ‌య‌టొక‌టి పెట్టుకుని నిజ జీవితంలో కూడా న‌టించే ప్ర‌య‌త్నం చేయ‌డ‌మే అస‌లైన చిక్కు. జ‌నాల వ‌ద్ద విల‌న్‌గా మారే ప్ర‌మాదం. అదే జ‌రుగుతున్న‌ట్టుంది ర‌జినీ విష‌యంలో. జీవితంలో న‌టించ‌కుండా.. జీవించ‌డ‌మే చేస్తాడేమో ఇక నుంచి త‌లైవా.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×