E-Paper
Advertisement

త‌మిళ‌నాడులో నిశ్శ‌బ్ద విప్ల‌వం.. ఎన్టీఆర్ చ‌రిత్ర‌ను విజ‌య్ తిర‌గ‌రాయ‌నున్నారా?

త‌మిళ‌నాడులో నిశ్శ‌బ్ద విప్ల‌వం.. ఎన్టీఆర్ చ‌రిత్ర‌ను విజ‌య్ తిర‌గ‌రాయ‌నున్నారా?
Advertisement

ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌న్నీ బుట్ట‌దాఖ‌ల‌య్యాయి. ఒక్క యాక్సిస్ మై ఇండియావి త‌ప్ప అంతా త‌ప్పుడు లెక్క‌లే. త‌మిళ‌నాడులో నిశ్శ‌బ్ద విప్ల‌వానికి తెర లేపారు త‌మిళ తంబీలు. వారి నాడి చివ‌ర వ‌ర‌కు ఎవ‌రికీ అంతు చిక్క‌లేదు. టీవీకే అధినేత దళ‌ప‌తి విజ‌య్‌ను నిజంగా చెప్పాలంటే చాలా మంది త‌క్కువ అంచ‌నా వేశారు. ఓ ఇర‌వై సీట్ల‌కు ప‌రిమిత‌మ‌వుతాయి. కింగ్ కాదు క‌దా.. కింగ్ మేక‌ర్ కూడా కాద‌ని అనుకున్నారు. కానీ అక్క‌డి వాస్త‌విక ప‌రిస్థితులు అంచ‌నా వేయ‌డంలో అంద‌రూ త‌ప్పులో కాలేశారు. అందుకే ఎగ్జిట్ పోల్స్ కూడా త‌ల‌కిందుల‌య్యాయి.

అధికార డీఎంకే ఎదుర్కొంటున్న ప్ర‌జా వ్య‌తిరేక‌త వ‌ల్ల కొన్ని ఆ పార్టీకి చెందిన ఓట్లే చీలి విజ‌య్ ఖాతాలో ప‌డ‌తాయ‌నుకున్నారు. కానీ కొన్ని ఓట్లు కాదు.. ఏకంగా డీఎంకేనే గ‌ల్లంతు చేసే స్థాయిలో ఓట్ల‌ను, సీట్ల‌ను రాబ‌ట్టుకున్న‌ది విజ‌య్ టీవీకే పార్టీ. నిజంగా ఇదొక ప్ర‌భంజ‌న‌మ‌నే చెప్పాలి. అటు అన్నాడీఎంకేకు ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఓట్లు క‌లిసి వ‌స్తాయ‌ని అనుకున్నారు. కానీ అన్నా డీఎంకే ఓట్ల‌ను కూడా చీల్చి పారేశాడు విజ‌య్‌. వాటిని కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఏకంగా మ్యాజిక్ ఫిగ‌ర్‌కు ద‌గ్గ‌ర‌కు చేరేంత‌గా విజ‌యం అంచుల‌ను తాకాడు విజ‌య్‌. ఇది ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామం. చాప‌కింద నీరులా.. నిశ్శ‌బ్ద విప్ల‌వాన్ని సృష్టించ‌గ‌లిగాడు విజ‌య్‌. చాలా త‌క్కువ కాలంలో పార్టీని స్థాపించి, ఎన్నిక‌ల‌కు పోవ‌డం. నిర్మాణం, ఓ సిద్దాంతం లేకుండా త‌న హ‌వా కొసాగించ‌డం.. అదీ త‌మిళ‌నాడులో ఓ ఒక్క ప్రాంతానికో ప‌రిమితం కాలేదు.. యావ‌త్తు త‌మిళ‌నాడు అంతటీ విజ‌య్ టీవీకే ప్ర‌భావం బ‌లంగా ఉంద‌ని ఫ‌లితాలు వెల్ల‌డించాయి.

Advertisement

అంటే కేవ‌లం ఇది హ‌వా మాత్రమే కాదు.. అక్క‌డ కొత్త రాజ‌కీయ పార్టీకి వాక్యూమ్ ఉంద‌నే విష‌యం కూడా తెలియ‌జేసింది. అక్క‌డ సినీ తార‌ల‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మ‌రోసారి నిరూపిత‌మైంది. క‌రుణానిధి, జ‌య‌ల‌లిత లాంటి లెగ‌సీ లీడ‌ర్ల లేమి అక్క‌డ క‌నిపించింది. దీన్ని విజ‌య్ పూరిస్తాడ‌నే ఆశ‌, న‌మ్మ‌కం ఓట‌ర్ల‌లో క‌లిగింది. క‌రెక్టు స‌మయానికి విజ‌య్ త‌ను రాజ‌కీయంగా ఎంట్రీ ఇవ్వ‌డం.. త‌క్కువ స‌మ‌యంలోనే త‌న ప్ర‌సంగాల ద్వారా ఆక‌ట్టుకోవ‌డం.. టికెట్ల పంపిణీ విష‌యంలో కూడా కొత్త ద‌నాన్ని చాట‌డం, త‌న‌దైన శైలిని కొనసాగిండచం.. వెండి తెర‌పైనే కాదు.. రాజకీయంలో కూడా హీరోయిక్ పాత్రే ధ‌రించ‌నున్న‌ట్టు స్ప‌ష్ట‌మైన సంకేతాలివ్వ‌డం.. ఇవన్నీ ఆ పార్టీ విజ‌యానికి క‌లిసి వ‌చ్చాయి.

నాడు తెలుగునాట .. తెలుగువాడి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీకి తాక‌ట్టు పెడుతున్నార‌నే నినాదంలో రాజ‌కీయ పార్టీని స్థాపించి బ్ర‌హ్మాండ‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ను విజ‌య్ జ్ఞాప‌కానికి తెచ్చాడంటే అతిశ‌యోక్తి కాదు. అప్ప‌టి కాలంలో రాజ‌కీయంగా ఎన్టీఆర్ లాంటి మ‌హానేత‌, జ‌నం మెచ్చిన నాయ‌కుడికి ఆదిలో బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఈ సమ‌యంలో.. రాజ‌కీయాల‌న్నీ క‌లుషిత‌మై.. పోటీ వాతావ‌ర‌ణం మ‌రింత తీవ్ర త‌ర‌మైన నేప‌థ్యంలో విజ‌య్ రాజ‌కీయంగా ఒంటి చేత్తో విజ‌యం సాధించ‌డం మాములు విష‌యం కాదు. పార్టీ పెట్ట‌గానే సీఎం అయిన లిస్టులో నాడు ఎన్టీఆర్ ద‌క్షిణ భార‌త దేశంలో చ‌రిత్ర లిఖిస్తే.. ఇప్పుడు అదే ద‌క్షిణ భార‌త దేశంలో ఎన్టీఆర్ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన మ‌రో స్టార్ విజ‌య్ చ‌రిత్ర పుటల్లోకి ఎక్క‌నున్నారు.

Advertisement

ఒకవేళ హంగ్ ఏర్ప‌డినా.. ఇక్క‌డ విజ‌య్ కింగ్ అవుతాడు త‌ప్ప‌.. కింగ్ మేక‌ర్ కాదు.. అంత‌టి స్ప‌ష్ట‌మైన మెజారిటీని సొంతం చేసుకున్నాడాయ‌న‌. ఏపీలో ఆ త‌రువాత పార్టీ పెట్టిన చిరంజీవి ఫెయిల్ అయ్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కాలం క‌లిసి వచ్చింది త‌ప్ప‌.. విజ‌య్ లాంటి విజ‌యాన్ని, చరిత్ర‌ను లిఖించుకోవ‌డం విఫ‌ల‌మ‌య్యాడు. త‌మిళ‌నాట ఓ క‌మ‌లాస‌న్‌, ర‌జినీకాంత్‌, విజ‌య‌కాంత్ లాంటి పేరొందిన స్టార్ లీడ‌ర్లు కూడా చేయ‌ని సాహ‌జం విజ‌య్ చేశారు. విజ‌యం సాధించి చూపించాడు. అందుకే ఇప్పుడు ద‌ళ‌ప‌తి.. వెండితెర‌కే కాదు.. త‌మిళ‌నాడుకు.. ద‌క్షిణాది రాష్ట్రాల రాజ‌కీయ నేత‌ల‌కు ద‌ళ‌ప‌తిగా.. స్పూర్తిగా నిలిచాడు.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×