E-Paper
Advertisement

సంతోష్‌రావు కొత్త రూపం! ఫామ్‌హౌజ్ వీడి.. అడివి బాట ప‌ట్టి! వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ‌ర్‌గా అవ‌తారం..

సంతోష్‌రావు కొత్త రూపం! ఫామ్‌హౌజ్ వీడి.. అడివి బాట ప‌ట్టి! వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ‌ర్‌గా అవ‌తారం..
Advertisement

బీఆరెస్ మాజీ ఎంపీ, కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడు…జోగిన‌ప‌ల్లి సంతోష్‌రావు కేసీఆర్‌ను వీడాడు. అదే .. ఫామ్‌హౌజ్‌ను వీడి.. అడ‌వి బాట ప‌ట్టాడు. ఇప్పుడు కొత్త రూపం క‌ట్టాడు. చేతిలో ఓ పెద్ద కెమెరాతో అడ‌వులు జ‌ల్లెడ‌ప‌డుతున్నాడు. అన్న‌ల కోసం అప్పుట్లో పోలీసులు కూంబింగ్ చేసిన‌ట్టు.. సంతోష్‌రావు అడ‌వి జంతువులు, ప‌క్షుల కోసం వెతుకుతున్నాడు.

వాటిని త‌న కెమెరాల బంధిస్తూ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ‌ర్‌గా కొత్త అవ‌తారం ఎత్తాడు. కొన్ని నెల‌లుగా ఇదే పనిలో ఉన్నాడు సంతోష్‌. మ‌రి మొత్తం ఫామ్‌హౌజ్ వీడాడా? అస‌లే రావ‌డం లేదా? రాక‌పోతే.. కేసీఆర్‌కు మందు బిల్ల‌లు ఎవ‌రిస్తున్నారు? ఇవ‌న్నీ సందేహాలు త‌లెత్త‌వ‌చ్చు. అస‌లు కేసీఆర్‌.. సంతోష్‌ను బ‌య‌ట‌కు పోనీయ‌డు. మ‌రి అలాంటిది అంత స్వేచ్ఛ‌గా అత‌ను తిరుగుతున్నాడంటే.. ఎక్క‌డో చెడి ఉంటుంద‌ని కూడా అనుకుంటున్నారు కేసీఆర్‌ను ద‌గ్గ‌ర‌గా చూసేవాళ్లు.

Advertisement

అవును.. కేసీఆర్ మెంటాలిటీ అంతే. ఎంత ద‌గ్గ‌ర‌గా తీస్తాడో… ఏదో ఒకనాడు తీసి నేల‌కు కొడ‌తాడు. ఇక చచ్చినా వాళ్ల ముఖం చూడ‌డు. అరే అదేందీ..? వాళ్లెంత క్లోజ్‌గా ఉండేవాళ్లు. కేసీఆర్ వారిని ఎంత ప్రేమ‌గా చూసుకునే వాడు.. కానీ ఇప్పుడిది ఎలా సాధ్యం..? అని ముక్కున వేలేసుకోవ‌డం కూడా అక్క‌డి నేత‌ల‌కు అల‌వాటే. మ‌రి అలాంటిదేదో జ‌రిగి ఉంటుందా? లేక మ‌నోడే కాస్త గాలి పీల్చుకున్న‌ట్టు ఉంటుంది.. అలా వెళ్లి అడ‌విలో తిరిగి వ‌చ్చిన‌ట్టు ఉంటుంది.. అనుకొని.. దానికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ‌ర్ అని పేరు పెట్టుకుని ఉంటాడా? ఇది కూడా చ‌ర్చ‌కు వ‌స్తుంది.

ఏదో ఒక విధంగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేకత ఉండాలె.. త‌న‌ను జనాలు అప్పుడ‌ప్పుడైనా అలా యాది చేసుకుంటూ ఉండాల‌నే త‌ప‌న‌లో భాగంగా ఈ కొత్త వేషం క‌ట్టాడా తెలియ‌దు. ప‌దేళ్ల పాల‌న‌లో గ్రీన్ ఛాలెంజ్ పేరుతో యాక్ట‌ర్ల‌తో ఓ షోను నిర్వ‌హించిన సంతోష్‌రావు … మంచి మార్కుల క‌న్నా విమ‌ర్శ‌పాలే ఎక్కువ‌య్యాడు. ఇదంతా ఓ పొలిటిక‌ల్ షోలా మార్చాడ‌నే అప‌వాదునూ మూట‌గ‌ట్టుకున్నాడు.

Advertisement

మ‌రి సంతోష్‌రావు లేన‌ప్పుడు మందు బిల్ల‌లు ఎవ‌రేస్తున్నార‌బ్బా..! ఆ ఆస్థాన ప‌ద‌వి ఎవ‌రికిచ్చి ఉంటాడు..? అని కూడా డౌటొస్తుందంట కొంద‌రికి. ఇంకెవ‌రికి.. వేముల ప్ర‌శాంత్‌రెడ్డికో.. ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డికో.. ఇచ్చి ఉంటాడు. స్వామిభ‌క్తి ప‌రాయ‌ణం చేయ‌డంలో, కేసీఆర్‌ను అర్థం చేసుకుని మ‌స‌లుకోవ‌డంలో వారు కూడా డిగ్రీలు తీసుకుని ఉన్నారు. కాబ‌ట్టి ఈ విధంగా సంతోష్‌రావుకు ముక్తి, విముక్తి దొరికి ఉంటుందా? అనే చ‌ర్చా జ‌రుగుతున్న‌ది.

అత‌గాడు తీసిన ఫోటోలు త‌న ట్విట్ట‌ర్‌లో పెట్టుకోవ‌డ‌మే కాదు… కేసీఆర్ మాన‌స పుత్రిక న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లోనూ అచ్చేసుకుంటున్నాడ‌ట‌. ఏదో ర‌కంగా త‌న పేరును ఇటు రాజ‌కీయ నాయ‌కులు.. అటు జ‌నాలు మ‌రిచిపోవ‌ద్ద‌నే కావొచ్చు. కానీ ఆ ఫోటోలు.. బాగా ఎక్స్‌ప‌ర్ట్ తీసిన‌విగా, ఫ్రొఫెష‌న‌ల్ ఫోటోగ్రాఫ‌ర్ తీసిన‌ట్టుగా ఉంటున్నాయ‌ట‌… మ‌ళ్లీ ఇక్క‌డ డౌట్ ప‌డుతున్నారు. ఇంత‌కీ ఇవి మ‌న సంత‌న్న తీసిన‌వేనా? అని. అవును.. చెప్ప‌డం మ‌రిచాను.. మ‌ధ్య‌లో ఆ ఎర్ర‌వ‌ల్లి ఫామ్‌హౌజ్‌లోని జంతుజాలాలు, ప‌శుప‌క్షాదుల ఫోటోల‌ను కూడా తీశాడంటండోయ్‌!

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×