E-Paper
Advertisement

అంత‌టా ఒక‌లెక్క‌.. ఇక్క‌డో లెక్క‌..! త‌మిళ తంబీల వ‌ద్ద అమిత్ షా ఆట‌లు సాగ‌లే..!

అంత‌టా ఒక‌లెక్క‌.. ఇక్క‌డో లెక్క‌..! త‌మిళ తంబీల వ‌ద్ద అమిత్ షా ఆట‌లు సాగ‌లే..!
Advertisement

అమిత్ షా చాణ‌క్యం ముందు రాజ‌కీయాల‌న్నీ త‌న వ్యూహంలో చిక్కుకోవాల్సిందే. ప్ర‌తికూల ప‌రిస్థితులున్నా.. కొంచెం సందు దొరికితే చాలు.. ఇసుంట ర‌మ్మంటే ఇళ్లంతా నాదే .. అని చుట్టేసి క‌ట్ట‌క‌ట్టేయ‌డం అమిత్ జీ స్టైల్‌. బీజేపీ నేత‌లంతా ముద్దుగా అత‌న్ని మోటు భాయ్ అని పిలుచుకుంటారు. కొన్నేండ్ల కింద అస‌లు ఉనికే లేని ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఏకంగా బీజేపీ ప్ర‌భుత్వ‌మే ఏర్పాటు చేసేలా వ్యూహాలు ప‌న్ని, చ‌క్రాలు వేసి, ఎత్తుల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టి క‌రిపించి…. వింటే గౌర‌వం.. విన‌క‌పోతే వీక్నెస్ మీద దెబ్బ‌.. బెదిరింపు రాజ‌కీయాలు.. న‌యానో.. భ‌యానో.. ఏదో ఒక‌టి మొత్తానికి ఆ రాజ‌కీయం త‌మ గుప్పిట్లోకి వచ్చేయాలి. ఈ ఆట‌లో ఆరితేరిన నేత అమిత్ షా. ప‌శ్చిమ బెంగాల్‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు కాగానే ఒక్క‌సారిగా ఆశ‌లు పుట్టాయి తెలంగాణ నేత‌ల‌కు, ఇక్క‌డి కాషాయ ద‌ళానికి.

తెలంగాణ‌లో కూడా ఒంట‌రిగా, సొంతంగా పార్టీని అధికారంలోకి తేవ‌డం క‌ల్ల‌. ఆ విష‌యం వారికి స్ప‌ష్టంగా తెలుసు. ఎడారిలో ఒయాసిస్సులా అమిత్ షా మీద వారికో న‌మ్మ‌కం. ధైర్యం. ఏమైనా చేస్తాడు… పార్టీని ప‌వ‌ర్‌లోకి తెస్తాడు..! ఇదే ధీమా. అందుకే బెంగాల్‌లో ఫ‌లితాలు వన్ సైడ్ రావ‌డంతో .. మోటు భాయ్ జ‌ర వ‌చ్చి మా తెలంగాణ‌లో కుర్చీ వేసుకుని కూర్చోరాదే..! అని బ‌తిమాలుతూ బీజేపీ శ్రేణులు పోస్టులు పెట్ట‌డం ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం. అలాంటి అమిత్ షా..కు కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికిన‌ట్టే త‌మిళ రాజ‌కీయాలు ఆశ చూపాయి. ఇక్క‌డా త‌న ప్ర‌తాపం చూపుదామ‌నుకున్నాడు. మిత్రుడిగా చేతులు కలిపేందుకు ససేమిరా అని త‌మ‌కు శ‌త్రువుగా మారిన విజ‌య్‌పై ప్ర‌తీకారం తీసుకునేందుకు ఇదే మంచి స‌మ‌య‌మ‌ని భావించాడు. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు.. అన్న‌ట్టుగా విజ‌య్ పై ప్ర‌తీకారం.. చాన్సుంటే.. అన్నాడీఎంకును ప‌వ‌ర్‌లోకి తెచ్చే ప‌న్నాగం. అది క‌ల‌లో కూడా జ‌ర‌గ‌ద‌ని తెలుసు.

Advertisement

కానీ అమిత్ షాకు త‌న‌పైన త‌న‌కు అమిత‌మైన అతి విశ్వాసం. చూద్దాం. త‌న‌దైన స్టైల్లో ప్ర‌య‌త్నిస్తే పోలా..! అని అన్ని దారులు స‌ర్చ్ చేశాడు. ఎత్తుల‌న్నీ వేశాడు. న‌క్క‌జిత్తుల‌న్నీ ప్ర‌ద‌ర్శించాడు. రాహుల్ ఇక్క‌డ వెలిగిపోతుంటే.. తాము మ‌రింత మ‌స‌క‌బారిపోతుంటే.. అమిత్ షా క‌డుపు స‌ల‌స‌లాకాగింది. తిక్క‌రేగింది. గ‌వ‌ర్న‌ర్‌ను పావుగా వాడుకున్నాడు. ఆ గ‌వ‌ర్న‌ర్ అమిత్ షా చెప్పిన‌ట్టే నాలుగు రోజులు విజ‌య్‌కు నర‌కం చూపాడు. నిద్ర‌లేని రాత్రులే మిగిల్చాడు. మ్యాజిక్ ఫిగ‌ర్ పేరుతో.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తి ఇవ్వ‌కుండా.. అన్నాడీఎంకేతో పాటు డీఎంకే మిత్ర‌ప‌క్షాల‌కు ఆశ‌లు రేపాడు. బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌కు తావిచ్చాడు. ఇదే మంచి చాన్సు ఏం కావాలో అడ‌గండి.. లేదంటే మీ దారి మీరు చూసుకోండి.. అనే సంకేతాలు పంపాడు.

చివ‌ర‌కు అమిత్ షా.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు స‌భ్యుల‌ను కూడా లాగేద్దామ‌నే ప్లాన్ చేశాడు. అయితే ఈడీ లేదా సీబీఐ.. కేసుల భ‌యం పెట్టి త‌మ గూట్లోకి లాక్కోవ‌డం.. పార్టీ మార‌గానే బారా ఖూన్ మాఫీ చేసేసి.. ధ‌ర్మం కోసం దేశం కోసం.. అనే ట్యాగ్‌లైన్ త‌గిలించ‌డం వారికి అల‌వాటు. ఇదే త‌ర‌హా రాజ‌కీయం అక్క‌డ చేయ‌బోయాడు. దీన్ని ప‌సిగ‌ట్టిన రాహుల్ వెంట‌నే వీరిని హైద‌రాబాద్ క్యాంపుకు త‌ర‌లించారు. మాకు ద‌క్క‌నిది ఇంకెవ్వ‌రికీ ద‌క్క‌నివ్వ‌ను.. అన్న‌ట్టుగా శాడిస్టిక్ ప్లెజ‌ర్ ల‌క్ష‌ణాలు ఇక్క‌డా అద్భుతంగా అమలు చేశాడు అమిత్ జీ. కానీ అవి ఫలించ‌లేదు. త‌మిళ తంబీలు అమిత్ షా ఆట‌లు సాగ‌నివ్వ‌లేదు. మొద‌టి నుంచి త‌మిళ‌నాడు రాజ‌కీయాలు..బీజేపీకి పూర్తి విరుద్దం. ఆ మాట‌కొస్తే జాతీయ పార్టీల‌కు ఇక్క‌డ చాన్సు లేదు. కానీ కాంగ్రెస్ తాజా ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా మలుచుకున్న‌ది. విజ‌య్‌తో జ‌త క‌ట్ట‌డంతో ప‌వ‌ర్‌లో కీల‌క భూమిక పోషించ‌నుంది. అమిత్ షా మాత్రం అన్నీ చేసి మీకో దండం రా బాబు..!అని తోక‌ముడిచాడు త‌మిళ‌నాట‌! మొత్తానికి త‌మిళ థ్రిల్ల‌ర్‌లా సాగిన రాజ‌కీయానికి ఎట్ట‌కేల‌కు శుభం కార్డు ప‌డింది.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×