E-Paper
Advertisement

పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ! కేటీఆర్ తిట్ల వ్యూహానికి చిక్క‌ని రేవంత్‌! రెచ్చ‌గొట్టే రాజ‌కీయ‌ ఉచ్చులో ఇరుక్కోని సీఎం..!

పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ! కేటీఆర్ తిట్ల వ్యూహానికి చిక్క‌ని రేవంత్‌! రెచ్చ‌గొట్టే రాజ‌కీయ‌ ఉచ్చులో ఇరుక్కోని సీఎం..!
Advertisement

కేసీఆర్‌ది ఓ ర‌క‌మైన రాజ‌కీయ వ్యూహం. ఆ వ్యూహాన్ని అందిపుచ్చుకోలేక‌పోయాడు కేటీఆర్‌. త‌న‌దైన కొత్త వ్యూహం.. కొత్త రాజ‌కీయ పంథాతోనే పోతున్నాడు. ప‌దే ప‌దే వేదిక‌ల మీద త‌న‌కు తానుగా నేను కేసీఆర్ అంత మంచోడ్నైతే కాదు అని ప్ర‌క‌టించుకుంటుంటాడు కూడా. అంతే కాదు.. మేం అధికారంలోకి రావ‌డం ప‌క్కా వ‌చ్చిన త‌రువాత మా పింక్ బుక్కులో మీ పేర్లు ఎక్కిస్తాం.. ఎవ‌రినీ వ‌ద‌లం.. దేశం వ‌దిలి పెట్టి పారిపోయినా విడ‌వం.. రైట‌ర్మెంట్ అయినా ప‌ట్టుకొస్తాం.. అని ఐఏఎస్‌ల‌ను, ఐపీఎస్‌ల‌ను బెదిరిస్తూ ఉంటాడు.

ఇదీ త‌న‌కు వ‌చ్చిన న‌యా రాజ‌కీయం. న‌చ్చిన రాజ‌కీయం. అది కేసీఆర్‌కు ఇష్టం ఉండ‌దు. రెచ్చ‌గొట్టే రాజ‌కీయాల‌కు మ‌నం స్పందిస్తే.. వారు వేసే ఉచ్చులో ఇరుక్కున్న‌ట్టు లెక్క‌.. అనేది కేసీఆర్ స్ట్రాట‌జీ. ప‌లుమార్లు కేటీఆర్‌ను త‌న‌దైన పోక‌డ‌ల స్పీచ్ చేయొద్ద‌ని వారించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌ట‌. ఈ విష‌యం కూడా స్వ‌యానా కేటీఆరే ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చెప్పుకున్నాడు కూడా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. రేవంత్ కూడా కేసీఆర్ స్ట్రాట‌జీనే ఫాలో అవుతున్న‌ట్టున్నారు. వాస్త‌వంగా చెప్పాలంటే.. రేవంత్‌ది కూడా దూకుడు మ‌న‌స్త‌త్వ‌మే. వెంట‌నే మాట‌కు మాట‌.. పోటుకు పోటు అనే రేంజ్‌లో ఆయ‌న ప్ర‌తిస్పంద‌న ఉంటుంది. వెంట‌నే కౌంట‌ర్ ఇవ్వ‌డం, ఇప్పించ‌డం కూడా ఆయ‌న‌కు అల‌వాటు.

Advertisement

పీసీసీ చీఫ్ హోదాలో ఆయ‌న‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేసింది కూడా ఆ దూకుడే. ఇదే దూకుడు ఆయ‌న సీఎం అయిన తరువాత కూడా కంటిన్యూ చేశారు. మొన్న‌టి వ‌ర‌కు కూడా. కేసీఆర్ బాగా రోజుల త‌రువాత బ‌య‌ట‌కు వ‌చ్చి పెట్టిన జ‌గిత్యాల బ‌హిరంగ స‌భ‌కు పోటీగా త‌ను స‌భ పెట్టి కౌంట‌ర్ ఇచ్చారు. కేసీఆర్ ఆరోప‌ణ‌ల‌కు గ‌ట్టిగా తిప్పికొట్టారు. మొన్న‌టికి మొన్న పార్టీ ప్లీన‌రీ స‌మావేశానికి తెలంగాణ భ‌వ‌న్‌కు వ‌చ్చి మాట్లాడిన కేసీఆర్ మాట‌ల‌కూ.. అదే స‌మ‌యంలో త‌నే మీడియాతో చిట్‌చాట్‌లో ఏకిపారేశారు. ఎక్క‌డా టైమ్ తీసుకోలేదు. వెంట వెంట‌నే జ‌వాబులిచ్చేస్తున్నారు.

ఈట్ కా జ‌వాబ్ ప‌త్తార్ సే అన్న‌ట్టుగానే రేవంత్ పొలిటిక‌ల్ కౌంట‌ర్లుంటాయి. మొన్న‌టి వ‌ర‌కు ఉన్నాయి కూడా. కానీ అక‌స్మాత్తుగా ఆయ‌న త‌న ట్రెండ్ మార్చుకున్న‌ట్టు క‌నిపించింది. తాజాగా వ‌రంగ‌ల్‌లో కేటీఆర్ లీడ‌ర్ షిప్‌లో కేసీఆర్ ఏర్పాటు చేయించిన రైతు సంగ్రామ స‌దస్సు బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడాడు. త‌ను ఇంతకు ముందు అలా ఎప్పుడూ మాట్లాడ‌లేదు. సీఎంపై ప‌రుష ప‌ద‌జాలం ఉప‌యోగించాడు. తిట్ల పురాణం అందుకున్నాడు. క‌చ్చితంగా ఆ మాట‌లు రైతుల కోసం కాకుండా .. రాజ‌కీయంగా రేవంత్‌ను టార్గెట్ చేయ‌డం.. రెచ్చ‌గొట్టి త‌న వ్యూహంలో చిక్కుకునేలా చేసి.. సీఎంను బ‌జారుకీడ్చాల‌నేది కేటీఆర్ ఎత్తుగ‌డ‌. రేవంత్ అప్పుడు లోక‌ల్‌లో లేరు.

Advertisement

కానీ కేటీఆర్ మాట్లాడిన వెంట‌నే రంగంలోకి కాంగ్రెస్ నేత‌లంతా దిగారు. రేవంత్ ఆదేశాల‌తోనే వారంతా కేటీఆర్‌పై మాట‌ల దాడికి దిగార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. మామూలుగా తిట్ట‌లేదు. అద్దంకి దయాక‌ర్ అయితే.. నువ్వు కేసీఆర్‌కే పుడితే.. అన్న ప‌దం వాడ‌టం కూడా రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపింది. తిట్టి మ‌రీ తిట్టించుకున్న కేటీఆర్‌కు.. అస‌లు వ్యూహం ఫ‌లించ‌లేదు. ఎలాగైనా సంద‌ర్భం రాగానే… అదీ త‌క్కువ స‌మ‌యంలోనే రేవంత్ త‌న మాటల‌కు స్పందిస్తార‌ని కేటీఆర్ ఆశించాడు. ఊహించాడు. అనుకున్న‌ట్టుగానే ఢిల్లీ నుంచి రేవంత్ రాగానే.. కొడంగ‌ల్‌లో టూర్ పెట్టుకున్నారు. దాంతో పాటే ష‌రా మామూలుగా బ‌హిరంగ స‌భ కూడా. ఇక అంతా అటు వైపే చూశారు.

ప్ర‌ధానంగా కేటీఆర్ అండ్ టీమ్ అయితే ఉత్కంఠ‌గా ఎదురుచూశారు. రేవంత్ త‌మ రెచ్చ‌గొట్టే రాజ‌కీయ ఉచ్చులో చిక్కుకుని ఊగిపోతార‌ని ఊహించారు. కానీ వారంద‌రినీ అవాక్క‌య్యేలా చేశారు రేవంత్‌. వారి ఊహ‌కంద‌ని విధంగా.. కేటీఆర్ ఊసుగానీ, బీఆరెస్ మాట‌గానీ, అస‌లు రాజ‌కీయ ర‌గ‌డ ప్ర‌స్తావ‌న గానీ ఎక్క‌డా తీసుకురాలేదాయ‌న‌. మీరు పిల్ల‌లురా.. అలా ప‌క్క‌కు వెళ్లి ఆడుకోండి..! అని ఏదో సినిమాలో కామెడీ పంచ్ డైలాగుంటుంది. అలా లైట్‌గా తీసిపారేశారు రేవంత్ .. కేటీఆర్ మాట‌ల‌ను. రేవంత్ టార్గెట్ కేసీఆర్‌.. కేటీఆర్ కాదు అనే విష‌యం కూడా ఇలా ప‌రోక్షంగా మ‌రోమారు తెలియ‌జేసిన‌ట్ట‌య్యింది కొడంగ‌ల్ వేదిక సాక్షిగా.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×