E-Paper
Advertisement

ప్ర‌కాశ్‌రాజ్‌కు ఇక‌పై ఇక్క‌డ‌ సినిమాలు లేవు! అయినా, అత‌ని నోరు మూయించ‌గ‌లరా?

ప్ర‌కాశ్‌రాజ్‌కు ఇక‌పై ఇక్క‌డ‌ సినిమాలు లేవు! అయినా, అత‌ని నోరు మూయించ‌గ‌లరా?
Advertisement

బిగ్‌బాస్ జోలికొస్తే బాక్సులు బ‌ద్ద‌ల‌వుతాయి. ఆమాత్రం తెలియ‌దా మ‌రి ప్ర‌కాశ్‌రాజ్‌కు. ఎందుక‌లా నోరు పారేసుకుంటున్నాడు. నేను చెప్పేది.. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి! అన్న చిరంజీవి అంటే వీరాభిమానమే. అది న‌ట‌న ప‌రంగా. వ్యక్తిగ‌తంగా. ఆయ‌న ఎదిగిన స్వ‌యంకృషి నేప‌థ్య ప‌రంగా. అదంత వ‌ర‌కే. ఒక‌వేళ ఇప్ప‌టికీ చిరంజీవి రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉంటే.. త‌న సిద్దాంతాల‌కు దూరంగా ఉంటే.. త‌న‌కు న‌చ్చ‌ని భిన్నాభిప్రాయాల‌తో ఉంటే అత‌ను ఏకీభ‌వించ‌డు. విరుచుకుప‌డ‌తాడు. విమ‌ర్శిస్తాడు. దేనికీ భ‌య‌ప‌డ‌డు. అన్న‌మాట‌ను జ‌వ‌దాట‌డు. వెన‌క్కి త‌గ్గ‌డు.

చిరంజీవి రాజ‌కీయ‌ల్లో లేడు. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నాడు. ప‌వ‌న్ అంటే కూడా ఇష్ట‌మే. అది న‌ట‌నాప‌రంగా. మ‌రి రాజ‌కీయంలో త‌ప్ప‌ట‌డుగులు వేస్తూ త‌త్త‌ర‌పాటు, బిత్త‌ర‌చూపులు చూసే ఈ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే.. అస్స‌లు ప‌డ‌దు. అందుకే అలా నోరిచ్చుకుప‌డిపోతా ఉంటాడు. కామెంట్ల‌తో కారం పూస్తా వుంటాడు. చ‌మ‌త్కారాల‌తో చురుకులు పెడ‌తా ఉంటాడు. వెట‌కారాలతో వెక్కిరిస్తూ ఉంటాడు. ప‌వ‌న్ నుంచి వ‌చ్చే మాట‌ల్లోని మ‌ర్మాన్ని గ్ర‌హించి దాన్ని సూటిగా, ఘాటుగా కండ కండాలుగా ఖండిస్తూ ఉంటాడు. అదీ ఇప్పుడు తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో మంట‌లు రేపుతోంది.

Advertisement

ప‌వ‌న్ కేవ‌లం అల్లాట‌ప్పా రాజ‌కీయ నాయ‌కుడేం కాదు. చిరంజీవికి త‌మ్ముడు. ఏపీ డిప్యూటీ సీఎం. చంద్ర‌బాబు కూట‌మిలో భాగ‌స్వామి. తెలుగు సినీ ఇండ‌స్ట్రీని ఏలుతున్న క‌మ్మ‌రాజ్యంలోని కీల‌క న‌టుడు బాల‌క్రిష్ణ స‌పోర్టు. నిర్మాత‌ల జుట్ల‌న్నీ వీళ్ల చేతుల్లో ఉండ‌గా.. ఇక బుద్దున్నోడెవ‌డైనా సినిమా ఛాన్సులిస్తారా? అన‌ధికారికంగా అప్పుడే ఆదేశాలు వెళ్లిపోయాయి. ప్ర‌కాశ్‌రాజ్‌కు ఇక‌పై సినిమా ఛాన్సులుండ‌వు. అయినా, డోంట్ కేర్‌. అత‌ని అవ‌కాశాలు ఆప‌గ‌ల‌రే కానీ.. నోటిని ఆప త‌ర‌మా? ఆయ‌న భావ‌జాలాన్ని బంధించ‌గ‌ల‌రా? నోటిని మూయించ‌గ‌లరా? ఆ గ‌ళం ప్ర‌శ్నిస్తూనే ఉంటుంది. ఇక్క‌డ ఏపీ, తెలంగాణ‌లో కాకుంటే అత‌నికి దేశ వ్యాప్తంగా వ‌చ్చే అవ‌కాశాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌గ‌ల‌రా? ఇప్పుడిదే డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. సోష‌ల్ మీడియాలో అత‌నికి వెల్లువ‌లా మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో పాటు ఏపీ రాజ‌కీయాలు, కొంద‌రి చేతుల్లో బందీ అయి ఉన్న తెలుగు సినీ ఇండ‌స్ట్రీపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ప్ర‌కాశ్‌రాజ్ .. ఇక్క‌డ ప‌వ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా దూషించే ప‌నిని పెట్టుకోలేదు. అత‌ను త‌మిళ‌నాడును, కేర‌ళ‌ను, మోడీని.. ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. త‌న‌కు న్యాయ‌మ‌నిపించింది మాట్లాడుతున్నాడు. అన్యాయ‌మైతే నిల‌దీస్తున్నాడు. ప్ర‌కాశ్ రాజ్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు వారివ‌ద్ద స‌మాధానాల్లేవు. అందుకే గుడ్డిగా వ్య‌తిరేకిస్తున్నారు. మీద ప‌డి క‌రిచేస్తున్నారు. చివ‌ర‌కు బిగ్‌బాస్ మెప్పు పొందేందుకు.. బ‌ట్ట‌లు చింపుకుంటున్నారు కొంద‌రు నిర్మాత‌లు. మా రాజకీయాల‌తో నీకేం ప‌నిరా అంటున్నాడు బండ్ల గ‌ణేశ్‌. మ‌రి జాతీయ‌వాదం ముసుగులోనే క‌దా ప‌వ‌న్ తెలంగాణ‌లో చిచ్చు రేపే ప్ర‌య‌త్నం చేసింది! ఆ వ‌చ్చిన విధాన‌మే క‌దా ఇక్క‌డెవ‌రికీ న‌చ్చనిది! ఈ అస‌లు మూలం తెలుసుకోరు.

Advertisement

అందులో దాగి ఉన్న వ్యూహం తెలుసు క‌నుక‌. వ‌స్తే ఓపెన్‌గా రా. బీజేపీతో క‌లిసి పోటీ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించుకో. అంతేగానీ రెచ్చ‌గొట్టి.. విడ‌గొట్టి.. విధ్వేషాలకు బీజం వేసే ఆ తీరే క‌దా అంద‌రికీ ఆక్షేప‌నీయం. దీన్నే ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌శ్నించాడు. నీకు సినిమాలు లేవు.. వేశాలు లేవు..! అని బెదిరిస్తున్నారు. చాలాసార్లే ఈ గెంటివేత‌లు చేశారు. కానీ గెంటేశామ‌నుకుని త‌మను అభిమానించే ప్ర‌జ‌ల మ‌న‌సుల నుంచి గెంటేయ‌బ‌డుతాం అని తెలుసుకోక‌పోవ‌డ‌మే ఇక్క‌డ అస‌లైన విషాదం! ఆ నోరును మూయించ‌లేరు… అనేది న‌గ్న‌స‌త్యం!

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×