E-Paper
Advertisement

కేఏ పాల్ ను మైమ‌ర‌పించేలా! పాలిటిక్స్‌లో పేలుతున్న సినిమా పంచులు.. ! వెట‌కార‌పు వెక్కిరింపులు..

కేఏ పాల్ ను మైమ‌ర‌పించేలా! పాలిటిక్స్‌లో పేలుతున్న సినిమా పంచులు.. ! వెట‌కార‌పు వెక్కిరింపులు..
Advertisement

అన్ని టైంపాస్ రాజ‌కీయాలై పోయాయి. ఒక‌రిపై మ‌రొక‌రు వేసుకునే సినిమా పంచులు భ‌లే ర‌క్తి క‌ట్టిస్తున్నారు. ఒక‌ప్పుడు సినిమాలో హీరో.. హుందాగా, గంభీరంగా ఉంటాడు. అవ‌స‌ర‌మైతే గానీ కామెడీ చేయ‌డు. ఇప్పుడు ట్రెండ్ మారింది… హీరోనే అన్ని పాత్ర‌లు వేసేస్తున్నాడు. స‌క‌ల క‌ళావ‌ల్ల‌భుడిలా అన్ని ఫ్రేముల్లో త‌నే క‌నిపిస్తున్నాడు. సేమ్ అట్ల‌నే త‌యార‌య్యింది తెలుగు రాజ‌కీయం.

వారే హీరోలు.. వారే విల‌న్లు, క‌మేడియ‌న్లు.. ! సీరియ‌స్‌గా స‌వాల్ విసిరినా.. కామెడీగా జోకులు చెప్పినా.. మ‌ధ్య మ‌ధ్య‌లో సంద‌ర్బోచితంగా సినిమా డైలాగులు చెప్పినా.. సినిమా పాత్ర‌ల‌ను రాజ‌కీయాలకు అన్వ‌యించినా.. ! మొత్తానికి సీరియస్ సినిమాలో కామెడీ కూడా క‌ల‌గ‌లిసి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తున్నారు జ‌నానికి.

Advertisement

రాజ‌కీయాల్లో కేఏ పాల్ త‌ర‌హా టైమింగ్ కామెడీ మిస్ అవుతున్నామ‌ని అప్పుడ‌ప్పుడు భావిస్తూ ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన జ‌నాలు. ఇప్పుడు ఆ పాత్ర లేకున్నా ఆ లోటు లేకుండా తెలుగు నేత‌లే అన్ని పాత్ర‌ల్లో క‌నిపించేస్తున్నారు. వాళ్ల మాట‌లే మీమ‌ర్స్‌గా మారుతున్నాయి. రోజుకో మాట‌.. పూట‌కో కామెంట్‌.. బూతూల స‌మాహారంగా సాగే ఆ సంభాష‌ణ‌లు బాగుంటున్నాయి. పేలుతున్నాయి. న‌వ్వులు కురిపిస్తున్నాయి.

క‌డుపుబ్బా న‌వ్విస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఒక్కోసారి ఏవ‌గింపు కూడా క‌లిగిస్తున్నాయి. ఇవేం రాజ‌కీయాలురా బాబూ.. ! అని మారిన కొత్త ట్రెండ్ ప‌ట్ల పెద‌వి విరుపులు కూడా క‌నిపిస్తున్నాయి. కెమెరా మెన్‌ గంగ‌తో రాంబాబు త‌ర‌హా పాత్ర‌లో ప‌వ‌న్ జీవించేస్తున్నాడు. త‌ను రెచ్చిపోయి ఊగిపోయే విధంగా చెప్పులు చూపిస్తూ న‌ర‌కుతా, చంపుతాన‌నే డైలాగులు.. వారి మ‌టుకు అవి క‌రెక్టే. అవే డైలాగులు త‌మ మీదే తిప్పి కొడితే అవి దేశం ద్రోహం కింద‌కు వ‌స్తాయి.

Advertisement

గొడ్డ‌లి పార్టీ అని ఒక‌రంటారు. మేక‌ప్ మంత్రిని ఓ మ‌హిళా మంత్రినే కించ‌ప‌రుస్తాడు ఇంకొక‌డు. ఐరెన్ లెగ్ డైలాగ్ కామ‌న్.. ఇవ‌న్నీ ఆంధ్ర రాజ‌కీయాల్లోని కొన్ని చమ‌త్కారాలే. ఇక తెలంగాణ‌లో సినిమాల డైలాగులు, పాత్ర‌లు కూడా బాగా ఔపోస‌న ప‌ట్టి వాటిని సంద‌ర్బోచితంగా, విరివిగా, విచ్చ‌ల‌విడిగా వాడేస్తున్నారు.

అరుంధ‌తిలో ప‌శుప‌తిని గుర్తు చేస్తారొక‌రు. బ‌హుబ‌లిలో బ‌ల్లాల‌దేవ గ‌తి ప‌డుతుందిరోయ్ నీకు..!అని కౌంట‌ర్ ఇస్తారు మ‌రొక‌రు. క్ష‌ణంలో దొరికిపోయే బ్ర‌హ్మానందం కామెడీ పాత్ర‌తో పోలుస్తారు ఒక‌రు.. సై సినిమాలో వేణుమాధ‌వ్ పాత్ర‌కు ప‌ట్టిన గ‌తే ఇక మీకు కాస్కోండ‌ని ఇంకొక‌రంటారు.

మీ ఇంటి కొస్తా.. నీ న‌ట్టింటికొస్తా టైపు డైలాగులా.. డేట్ నువ్వుచెప్పినా స‌రే, ప్లేసూ నువ్వే చెప్పు.. ఎక్క‌డైనా స‌రే, ఎక్క‌డైనా స‌రే, సింగిల్ హ్యాండ్ గ‌ణేశ్‌..!అని తొడ‌లు చ‌రిచి స‌వాల్ విసురుకుంటారు. స్పైడ‌ర్ సినిమాలో దొంగ‌చాటుగా ఫోన్లు విన్న‌ట్టుగా మాకు అలా ఆలుమ‌గ‌ల ఫోన్లు వినే అల‌వాటు లేదురా బాబు..! మ‌ని నైతికంగా దెబ్బ‌తీసి.. పాతిపెట్టే పోలిక‌తో మరొక‌రు అస్త్రం సంధిస్తారు.

పొట్టోడా అని ఒక‌డు తిడ‌తాడు. నువ్వెంత ఉన్న‌వురా లిల్లీపుట్ అని మ‌రొక‌డంటాడు. తాటిచెట్టు అనేది ఒక పోలిక‌, గుంపుమేస్త్రీ అనేదే ఒక పేరు మోసిన నిక్‌నేమ్ ఇప్పుడు ఇక్క‌డ‌. గుంట‌న‌క్కను పోలిన నేత‌గా అభివ‌ర్ణ‌న‌.. ! హ‌ద్దుల్లేని బాడీ షేమింగ్ మాట‌లు.. వ‌ర‌ద‌లా సినిమా డైలాగులు.. బుర‌ద‌  జ‌ల్లుకునేలా బూతుల తిట్లు.. నిస్సుగ్గుగా నిక్‌నేమ్‌లు.. !

ఇవ‌న్నీ నేత‌లే స్వ‌యంగా చేస్తుంటే.. ఇక మ‌ధ్య‌లో కామెడీ మ‌న‌కేలా? అందుకే అత‌న్ని ఎవ‌రూ గుర్తు చేసుకోవ‌డం లేదు. ఏకే పాల్ కామెడీని కూడా మైమరిపించే స్థాయికి ఎదిగారు మ‌న తెలుగు నేత‌లు.. అని అనుకుంటున్నారంతా! గ‌ర్వంగా, కామెడీగా, సిగ్గుగా, అవ‌మానంగా..

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×