E-Paper
Advertisement

గ‌ద్ద‌ర్‌ను వ‌ద‌ల‌ని ప‌వ‌న్‌..! ప‌వ‌న్‌ను వ‌ద‌ల‌ని బీజేపీ! పాపం.. తెలంగాణ‌!

గ‌ద్ద‌ర్‌ను వ‌ద‌ల‌ని ప‌వ‌న్‌..! ప‌వ‌న్‌ను వ‌ద‌ల‌ని బీజేపీ! పాపం.. తెలంగాణ‌!
Advertisement

ప‌వ‌న్ ఇంకా గ‌ద్ద‌ర్‌ను వ‌ద‌ల్లేదు. ఇప్ప‌ట్లో వ‌ద‌లేలా లేడు కూడా. తెలంగాణ మీ అయ్యా జాగీరా అని మొన్న అన్నరోజే .. గ‌ద్ద‌ర్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చాడు ప‌వ‌న్‌. ఆయ‌న‌కు కారు కొనిచ్చాన‌న్నాడు. ఇది వివాద‌మై కూర్చున్న‌ది. గ‌ద్ద‌ర్ ప‌రిచ‌యం ఉంటే ఉండొచ్చు గాక‌.. కానీ ఆయ‌న‌కు కారు కొనిచ్చాన‌ని అన‌డం వెనుక‌.. మా ఇద్ద‌రి మ‌ధ్య అంత సాన్నిహిత్యం ఉంద‌ని చెప్పుకోవ‌డానికి ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని దిగ‌జార్చేలా ఆ వ్యాఖ్య‌లున్నాయ‌ని తెలంగాణ వాదులు మండిప‌డ్డారు.

ఇక తెలంగాణ‌లో నేను పోటీ చేస్తా.. ఎవ‌డు అడ్డుకుంటాడో అడ్డుకోండ‌ని.. ఆయ‌న‌కు ఆయ‌నే జ‌బ్బలు చ‌రుచుకుని పోయాడు. ఆ త‌రువాత ఢిల్లీలో మీటింగు పెట్టి.. అక్క‌డ బీజేపీ పెద్ద‌ల వ‌కాల్తా పుచ్చుకున్నాడు. కేంద్రం మెడ‌లు వంచుతా.. అని పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడి ఢిల్లీకి రాగానే పిల్లుల్లా మారిపోతార‌ని తెలంగాణ నేత‌ల‌నుద్దేశించి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు ప‌వ‌న్‌. ఇలా రెచ్చ‌గొట్టే దోర‌ణి ద్వారానే తొంద‌ర‌గా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చేరువ కాగ‌లుగుతాన‌ని అనుకున్నాడు కాబోలు.

Advertisement

లేదా ఇక్క‌డి రాజ‌కీయ‌ల్లో తొంద‌ర‌గా త‌న‌కంటూ ఓ స్పేస్ దొర‌కాలంటే.. ఇదే విధానం క‌రెక్ట‌ని ఫిక్స‌యి ఉంటాడు. కానీ మ‌ళ్లీ కొత్త‌గా ఇవాళ గ‌ద్ద‌ర్ ఫోటోల‌తో ద‌ర్శ‌న‌మిచ్చాడు ప‌వ‌న్‌. సోష‌ల్ మీడియాలో గ‌ద్ద‌ర్‌తో అప్ప‌ట్లో దిగిన పాత ఫోటోల‌ను త‌న జ‌నసేన పార్టీ వాల్‌పై విడుద‌ల చేశాడు. ఆ ఫోటోలు దిగిన సంద‌ర్బాల‌ను కూడా సవివ‌రంగా వివ‌రించాడు. అంతా బాగానే ఉంది. కానీ.. అవి ఇప్పుడెందుకు?? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌య్యాయి.

మీరు చెబితే న‌మ్మ‌డం లేదుక‌దా.. కారు కూడా కొనిచ్చానంటే గొప్ప‌లు చెబుతున్నాన‌ని అనుకున్నారు క‌దా! ఇదిగో చూసుకోండి.. మీ మిద్ద‌రం ఒక‌రికొక‌రం ఎంత‌కాలంగా ప‌రిచ‌య‌మో? అని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. కేవ‌లం ప‌రిచ‌య‌మే కాదు.. మీమిద్ద‌రం చాలా క్లోజ్ కూడా. అంటే మా ఇద్ద‌రి భావ‌జాలాలు ఒక‌టేన‌ని ఇప్ప‌టికైనా ఒప్పుకుంటారా? లేదా? అని తెలంగాణ లీడ‌ర్ల‌ను, ప్ర‌జ‌ల‌ను నిల‌దీసి అడిగినంత ప‌నిచేస్తున్నాడు.

Advertisement

ఇదేం గొడ‌వ‌రా నాయ‌నా? అని నీకు తెలంగాణే దొరికిందా? అక్క‌డ ఏపీలో అంతా ఆగ‌మాగమ‌వుతుంటే.. పాపం బాబుగారిని వ‌దిలేసి.. ఇక్క‌డేదో అర్జెంటుగా నీ అవ‌స‌రం ఉంద‌ని క‌ల వ‌చ్చిన‌ట్టు… త‌ట్టాబుట్టా స‌ర్దుకుని పోలోమ‌ని వ‌చ్చి.. పొగ‌బెట్టేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డమెందుకు? అని తెలంగాణ ప్ర‌జ‌లు నిలదీస్తున్నారు. అయినా విననంటున్నాడు ప‌వ‌న్‌.

గ‌ద్ద‌ర్‌ను వ‌ద‌లంటున్నాడు ప‌వ‌న్‌. ప‌వ‌న్‌ను కూడా మేం వ‌ద‌ల‌మంటున్నారు ఇక్క‌డి బీజేపీ నేత‌లు. అవును మ‌రి ఇప్పుడు ప‌వ‌న్ త‌ప్ప ఆ పార్టీకి దిక్కులేద‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు వారు. పైన మోడీ శాసించాడు. ఇక్క‌డ ప‌వ‌న్ పాటిస్తాడు.. మేము అత‌న్ని అనుస‌రిస్తాము.. అంతే..! ఎవ‌రేం అనుకుంటే మాకేంటీ? ఎవ‌రు న‌వ్విపోతే మాకేంటీ? మాక్కావాల్సింది అధికారం. ప‌వ‌న్‌తో అది మాకు ప‌క్కా ! అని ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ట తెలంగాణ బీజేపీ నేత‌లు!

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×