E-Paper
Advertisement

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ఎగిర్త‌పు చుట్టం..! అధికారం వ‌ద్దంటాడు.. పోటీ చేస్తానంటాడు..! ఎవ‌రి కోసం ఇంత గోల‌..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ఎగిర్త‌పు చుట్టం..! అధికారం వ‌ద్దంటాడు.. పోటీ చేస్తానంటాడు..! ఎవ‌రి కోసం ఇంత గోల‌..?
Advertisement

అత్యుత్సాహంగా, ఆగమాగం చేసే త‌మ నాయ‌కుల‌నుద్దేశించి కేసీఆర్ ఒక పిట్ట‌క‌థ చెబుతూ ఉంటాడు త‌రుచుగా. ఎగిర్త‌పు చుట్ట‌మ‌ని వారికి పేరు పెట్టి సున్నితంగా మంద‌లించి న‌వ్విపిస్తాడు బ‌హిరంగ వేదిక‌ల మీదే. వెనుక‌టికి ఓ ముస‌ల‌వ్వ ద‌గ్గ‌రికి ఓ చుట్ట‌మొచ్చిండంట‌. వ‌చ్చిన‌కాడ్నుంచి ఒక‌టే ఆత్ర‌మాత్రం చేస్తుండంట‌. ఏమైంది..? అని అవ్వ అడిగితే..! ఏ ఏం లేద‌వ్వా.. జ‌ర జ‌ల్దీ పోయే ప‌ని ఉన్న‌ది.. అని అటు ఇటూ కాలుకాలిన పిల్లిలెక్క తిరుగుతున్న‌డ‌ట‌. అయ్యో బిడ్డా అట్ల‌నా..! మ‌రి ఇంట్ల స‌లిబువ్వ‌నే ఉన్న‌ది.. ఎట్లా? అని అడిగిందంట‌…! ఏం కాదు పెద్ద‌వ్వా..! చ‌లిబువ్వ తింటా.. ఉడుకు బువ్వ అయ్యేదాకా ఉంటా! అన్నాడంట‌.

అట్ల‌నే ఉంది సేమ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేష్ట‌లు. మాట‌లు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను తెలంగాణ‌కు రావొద్ద‌ని ఎవ్వ‌రూ అన‌లేదు. ఆయ‌న ఎంపిక చేసుకున్న డేట్‌.. పెట్టుకున్న మీటింగు.. సంద‌ర్భ‌మే కరెక్టుగా లేదు. కావాల‌నే గెలికి క‌య్యం పెట్టుకున్న‌ట్టే ఉంది. అక్క‌డే వ‌చ్చింది లొల్లి. తెలంగాణ న‌వ నిర్మాణ సంక‌ల్ప స‌భ‌న‌ట‌. అస‌లు విష‌మేందంటే.. అస‌లు ఆ పేరుకు, ఆ మీటింగుకు, ఆ సంక‌ల్పానికి త‌న‌కే మాత్రం సంబంధం లేదంట‌. ఆయ‌నే చెప్పిండు ప్రెస్‌మీట్ల‌. అంతా ఇక్క‌డ తెలంగాణోళ్లు డిసైడ్ చేసిండ్ర‌ట ..అదే వాళ్ల పార్టీ నాయ‌కులు.

Advertisement

ఈయ‌న పోలోమ‌ని వ‌చ్చి ఏదో పొడిచేసేలా సందేశాలిచ్చి పోదామ‌నుకున్నాడట‌. క‌విత‌, పొన్నం ప్ర‌భాక‌ర్ త‌దిత‌రులు ప‌వ‌న్ ను విమ‌ర్శించింది పార్టీల ప‌రంగానే. ఆ విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కోలేక వాటికి వ‌క్ర‌భాష్యాలు వెతుక్కున్నాడు ప‌వ‌న్‌. ఆ స‌భ‌ను ఇదే స‌మయంలో ఎందుకు పెట్టుకోవాలె. తెలంగాణ ఆవిర్భావానికి ఓ ప‌ది రోజుల ముందో.. ఓ వారం త‌రువాతో పెట్టుకుంటే ఎవ‌రికేం బాధ లేకుండె. నాగేశ్వ‌ర్ గొడ‌వ‌ను పెంచి పెద్ద చేసుకున్న‌ది ప‌వ‌న్‌. దాన్ని కొంద‌రు ప‌నిలేని తెలంగాణ మేథావులు.. తెలంగాణ‌కు నాగేశ్వ‌ర్‌కు లంకె పెట్టి ఊద‌ర‌గొట్టి.. ప‌వ‌న్‌ను ప‌ర్స‌న‌ల్ టార్గెట్ చేసుడు మొద‌లుపెట్టిర్రు. తెలంగాణ‌లో ప‌నీపాటా లేకుండా ఖాళీగా ఉన్న జ‌న‌సేన పార్టీ నాయ‌కులు ప‌వ‌న్‌ను రెచ్చ‌గొట్టిర్రు.

ఏ రండ్రి సారు.. చూస్కుందాం.. ఇదే మోఖా..! ఎట్లైనా జీహెచ్ఎంసీ ఎన్నిక‌లున్నాయి క‌దా! ఓ ప‌దో ప‌ర‌కో గెల‌వొచ్చు..! అన్న‌రు. స‌రే అట్ల‌నా అయితే ఓకే..! అన్న‌ట్టున్నాడు. దీని కోసం పెద్ద పెద్ద లెక్చ‌ర్లు.. ఇది పాకిస్థానా? పాస్‌పోర్టు ప‌ట్టుకుని రావాల్నా..? ఇప్ప‌టి దాకా అనుకోలే.. ఇగ ఇప్పుడ‌నుకుంటున్నా.. తిర్గుతా మొత్తం తెలంగాణ తిర్గుతా.. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తా..! తిరుగువ‌యా ఎవ‌రొద్ద‌న్న‌రు? పోటీ కూడా చెయ్యు. మొన్న మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో కూడా ఆడాడ పోటీ చేసినా ఎవ‌రికి క‌నీసం తెల్వ‌క‌పాయె..! అట్లున్న‌ది మ‌రి ఆ పార్టీ. అప్పుడేమైనా వ‌ద్ద‌న్న‌రా? నువ్వు అప్పుడొచ్చి బ‌హిరంగ స‌భ పెట్టినా ఎవ‌లూ ఏమ‌నేటోళ్లు కాదు. నీకు చాత‌గాక‌.. ప్రాంతీయ ద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు నువ్వే ఉత్సాహం చూపించి.. నీ పార్టీని బ‌తికించుకునేందుకు ఇంత గోలా చేయాల్నా!

Advertisement

ఏపీలోనే అధికారం వ‌ద్ద‌న్నోడ్నీ.. మ‌రి ఈడ అధికారం కోసం కొట్లాడ్త‌నా? అన్న‌డు. అంటే.. ఏపీలో సీఎం చేస్తామ‌న్నారా ఏందీ? వ‌ద్ద‌ని డిప్యూటీ సీఎంతో స‌రిపెట్టుకున్న‌వా? మ‌రి ఈడెందుకు పోటీ అంటే.. ఏదో పిల్ల‌లు ప‌నీపాటా లేక ముచ్చ‌ట వ‌డ్తుండ్ర‌ట‌. గెలిచేది లేదు ఏం లేదు గానీ, నాలుగు పైస‌ల‌న్నా చేతుల ఆడుత‌య‌ని కావొచ్చు. వాళ్లు చెప్పంగ‌నే ఈయ‌న ల‌గెత్తుకొచ్చిండంట‌. మార్పు కావాల‌ని కోరుకుంటున్న‌డంట తెలంగాణ‌ల‌. మ‌రి మీ అమ‌రావ‌తి పూర్త‌యిన‌ట్టేనా? అక్క‌డ నువ్వు కోరుకున్న మార్పు వ‌చ్చిన‌ట్టేనా? ఇవే క‌దా తెలంగాణ పార్టీ లీడ‌ర్లు అడిగేది..!

దానికి స‌మాధానం చెప్ప‌కుండా… సినిమా డైలాగులు కొడుతూ.. ఇగో నా ఇంటి అడ్ర‌సు.. ఇగో నా కోడిచెరువు క‌బ్జా అడ్ర‌సు.. అంటూ ముచ్చ‌ట్లు చెప్పి.. తొడ‌లు చ‌రిచి, గొంతు చించుకుని.. ! నేను తెలంగాణ ఏర్పాటు చేసిన విధానాన్ని వ్య‌తిరేకించినా.. అని అచ్చం.. మోడీ అన్న‌ట్టుగా బ‌ల‌వంతంగా త‌ల్లీబిడ్డ‌ల‌ను వేరు చేశార‌నే మాట‌ల‌నే వ‌ళ్లెవేసి.. !ప‌వ‌న్ ఇదంతా చేస్తున్న‌ది పాపం .. ఇక్క‌డ బీజేపీకి కొంచెం స‌పోర్టుగా ఉండి.. అది అధికారంలోకి రావాల‌నేమో..! ప‌వ‌న్ దృష్టిలో బీజేపీ ఇక్క‌డ అధికారంలోకి వ‌స్తే త‌ను కోరుకున్న‌ మార్పు వ‌చ్చిన‌ట్ట‌న్న‌మాట‌! ఇదీ ప‌వ‌న్ తెలంగాణ ఎపిసోడ్ సారాంశం!

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×