E-Paper
Advertisement

కేటీఆర్ ప‌శ్చాత్తాపం! పొరపాట్ల‌కు చింతిస్తున్నాం.. మీ ఆకాంక్ష‌ల బాధ్య‌త నేను తీసుకుంటా..!

కేటీఆర్ ప‌శ్చాత్తాపం! పొరపాట్ల‌కు చింతిస్తున్నాం.. మీ ఆకాంక్ష‌ల బాధ్య‌త నేను తీసుకుంటా..!
Advertisement

అది పేరుకు యువ సంగ్రామ స‌ద‌స్సు. కానీ కేటీఆర్ ఈ వేదిక‌గా త‌మ ప‌దేళ్ల పాల‌న పొర‌పాట్ల‌కు ప‌శ్చాత్తాపం కోరాడు. ఒక్క జాబ్ క్యాలెండ‌ర్ గురించే కాదు.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలేవీ అమ‌లు చేయ‌లేద‌ని, రెండున్న‌రేండ్ల పాల‌న గురించి ప్ర‌స్తావించాడు కేటీఆర్‌. తాము ప‌దేళ్ల కాలంలో ఇచ్చిన ఉద్యోగాల గురించి చెబుతూనే.. కాంగ్రెస్ ఒక్క ఏడాదిలోనే రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలిస్తాన‌ని .. యువ‌త‌ను రెచ్చ‌గొట్టి ఓట్లు వేయించుకుందని, తీవ్రంగా మోసం చేసింద‌న్నాడు.

పేప‌ర్ లీకేజీ త‌మ పాల‌న‌లో జ‌రిగిన పొర‌పాటేన‌ని, ఇంకా చాలా పొర‌పాట్లు దొర్లాయ‌ని, వాటిని మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా చూసుకుంటామ‌ని చెప్ప‌డంతో పాటు.. నిరుద్యోగ యువ‌త ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌తో పాటు.. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల విష‌యంలో త‌ను బాధ్య‌త‌గా ఉంటానన్నాడు. అంటే.. ఓ ర‌కంగా కేసీఆర్‌ను మీరు క‌లిసే చాన్సు లేకున్నా.. నేను మ‌ధ్య‌వ‌ర్తిగా ఉండి.. ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చే క్ర‌మంలో వార‌ధిగా ప‌నిచేస్తాన‌ని చెప్పుకొచ్చాడు కేటీఆర్‌.

Advertisement

రేవంత్ స‌ర్కార్ చెబుతున్న‌ట్టుగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 70వేల ఉద్యోగాలిచ్చామ‌ని నిరూపిస్తే.. త‌ను శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని స‌వాల్ విసిరాడు. ప్రైవేటు రంగంలో కూడా భారీ ఉద్యోగాలు క్రియేట్ చేయ‌గ‌లిగామ‌ని గుర్తు చేశాడు కేటీఆర్‌. తాము ఇచ్చిన ప్ర‌భుత్వ ఉద్యోగాల‌పై ఎప్పుడు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకోక‌పోవ‌డం కూడా త‌మ త‌ప్పేన‌న్నారు. ఈ వేదిక‌గా ఆయ‌న విద్యార్థుల‌, నిరుద్యోగుల త‌ల్లిదండ్రుల‌ను కూడా అడిగారు. రేవంత్ త‌ప్పుడు మాట‌లు విని, అబ‌ద్ద‌పు హామీ మాయ‌లో ప‌డే క‌దా.. మీరు మోస‌పోయింది.. ఇక‌నైనా తెలుసుకున్నారా? ఎలాంటి గుంటన‌క్క‌కు ఓటేసి గెలిపించి.. సీఎం సీటు మీద కూర్చోబెట్టామో…! అని వారిని అడిగారు.

ఓసారి మోస‌పోయారు. ఇక‌పై మోస‌పోకండి.. మ‌ళ్లీ కేసీఆర్‌ను సీఎం చేసుకుందాం.. అన్ని విష‌యాల్లో ఆయ‌న‌కు అవగాహ‌న ఉంది.. ఇక్క‌డి నిరుద్యోగుల‌కు 95శాతం ఉద్యోగాలు ఇవ్వాల‌ని మోడీతో పోరాడి సాధించుకు వ‌చ్చిన నేత కేసీఆర్ అని గుర్తు చేశారు. యువ‌త‌రంతో పెట్టుకున్న వారు త‌రాల వ‌ర‌కు క‌న‌బ‌డ‌కుండా పోతార‌ని కూడా శాప‌నార్దాలు పెట్టాడు.

Advertisement

ఓ ర‌కంగా రేవంత్.. నిరుద్యోగుల‌తో పెట్టుకుని చాలా త‌ప్పుప‌ని చేశాడ‌ని, ఇచ్చిన మాట త‌ప్ప‌డ‌మే కాదు.. వారిని చుల‌క‌న చేసేలా మాట్లాడ‌టం ఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రిచిన‌ట్టేన‌న్నారు. కేసీఆర్ ఏనాడూ ఇలాంటి చిల్ల‌ర మాట‌లు మాట్లాడ‌లేద‌ని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని, గ‌తంలో జ‌రిగిన పొర‌పాట్ల‌ను తాము దిద్దుకుని ముందుకు సాగుతామ‌ని చెప్పి ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టించిన కేటీఆర్‌.. మ‌ళ్లీ కేసీఆర్ సీఎంగా రావాల‌ని, ఇక్క‌డి ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌న్నీ నెర‌వేరేలా నేను బాధ్య‌త వ‌హిస్తాన‌ని చెప్పాడు.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×