E-Paper
Advertisement

సీనియ‌ర్ల‌ను మించి స‌బ్జెక్టు ప‌రంగా క‌విత ప‌రిణ‌తి! రైతు డిస్కంపై క‌విత లోతైన అధ్య‌య‌నం.. స‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న పై ప్ర‌శంస‌లు..!

సీనియ‌ర్ల‌ను మించి స‌బ్జెక్టు ప‌రంగా క‌విత ప‌రిణ‌తి! రైతు డిస్కంపై క‌విత లోతైన అధ్య‌య‌నం.. స‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న పై ప్ర‌శంస‌లు..!
Advertisement

వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ప‌నిచేసిన సుధీర్ఘ అనుభ‌వ‌మున్న సీనియ‌ర్ నాయ‌కులు నిరంజ‌న్ రెడ్డి, మాజీ విద్యుత్ శాఖ మంత్రి గుంత‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి ల‌ను త‌ల‌ద‌న్నే విధంగా రైతు డిస్కమ్‌పై క‌విత ప్ర‌సంగం కొన‌సాగింది. ప్ర‌భుత్వం రైతు డిస్కంపై వ‌డివ‌డ‌గా అడుగులేస్తున్న త‌రుణం..జూన్ 2 వ‌ర‌కే పెట్టుకున్న డెడ్‌లైన్‌.. కేంద్రం ఒత్తిళ్ల మ‌ధ్య బీజేపీకి మేలు చేసే కంపెనీల‌కు దీన్ని దారాద‌త్తం చేసే ప్ర‌క్రియ ఇవ‌న్నీ… ఏక‌రువు పెట్టారామె. ఇప్ప‌టికే రెండు డిస్క‌మ్‌లు ఉండ‌గా.. మూడో డిస్కం పేరుతో రైతు డిస్కంను ప్ర‌వేశ‌పెట్ట‌డం మూలంగా రైతుకు ఒన‌గూరే లాభం ఇసుమంతైనా లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

ఈఆర్‌సీ ప‌బ్లిక్ హియ‌రింగ్‌లో ఆమె వెలిబుచ్చిన అంశాలే హైలెట్ అయ్యాయి. ఆంధ్ర ఉద్యోగుల పెత్త‌నం.. తెలంగాణ విద్యుత్ ఇంజినీర్ల‌కు జ‌రిగే న‌ష్టంపై కూడా ఆమె లోతైన అధ్య‌య‌నం చేసి మాట్లాడిన తీరు.. అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ది. ఆమె ప్రాక్టిక‌ల్‌గా ఈ అంశంపై పాజిటివ్ కోణంలో ఆలోచించి ప‌లు సూచ‌న‌లు చేశారు. దీన్ని ప‌క్కా రాజ‌కీయ కోణంలో కేవ‌లం ఖండించిన‌మా అంటే ఖండించినం.. అనే రీతిలో స‌బ్జెక్టుపై ఆమె సవివ‌రంగా మాట్లాడిన తీరు అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న‌ది. దీన్ని తొల‌త పైల‌ట్ ప్రాజెక్టుగా అమ‌లు చేయాల‌ని క‌విత సూచించారు. దీని ద్వారా త‌లెత్తే స‌మ్య‌లపై ఓ అవ‌గాహ‌న వ‌స్తుంద‌ని, ఆ మేర‌కు ముందుకు సాగే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

Advertisement

రైతుల జిల్లాల వారీగా స‌మావేశాలు పెట్ట‌డం ద్వారా వారి అభిప్రాయాల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌చ‌చ‌ని చెప్పారు. ప్రభుత్వం ఇప్పుడున్న రెండు డిస్క‌మ్‌ల‌కు వేలాది కోట్ల నిధులు బ‌కాయి ప‌డి వాటి ఉనికిని ప్రశ్నార్థ‌కంలో ప‌డేసింద‌ని, ఇప్పుడు తామే పూచీక‌త్తుగా ఉండి రైతు డిస్కం కోసం హామీ ప‌డ‌టం అంటే.. అది ఎన్నో అనుమానాల‌కు తావిస్తుంద‌ని కూడా ఆమె చెప్పారు. చాల త‌క్కువ స‌మ‌యంలో ఆమె ఈ రైతు డిస్కంపై కీల‌క సూచ‌న‌లు చేయ‌డంతో పాటు.. ప్రాక్టిక‌ల్ స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తెచ్చి. స‌ర్కార్‌ను ఆలోచ‌న‌లో ప‌డేశారు. రైతు డిస్కంపై ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ముందుకు పోతే.. నాటి బ‌షీర్‌బాగ్‌లో జ‌గిరిన కాల్పుల ఘ‌ట‌న పున‌రావృత‌మవుతుంద‌ని ఆమె మెచ్చ‌రించ‌డ‌మ‌తో పాటు. టీఆరెస్ త‌రుపున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మం చేప‌డ‌తామ‌ని కూడా ఆమె హెచ్చ‌రించారు.

ఆమె మాట్లాడే అంశం వాస్త‌వ ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టేలా ఉన్నాయి. దీంతో ఆమె బీఆరెస్ సీనియ‌ర్ లీడ‌ర్ల‌ను మించి త‌న స్పంద‌న వినిపించాల‌నే అభిప్రాయ‌లు వెల్ల‌డ‌య్యాయి. ప్ర‌శంస‌లూ తోడ‌య్యాయి.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×