E-Paper
Advertisement

తెలంగాణ ఎంపీలు మోదీకి భయపడ్డారు.. ప్రజలను అవమానిస్తున్నా ఎందుకు నోరు మెదపలేదన్న కవిత

తెలంగాణ ఎంపీలు మోదీకి భయపడ్డారు.. ప్రజలను అవమానిస్తున్నా ఎందుకు నోరు మెదపలేదన్న కవిత
Advertisement

Kavitha: తెలంగాణ ఎంపీలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు జాతీయ పార్టీలకు తెలంగాణతో బంధం తెగిందన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నా నోరు మెదపకుండా సైలెంట్‌గా ఉండటాన్ని తప్పుబట్టారు. మోదీకి భయపడి తెలంగాణ ఎంపీలు సైలెంట్‌గా కూర్చున్నారని ఆరోపించారు.

తెలంగాణ ఎంపీలపై కవిత కామెంట్స్.. బంధం తెగిందని వ్యాఖ్య

Advertisement

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై గురువారం నుంచి మూడురోజులపాటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం లోక్ సభలో జరిగిన పరిస్థితులపై నోరు విప్పారు తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఆమె దుయ్యబట్టారు.

కొంతమంది బీజేపీ ఎంపీలు తెలంగాణ ఏర్పడిన విధానంపై అత్యంత దారుణంగా మాట్లాడాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మన తెలంగాణ ఎంపీలు మోదీకి భయపడి పెదవులు మూసుకొని కూర్చున్నారు ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నా, మన అస్థిత్వాన్ని ప్రశ్నిస్తున్నా, ఉద్యమాలను అవహేళన చేస్తున్నా ఎంపీలు మాట్లాడకపోవడం దారుణమన్నారు.

Advertisement

మోదీకి తెలంగాణ ఎంపీలు భయపడ్డారు.. ప్రజలను అవమానిస్తున్నా నోరు మెదపలేదు

గతంలో ప్రధాని కూడా అదే పని చేశారన్నారు. తల్లిని చంపి.. పిల్లను బతికించారని అన్నారన్నారని వివరించారు. అమిత్ షా వచ్చిన ప్రతీసారి తెలంగాణ విమోచన అంటూ కొత్త కథ చెబుతున్నారని అన్నారు. అదే కోవలో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య మన మీద కామెంట్స్ చేశారన్నారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీలు సభలో ఉన్నా, కనీసం నిరసన తెలపలేదన్నారు.

దీంతో తెలంగాణకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో తెలంగాణకు ఎలాంటి సంబంధం తేల్చేశారామె. జాగృతి లాంటి పార్టీ ఉంటేనే రేపటి రోజుల ప్రాంతీయ పార్టీ ఇక్కడి ప్రజలు, వారి ఆకాంక్షల గురించి పోరాటాలు చేస్తుందన్నారు.

ALSO READ: మ‌హిళా బిల్లు కాద‌ది.. బాబ్డ్ హెయిర్ రిజ‌ర్వేష‌న్ ….. అప్ప‌ట్లో దుమారం రేపిన లాలూ వ్యాఖ్య‌లు

మనల్ని అవమానిస్తున్నా మాట్లాడకపోవడం దారుణమన్నారు. డీలిమిటేషన్ వల్ల మనకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నా, ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పార్లమెంటులో మనకు 3.1 శాతం ఉందని, అది పెరగాలన్నారు. కేంద్రం లెక్కల ప్రకారం 0.5 శాతం పెరుగుతుందన్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి తెలంగాణకు ఏమీ రావడం లేదని, ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ పోతుందన్నారు.

డీలిమిటేషన్ కమిషన్ అన్నిచోట్లకు వెళ్లి ఏ పద్దతిలో చేయాలనేది తెలుసుకోవాలన్నారు. దీనిపై బీజేపీ ప్రభుత్వం 50 శాతం సీట్లు పెంచుతామని ప్రకటన చేయడమేంటని ప్రశ్నించారు. అలా ప్రకటన చేసినప్పుడు కమిషన్ ఎందుకని ఎదురు ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్, డీలిమిటేషన్‌ వంటి అంశాలతో ప్రజలను మోసం చేయడమేనన్నారు. ఇలాంటి చర్యల వల్ల దక్షిణాదిలో తెలంగాణ ప్రాధాన్యత తగ్గుతున్నట్లు వెల్లడించారు.

 

 

 

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×