E-Paper
Advertisement

జీవ‌న్‌రెడ్డి గాలి తీసేశారు..! ఓ ప‌క్క రేవంత్‌.. మ‌రోప‌క్క క‌విత‌!

జీవ‌న్‌రెడ్డి గాలి తీసేశారు..!  ఓ ప‌క్క రేవంత్‌.. మ‌రోప‌క్క క‌విత‌!
Advertisement

జీవ‌న్‌రెడ్డికి ఎన‌లేని కీర్తిని ఆపాదించాల‌నుకున్నారు కేసీఆర్‌. జ‌గిత్యాల స‌భా వేదిక‌గా ఆయ‌న‌ను బీఆరెస్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతే కాదు.. ఆయ‌న రాక‌తో బీఆరెస్‌కు ఎంతో బ‌లం చేకూరిందనే విధంగా మాట్లాడిన కేసీఆర్‌.. జీవ‌న్‌రెడ్డి వృద్ధుడేం కాద‌ని, ఆయ‌న‌కు ఇప్పుడు మ‌రో 25 ఏండ్లు త‌గ్గాయ‌ని, ఆ విధంగా యంగ్‌గా క‌న‌బడుతున్నార‌ని పొగ‌డ్త‌లు కురిపించారు. ఆయ‌న సేవ‌లు ఒక్క జ‌గిత్యాల‌, క‌రీంన‌గ‌ర్‌కే కాదు.. ఉత్త‌ర తెలంగాణ అంతా వినియోగించుకుంటామ‌ని కూడా ప్ర‌క‌టించారు.

అయితే సీఎం రేవంత్ రెడ్డి బ‌హిరంగ స‌భ‌లో మొత్తం జీవ‌న్‌రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు. పార్టీ ఎంత చేసినా.. పాపాల బైర‌వుడి ద‌గ్గ‌రికి వెళ్లార‌ని.. త‌న ఒక్క‌డి ప‌ద‌వి కోసం ప్ర‌జా పాల‌న దిగిపోవాల‌ని కోరుతున్నాడంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఎన్టీఆర్ రాజ‌కీయాల నాటి చ‌రిత్ర‌ను కూడా తోడి తీశారు. అన్ని వెన్నుపోటు రాజ‌కీయాలేన‌ని, మొన్న‌టి దాకా ముసుగు వేసుకుని ఉన్న జీవ‌న్ రెడ్డి, ఇవాళ త‌న నిజ స్వ‌రూపం బ‌య‌ట పెట్టుకున్నార‌ని విమ‌ర్శించారు. అంతే కాదు.. ఆ వేదిక‌గా ఓ శ‌ప‌థం కూడా చేశారు సీఎం. రానున్న రోజుల్లో ఎన్నిక ఏదైనా బీఆరెస్‌ను వంద మీట‌ర్ల లోతుల్లో పాతి పెడ‌తామ‌ని కూడా అన్నారు. అంటే జీవ‌న్‌రెడ్డికి ఇక రాజ‌కీయంగా ఏ గెలుపు ఉండ‌ద‌ని అన్నారు.

Advertisement

తాము అధికారంలోకి వ‌స్తే ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి ఇస్తాన‌ని కేసీఆర్ ప్ర‌క‌టించిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. అస‌లు కేసీఆర్‌కు ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా చేస్తాన‌ని కూడా ప్ర‌తిన బూనారు. ఇదిలా ఉంటే.. క‌విత కూడా జీవ‌న్‌రెడ్డిని టార్గెట్ చేశారు. జీవ‌న్‌రెడ్డిని కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించ‌డం.. పొగ‌డ‌టం, రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ పేరును తీసుకోవ‌డం.. ఇవ‌న్నింటినీ క‌ల‌గ‌లిపి ఆమె విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. తెలంగాణకు బ‌ద్ద శ‌త్రువైన జీవ‌న్‌రెడ్డి.. రాజ‌శేఖ‌ర్ రెడ్డి నీడ‌లో పెరిగాడ‌ని, అప్పుడు తెలంగాణ అనే ప‌దం తీయ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ని గుర్తు చేశారు.

ఇలాంటి వృద్ధ‌నాయ‌కుల‌ను తీసుకుంటే.. ఇక యూత్ ఎటు పోవాల‌ని, ఉద్య‌మ‌కారుల‌కు మీ పార్టీ ఇస్తున్న ప్రాధాన్య‌మేమిట‌ని ఆమె కేసీఆర్ వైఖ‌రిని నిల‌దీశారు. తమ పార్టీ యూత్‌కే ఎక్కువ ప్రాధాన్య‌తనిస్తుంద‌ని ప్ర‌క‌టించారు. వృద్ధుల‌ను తీసుకుని .. అదీ తెలంగాణ ద్రోహులుగా ఉన్న‌వారికి పెద్ద పీట వేసి.. వారినే యూత్‌గా కీర్తిస్తూ బీఆరెస్ జ‌నాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించాల‌ని చూస్తుంద‌ని విమ‌ర్శించ‌డం.. చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Advertisement

బీఆరెస్‌ను వృద్ధ పార్టీగా ఆమె అభివ‌ర్ణించారు. ప‌రోక్షంగా ఆ పార్టీతో యువ‌త‌కు మేలు జ‌ర‌గ‌ద‌నే సంకేతాలిచ్చారామె. సీఎం రేవంత్ కూడా జీవన్‌రెడ్డిని అంత ఘాటుగా విమ‌ర్శించ‌డానికి కార‌ణం.. ఇక‌పై ఎవ‌రూ పార్టీని వీడొద్ద‌ని, బీఆరెస్ వేసే ఉచ్చులో చిక్కుకోవ‌ద్ద‌నే ఎత్తుగ‌డ‌లో భాగ‌మ‌నే చెబుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. జీవ‌న్‌రెడ్డి త‌మ‌కు పెద్ద జీవ‌న్‌టోన్‌గా మార‌నున్నాడ‌ని బీఆరెస్ ఎంత క‌ల‌రింగు ఇచ్చుకున్నా ఓ వైపు రేవంత్‌, మ‌రోవైను క‌విత పెద్దాయ‌న గాలి తీసేశారని చ‌ర్చించుకుంటున్నారు.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×