E-Paper
Advertisement

పవన్ పై అందుకే కేటీఆర్ స్పందించడం లేదా? కవిత మాటల్లో ఆంతర్యం ఇదేనా!

పవన్ పై అందుకే కేటీఆర్ స్పందించడం లేదా? కవిత మాటల్లో ఆంతర్యం ఇదేనా!
Advertisement

ప‌వన్ ఇంత‌లా తెలంగాణ‌పై తెగ‌బ‌డేలా కామెంట్లు చేసినా.. కేటీఆర్ మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టే ఉంటున్నాడు! దీని వెనుక మ‌ర్మ‌మేమిటీ? అని నిల‌దీశారు క‌విత‌. ఇదిప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం. మొన్న మీట్ ది ప్రెస్‌లో అడిగిన ప్ర‌శ్న‌కు మాత్ర‌మే కేటీఆర్ స‌మాధాన‌మిచ్చాడు .. త‌ప్ప మ‌ళ్లీ ఎక్క‌డా ఈ విష‌యం మాట్లాడ‌లేదు. ఆ పార్టీ నేత‌లు కూడా ప‌వ‌న్ విష‌యంలో సైలెంట్‌గానే ఉంటున్నారు. ఎందుకు? భ‌విష్య‌త్తులో.. ప‌వ‌న్‌తో క‌లిసి బీఆరెస్ వెళ్ల‌నుందా? అంటే ఒక్క ప‌వ‌న్‌తో క‌లిసి వెళ్లేంత బ‌ల‌హీనంగా ఏమీ లేదు బీఆరెస్‌. మ‌రి బీజేపీతో క‌లిసి వెళ్తుందా? ఇప్ప‌టికే ఈ రెండు పార్టీలు మేము ఒంట‌రిగానే బ‌రిలో ఉంటాం.. పొత్తులుండ‌వు! అని ప్ర‌క‌టించుకున్నారు.

అంటే తెలంగాణలో బీజేపీ ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ట‌. బీఆరెస్ కూడా ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతుంద‌ట‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అలా ఒంట‌రిగా తిరుగేందుకు సిద్ద‌ప‌డ్డాడు. ఇక టీడీపీ కూడా వ‌స్తే గిస్తే.. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగినా.. అది ఏపీ రాజ‌కీయ మిత్ర‌ధ‌ర్మం ప్ర‌కారం ఇద్ద‌రూ క‌లిసి పొత్తులో భాగంగా పోటీ చేస్తుండొచ్చు. కానీ ఇక్క‌డ క‌విత అన్న‌మాట‌ల‌కు లోతైన అర్థం ఉంది.

Advertisement

పైకి ఎంత‌గా బీజేపీ, బీఆరెస్ తిట్టుకున్నా.. పొత్తుల్లేవ‌ని చెప్పుకున్నా.. ఒంట‌రి పోరేన‌ని ప‌దే ప‌దే ప్ర‌క‌టించుకున్నా.. ఈ రెండూ రేపు జ‌త‌క‌ట్ట‌బోయే పార్టీల‌నేని ఆమె చాలా సార్లు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఒక‌వేళ జీహెచ్ఎంసీలో ఎవ‌రికి వారే ఒంట‌రిగా పోటీ చేసినా.. సాధార‌ణ ఎన్నిక‌ల్లో పొత్తుల్లేకుండా మాత్రం పోవ‌డం క‌ష్ట‌మేనని అనిపిస్తుంది.

ఈ మేక‌పోతు గాంభీర్యాలు అప్పుడు ప‌నిచేయ‌వు. వాస్త‌వ ప‌రిస్థితులు తెలిసి వ‌స్తాయి. త‌త్వం బోధ‌ప‌డుతుంది. కేసీఆర్‌కు మ‌హా కూట‌మి పేరుతో చేసే రాజ‌కీయాలు ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కూడా ఆయ‌న బ‌ద్ద వ్య‌తిరేక పార్టీగా తుక్కు తుక్కు తిడుతూనే.. చంద్ర‌బాబుతో జ‌త క‌ట్టాడు. ఇప్పుడు కూడా బీజేపీ విష‌యంలో అదే స్టాండ్‌ను అమ‌లు చేస్తాడ‌నే ప్ర‌చార‌మే ఉంది.

Advertisement

కేటీఆర్‌కు ఆవేశ‌మే త‌ప్ప‌.. ఆలోచ‌న లేదు. కేసీఆర్‌కున్న రాజ‌కీయ అనుభ‌వం కేటీఆర్‌కు లేదు. జ‌నం నాడి తెలిసిన నేత‌గా కేసీఆర్‌కు పేరుంది. దీంతో త‌మ పార్టీ ప‌ట్ల ఇంకా జ‌నం ఏమ‌నుకుంటున్నార‌నే స‌ర్వేలు, త‌న అనుభ‌వాలు.. అన్నీ క్రోడీక‌రించి.. మొత్తానికి ఏపీలో చంద్ర‌బాబు అనుస‌రించిన స్టాండ్‌నే అనుస‌రించ‌డం మూలంగా.. అధికారంలోకి ప‌క్కా వ‌స్తామ‌నే ప్లానింగ్ ఉంది.

ఈ విష‌యాల‌ను మొద‌ట నుంచి బాగా ద‌గ్గ‌ర‌గా ఉన్న క‌విత గ్ర‌హించారు. త‌న‌ను అన్యాయంగా జైలుకు పంపిన బీజేపీతో పొత్తా..? అందులో పార్టీ విలీన‌మా..? అని తీవ్రంగా వ్య‌తిరేకించిన విష‌యాన్ని కూడా ప‌లుమార్లు బ‌హిరంగ ప‌రిచారు కూడా. ఇక తెలంగాణ‌లో ఈ రెండు పార్టీలు కాకుండా అద‌నంగా ప‌వ‌న్‌, బాబు కూడా తోడైతే.. ఇక మాకు తిరుగేలేద‌నే విధంగా కూట‌మి క‌ట్టాల‌నే ఆలోచ‌న కూడా చేయ‌వ‌చ్చ‌నే అంచ‌నాలు ఉన్నాయి.

దీని వ‌ల్లే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పెద్ద‌గా శ‌త్రుత్వ భావ‌న పెంచుకోవ‌డం లేదు కేటీఆర్‌. దీన్నే క‌విత హైలెట్ చేస్తున్నారు. వారి పొత్తుల కోసం.. అధికారం ద‌క్కించుకోవ‌డం కోసం… తెలంగాణ‌పై ఆంధ్రా నేత‌ల దండ‌యాత్ర‌ను కూడా కేటీఆర్ స్వాగ‌తిస్తున్నాడని ఆమె అత‌న్ని డిఫెన్స్‌లో ప‌డేయ‌డం కోస‌మే ప‌వ‌న్ ఇష్యూతో ఇలా లోపాయికారి ఒప్పందాల గుట్టును ర‌ట్టు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు క‌విత‌.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×