E-Paper
Advertisement

గ‌ద్ద‌ర్‌కు కారు కొనిచ్చా..! ఇదిప్పుడు బ‌య‌ట‌పెట్టడం వెనుక నీ ఉద్దేశ‌మేంద‌యా ప‌వ‌ను!?

గ‌ద్ద‌ర్‌కు కారు కొనిచ్చా..! ఇదిప్పుడు బ‌య‌ట‌పెట్టడం వెనుక నీ ఉద్దేశ‌మేంద‌యా ప‌వ‌ను!?
Advertisement

క‌చ్చితంగా గ‌ద్ద‌ర్‌కు కారు కొనిచ్చే ఉంటాడు. ఇందులో అబ‌ద్దమైతే ఉండ‌దు. ఎందుకంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అదో లెక్క కాదు. పాపం… దానికి కూడా ఓ మూడు రోజుల టైం తీసుకున్నాడంట‌. గ‌ద్ద‌ర్ ఇంటికి వ‌చ్చి మ‌రీ అడిగితే ఆన్ ది స్పాట్ కొనియ్యాలె క‌దా! పాపం పైస‌లకు క‌ట‌క‌ట ఉండి ఉంటుంది. చాలా సార్లు త‌ను ఓపెన్‌గా అన్నీ చెప్పుకుంటాడు. అప్పులు చేశానంటాడు. ఖ‌ర్చుల‌కు లేక షూటింగులు చేస్తున్నానంటాడు! జ‌నం న‌మ్మ‌రు గానీ.. పైస‌లు, ఆస్తులు పెద్ద‌గా కూడ‌బెట్టిన‌ట్టు లేడు.

ఒట్టి అమాయ‌కుడి లెక్క‌నే ఉన్న‌డనిపిస్తుంది.. అత‌ను చెప్పే మాటలు, విధానం చూస్తుంటే. అస‌లు ఎవ‌రూ లేన‌ట్టు గ‌ద్ద‌ర్ .. ప‌వ‌న్ కాడికే ఎందుకు పోయిండు? ఆయ‌నే చెప్పిండు క‌దా.. గుడుంబా శంక‌ర్‌లోనే ఏదో సినిమాలో రాజ‌కీయ నాయ‌కులు భార‌త‌మాత‌ను తాక‌ట్టు పెట్టే సీన్‌ను పాట‌లో చూపెట్టినందుకు చిరంజీవికి ఫోన్ చేసి ప్ర‌శంసించిండంట గ‌ద్ద‌ర్‌. అక్క‌డ క‌లిసి ఉంటాయి ఇద్ద‌రి మ‌న‌సులు. మ‌న‌స్త‌త్వాలు. అందుకే ప‌వ‌న్ చెప్పేదాంట్లో అంతా నిజ‌మే అనిపిస్తున్న‌ది. ఎక్క‌డా కారు విష‌యంలో అబ‌ద్దం చెప్పిండ‌ని అనిపించ‌లేదు. ఇది కాదు అస‌లు విష‌యం. ఇప్పుడు.. ఈ సంద‌ర్బంలో.. ఈ వివాదంలో.. ఈ ఆవేశ‌కావేశ‌కాల్లో.. ఎందుకు గ‌ద్ద‌ర్ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది? అందులోనూ తాను కారును కొనిచ్చాన‌ని.

Advertisement

అంతే కాదు.. ఓరేయ్ త‌మ్మి… అని త‌న‌ను ఆప్యాయంగా పిలుచుకునేంత‌గా ఇద్ద‌రి మ‌ధ్య‌ చ‌నువు కూడా ఉంద‌ని చెప్పుకున్నాడు. ఇదంతా చెప్పుకున్న‌ది త‌ను తెలంగాణ‌ను ఓన్ చేసుకోవ‌డానికి. త‌న‌ను తెలంగాణ జ‌నం ద‌గ్గ‌ర తీయ‌డానికి. ఇక్క‌డి నేత‌ల నోర్లు మూయించ‌డానికి. గ‌ద్ద‌రే త‌న‌ను ఇంత అభిమానంగా చూశాడంటే.. నా స్వ‌భావం, నా వ్య‌క్తిత్వం ఇక మీకు వేరు చెప్పాలా? ఇదొక్క ఉదాహ‌ర‌ణ చాలు.. !అని తెలంగాణ స‌మాజానికంత‌టికీ చెప్ప‌డానికి. గ‌ద్ద‌ర్ లేడు గానీ ఉండి ఉంటే మ‌న చానెళ్ల వాళ్లు వెళ్లి గొట్టాలు పెట్టేవాళ్లే.. నిజ‌మేనా? ఏ కారు కొనిచ్చాడు? నువ్వే కారు న‌డిపావా? ఆ కారు ఉన్న‌దా అమ్మేసుకున్నావా? ఓ వారం ప‌ది రోజులు ఇంట‌ర్వ్యూల‌తో చంపుతుండే.

ఇప్పుడు కూడా గ‌ద్ద‌ర్ కూతుర్నో, పాశం యాద‌గిరి లాంటోళ్ల‌నో ప‌ట్టుకుని ఈ విష‌యంపై తెగ ఇంట‌ర్వ్యూలు చేస్తార‌నుకోండి. అది వేరే ముచ్చ‌ట‌. అవును.. పాశం యాద‌గిరి అంటే గుర్తొచ్చింది..! ఆయ‌న కూడా త‌న‌కు మంచి దోస్తు అన్న‌డు ప‌వ‌న్‌. ఇక్క‌డ ఇదిగో ఇదే ఇంట్లో మేము గంట‌ల త‌ర‌బడి కూర్చుని మాట్లాడుకున్నామ‌న్నాడు. అంటే దీనిర్ద‌మేందో తెలుసా? మొన్న పాశం .. తుక్కు తుక్కు తిట్టిండు ప‌వ‌న్‌ను. తిరుగుబోతు. తాగుబోతు. వ‌ద‌రుబోతు… ఇలా వరుస‌బెట్టి.. ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ విష‌యంలో! అంటే త‌న‌తో పాటే ఆయ‌నా చ‌ర్చ‌ల్లో భాగ‌స్వామ్య‌మ‌య్యాడు.. అని తెలంగాణ స‌మాజానికి చెప్ప‌డం. ఇంత తిట్టిన పాశం.. నా ద‌గ్గ‌రికి ఎందుకొచ్చిండు? ఆయ‌ననేమ‌నాలి మ‌రి? అనే ప్ర‌శ్న ఉద‌యించాల‌నేది ప‌వ‌న్ ఆలోచ‌న‌లో భాగం కావొచ్చు.

Advertisement

ఇప్పుడు మ‌నం మ‌ళ్లా గ‌ద్ద‌ర్ ద‌గ్గ‌రికి వ‌ద్దాం. గ‌ద్ద‌ర్‌కు కారు కొనిచ్చిన‌వు నిజ‌మే. నీ ద‌గ్గ‌రికి వ‌చ్చి అడిగాడు నిజ‌మే! ఇద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంది..అదీ కాద‌న‌లేం.

కానీ ప‌వ‌న్ ..! నీ రాజ‌కీయం కోసం.. నీ ప్ర‌స్తుత అవ‌సరాల కోసం.. నీ ప‌తార చాటుకోవ‌డం కోసం.. ఇక్క‌డి నేత‌ల నోర్లు మూయించ‌డం కోసం గ‌ద్ద‌ర్ పేరును, ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని, ఆయన చ‌రిత్ర‌ను.. అన్నింటినీ అన్నింటినీ నువ్వు తాక‌ట్టుపెట్టుకున్న‌ట్టుగా అనిపించ‌లేదా? ఒక‌రికి చేసిన సాయం బ‌య‌ట చెప్పొచ్చునా? అదీ చనిపోయిన ఓ చ‌రిత్ర‌కారుడి గురించి. ఇక్క‌డి స‌ర్కార్ అమితంగా మ‌ర్యాదిచ్చి గౌర‌విస్తున్న మ‌నిషి గురించి. అల్ప‌త్వంగా అనిపించ‌లేదా? అంత లోతుగా ఆలోచించే మైండ్ లేదా? ఆలోచ‌న వ‌చ్చినా త‌ప్పుదు ఇక అని అనాల్సి వ‌చ్చిందా? ఇదీ నీ రాజ‌కీయ ప‌రిణ‌తి…! అంటున్నారు తెలంగాణ జ‌నం.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×