E-Paper
Advertisement

పార్టీ మారడు.. పార్టీలోనే ఉంటడు.. చ‌చ్చినా మార‌డు.. చ‌చ్చేదాకా మార‌డు!

పార్టీ మారడు.. పార్టీలోనే ఉంటడు.. చ‌చ్చినా మార‌డు.. చ‌చ్చేదాకా మార‌డు!
Advertisement

పాపం.. హ‌రీశ్‌రావు! ఎంత క‌ష్ట‌మొచ్చింద‌య్యా నీకు. పగ‌వాడికి కూడా రావొద్దు ఇసొంటి క‌ష్టం. ఆయ‌న అంత‌లా చెబుతున్నా.. ఎన్ని వంద‌ల వేల సార్లు గొంతు చించుకుని గ‌గ్గోలు పెడుతున్నా.. రేవంత్‌రెడ్డి మాత్రం విన‌డం లేదు. అస్స‌లు విన‌డం లేదు. రేవంతేనా..!? క‌విత కూడా న‌మ్మ‌డం లేదు. గుంట‌న‌క్క పార్టీని నిండా ముంచి.. ఆ త‌రువాత త‌న దారి తాను చూసుకుంటడు.. చూడు!అని హ‌రీశ్‌నుద్దేశించి కొన్ని వంద‌ల సార్లు ఇప్ప‌టికే అన్నారు. ఇదేంది వ్యా…! వీళ్లు న‌న్ను త‌గులుకున్నారిలా! నా మానాన నేను నా ప‌ని చేసుకుంట పోతున్నా.. మ‌ధ్య‌లో న‌న్ను లాగుతారెందుకు? అయితే కేసీఆర్‌నో, లేక‌పోతే.. కేటీఆర్‌నో.. అనాలెగానీ.. నేనేమ‌న్నా సీఎం అయేటోడినా..? నా లెక్కెంత.. నా బిసాతెంత‌? నా రాజ‌కీయ‌మేందీ? అని ఆయ‌న త‌న అంత‌రంగీకుల‌తో మ‌న‌సువిప్పి బోరున ఏడ్చినంత ప‌నిచేస్తున్నాడంట‌.

విష‌య‌మేందంటే..! ఆ హ‌రీశుడి అంత‌రంగీకులు కూడా ఈయ‌న మాట న‌మ్మ‌డం లేదంట‌. అన్న‌ది ఏదో ప్లానింగే..! అని ముచ్చ‌టించుకుంటున్నారంట‌. ఇట్ల ఇంటా న‌మ్మ‌క‌.. బ‌య‌టా న‌మ్మ‌క‌.. పొమ్మన‌లేక పొగ‌బెట్టుడెందుకు? నాకే ఈ బాధ‌లేందీ? అని వెక్కి వెక్కి ఏడ్చుడొక్క‌టే మిగిలుందంట‌. అప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని క‌లిసింది పాప‌మైంది… మ‌రేం చేయాలో.. అప్ప‌ట్లో త‌ప్ప‌లేదు. పోవాల్సే వ‌చ్చింది. అంతా రెడీ అయ్యిది. కానీ కాలం క‌లిసిరాలే.. అగో అప్పుడు క‌లిసిరాని కాలం ఇంకా క‌లిసొస్త‌లేదు. ఇంకెప్పుడు క‌లిసొస్త‌దో అని ఢీల్లీ గ‌డ‌ప‌, గ‌ల్లీ గ‌డ‌ప.. ఎక్కే గ‌డ‌ప దిగే గ‌డ‌ప‌లెక్క‌ తిరుగుతుంటి. గీ రేవంతేమో నా వెంబ‌డవ‌డ్డ‌డు.

Advertisement

అరే నేను పార్టీ మార‌ను.. మార‌ను.. మార‌ను..! ఎన్నిసార్లు చెప్పాలె యువ‌రాన‌ర్! నేను చ‌చ్చినా మార‌ను.. అని చెబుతూనే ఉన్నాక‌దా.. ఇంకెన్ని సార్లు చెప్పాలె! అంటే.. అన్నా.. ఎవ‌రు చచ్చినా మార‌రు.. ? అనుమాన‌మొచ్చిందొక‌డికి. చచ్చేదాకా మార‌ను..? అంటే అన్న ఎవ‌రు చ‌చ్చేదాకా మార‌రు..! హ‌రీశ్ ప‌క్క‌నుండే ఇంకొక‌డికీ అనుమాన‌మొచ్చింది. అడుగుదామ‌నుకున్నాడు. కానీ గొంతు చివ‌ర‌దాకా వ‌చ్చి అడ‌గ‌లే. అంటే.. అంటే.. చ‌చ్చినంక మారుత‌వా? అన్నా.. అడుగుదామ‌నుకుండు. ఎవ‌రు చ‌చ్చిందాకా? అని అడిగితే ఏం అనాలె! మ‌ళ్లా ఇదొక పంచాది.

ఎందుకొచ్చిన లొల్లి.. మ‌నం కూడా అన్న మాట‌ల్నే బ‌ల‌ప‌రుద్దాం.. ఏ అన్న మార‌డంటే మార‌డు. చ‌చ్చిందాకా మార‌డు..! చ‌చ్చేదాకా మార‌డు! అరేయ్‌.. చ‌చ్చేదాకా అన‌కుండ్రి రా… వేరే అర్థం వ‌స్త‌ది.. చ‌చ్చినా మార‌డు అనుండ్రి..!అన్నాడు ఇంకొక‌డు. నాలుక్క‌ర్చుకున్నాడు మొద‌టోడు. అవును.. క‌రెక్టే క‌దా.. చ‌చ్చిందాకా మార‌డు అంటే…చచ్చినంక మారుత‌డ‌నే క‌దా అర్థం వ‌స్త‌ది.. అవ్ అవ్‌..! అన్న చ‌చ్చినా మార‌డు. మార‌నే మార‌డు. మార‌డు గాక మార‌డు. మార‌డంటే మార‌డు. మారితే చ‌చ్చిన‌ట్టు లెక్క‌.. !

Advertisement

నీతి, నిజాయితీ, నైతిక‌తే అన్న‌కు జీవాలు! అవే రాజ‌కీయాలు! వాటి కోస‌మే ఈ ప్రాణాలు. అగ్గిపెట్టే దొర‌క‌క‌పాయె గానీ అప్ప‌ట్లోనే అన్న చ‌చ్చిపోయేది. అప్పుడు తెలిసేది మీకు అన్న క‌మిట్‌మెంట్‌. ఇంకా న‌మ్మ‌రా.. న‌మ్మండ్రా బాబు. అన్న మార‌డంటే మార‌డు. చ‌చ్చేదాకా మార‌డు. మీరు చ‌చ్చినంత ఒట్టు.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×