E-Paper
Advertisement

పాలాభిషేకాల‌కు ప‌డిపోయావా..! అంతే నీ ప‌ని ఖ‌తం..! పొగ‌డ్త‌ల‌కు పొంగ‌కు..! విమ‌ర్శ‌ల‌కు కుంగ‌కు!

పాలాభిషేకాల‌కు ప‌డిపోయావా..! అంతే నీ ప‌ని ఖ‌తం..! పొగ‌డ్త‌ల‌కు పొంగ‌కు..! విమ‌ర్శ‌ల‌కు కుంగ‌కు!
Advertisement

ప‌దేళ్ల పాల‌న‌లో పాలాభిషేకాల‌కు కొద‌వ లేదు మాకిక్క‌డ‌. మా పెద్ద‌సారుకు ప‌దే ప‌దే పాలాభిషేకాలు చేయించుకోవ‌డం.. నిన్ను మించిన ఘ‌నుడు లేడ‌ని పొగిడించుకోవ‌డం.. దేశంలో నీ పాల‌న నెంబ‌ర్ వ‌న్ అని కీర్తించుకోవ‌డం.. బాగా అల‌వాట‌య్యాయి. ఆ అల‌వాటే కొంప‌ముంచింది. ఫామ్‌హౌజ్‌కు ప‌రిమితం చేసింది. నేను చెప్పిందే వేదం.. చేసిందే శాస‌నం.. అనే దాకా వ‌చ్చింది ప‌రిస్థితి. ఎవ‌డి మాట లెక్క‌చేయ‌ని త‌త్వం వ‌చ్చింది. ఆ త‌రువాతనైనా త‌త్వం బోధ‌ప‌డ్డ‌దా? అంటే.. నేనేం చేసినా అంతా బాగానే చేశానే.. అంతా మెచ్చుకున్నారే.. పాలాభిషేకాలు చేశారే.. జేజేలు కొట్టారే..! జ‌నాలు ఆశ ప‌డ్డారు. అత్యాశ ప‌రులు.. దురాశకు పోయిండ్రు.. అందుకే ఈ దుస్థితి అని స‌మ‌ర్థించుకునే ద‌గ్గ‌ర‌నే ఆగింది వారి ఆలోచ‌న‌. అంత‌కు మించి పోవ‌డం లేదు.

ఇక ఆపై కూడా సాగేలా లేదు. పొగ‌డ్త ఓ ప‌న్నీరు.. లాంటింది. వాస‌న చూసి వ‌దిలేస్తే మ‌జా ఉంట‌ది.. మ‌త్తుగా దానికి అలవాటు ప‌డితే చిత్త‌యిపోత‌రు.. ఈ మంచి ముచ్చ‌ట చెప్పింది కూడా మాకు పెద్ద‌సారే. కానీ ఆయ‌నే ఆ మ‌త్తుకు బాసిన‌యి.. మ‌మ్మ‌ల్ని బానిస‌లుగా చూసి.. ఆయ‌న బందీ అయి పోయారు. స‌రే ఇవ‌న్నీ ముచ్చ‌ట్లెందుకు గానీ, నువ్వు కొత్త‌గా సీఎం అయినావు. ఏదో చేద్దామ‌నే త‌ప‌న కామ‌న్‌. ఎలాగైనా జాతి నిన్ను గుర్తించాలె. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ సీఎం అనిపించుకోవాల‌నే కోరిక ఉంటుంది స‌హ‌జం.

Advertisement

ఇది సినిమా అయితే కాదు.. ప‌క్కా ప్రాక్టిక‌ల్ గా ఆలోచించ‌డం నేర్చుకో. ప‌క్కా ప్రాక్టీక‌ల్ అంటే.. నువ్వు ఫ‌క్తు రాజ‌కీయం.. అని త‌ప్పుగా అర్థం చేసుకునేవు. పాలాభిషేకాల‌తో త‌డిపీ త‌డిపీ.. పొగ‌డ్త‌ల‌తో ఊద‌రగొట్టీ గొట్టీ.. విదూష‌కుల పాత్ర పోషించేందుకు ఎంద‌రో ఉంటారు రెడీగా. వారిని ముందు గుర్తించు. ద‌గ్గ‌ర‌కు కూడా రానీయ‌కు. అస‌లిదంతా ఎందుకు.. ఒరేయ్‌.. మీరెవ‌రూ పాలాభిషేకాలు చేయ‌కండ్రా.. మీకు మ‌న పాల‌న న‌చ్చితే.. పాల‌సీలు బాగుంటే.. ప‌థ‌కాలు మొద‌లు పెడితే.. ప‌నికొచ్చే కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటే.. ఏదైనా జ‌నాల‌కు ఉప‌యోగ‌ప‌డే సేవా కార్య‌క్ర‌మాలు చేయండ‌ని పిలుపునివ్వు.. సెట్ అయిపోతారు వెధ‌వ‌లు. ఒక్క‌డు కూడా బ‌య‌ట‌కు రాడు.. పాలాభిషేకం అన‌గానే పాల ప్యాకెట్లు జేబులో పెట్టుకుని వ‌చ్చేస్తారు ఫోటోలు త‌డిపేసేందుకు.

అవునూ.. పాల ప్యాకెట్ అంటే గుర్తొచ్చింది.. ప‌దేళ్ల పాల‌నలో మ‌మ్మ‌ల్ని కొంద‌రైతే పాల ప్యాకెట్ల బ్యాచ్ అని పిలిచేటోళ్లు. అంత హీన‌మై పోయిన‌మ‌నుకో. సారు నోటి నుంచి ఓ మాటొస్తే చాలు.. ఇగ జేబులో రెడీ పాల ప్యాకెట్లు పెట్టుకుంటుంటిమి! ఓ ఫోటో తీసి న‌డిరోడ్డులో చౌర‌స్తాలో పెట్టి నోటితో ఆ పాకెట్‌ను తెంపి.. సుయ్యున పాలు గుమ్మ‌రిస్తూ… ఫోటోల‌కు ఫోజులిస్తుంటే.. అబ్బ అప్పుడు ఆ మ‌జానే వేరుండే. ఇప్పుడు ఇంట్ల పాల ప్యాకెట్ల‌కే దిక్కు లేకుండా పోయింది. మా సారు ప‌ట్టించుకుంట‌లేడు. చిన్న‌సారు దేఖ్త‌లేడు. ఈ పాల పాఠాలు నీకు బాగా ప‌నిచేస్త‌య‌ని, ముందు ముందు పరేష‌న్ కాకుండా చేస్త‌య‌ని ముందే చెప్తున్న‌మ‌న్న‌ట్టు. ఇంత‌కు మీరెవ‌రూ అంటున్న‌వా? ఏ నీకింకా తెల్వ‌లే.. దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ పాల‌న మాది! ఇగ అన్నింట్లో నెంబ‌ర్ వ‌న్ అనుకో. ఇప్పుడ‌ర్థ‌మైందా? పాలాభిషేకాల పాల‌న ఎంత ప‌రేష‌న్ చేస్త‌దో!

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×