E-Paper
Advertisement

గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా! పవన్ తానా అంటే బాబు తందానా! ఎవరికి నష్టం!

గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా! పవన్ తానా అంటే బాబు తందానా! ఎవరికి నష్టం!
Advertisement

ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ వివాదం విష‌యంలో కూట‌మి స‌ర్కార్ పూర్తిగా త‌ప్పులో కాలేసింది. నాగేశ్వ‌ర్ ఏదో త‌న‌కు తోచిన సోర్స్‌ను బ‌ట్టి జ‌గ‌న్‌ను అరెస్టు చేయాల‌ని ప‌వ‌న్ కోర‌డం.. వ‌ద్ద‌ని అమిత్ షా వారించ‌డం.. పై కామెంట్ చేయ‌డ‌మే ఈ దుమారానికి కార‌ణం. దీన్ని చిలువ‌లు ప‌లువలు చేసి నాగేశ్వ‌ర్‌ను పేటీఎం బ్యాచ్‌గా చిత్రీక‌రించే ప‌నిలో టీడీపీ, జ‌న‌సేనా సోష‌ల్ మీడియా పూర్తిగా అత్యుత్సాహం చూసి అస‌లుకే ఎస‌రు తెచ్చిపెట్టుకున్న‌ది. చంద్ర‌బాబు.. ప‌వ‌న్‌తో కొంచెం జాగ్ర‌త్త‌గా ఉండాలె. అత‌నికి రాజ‌కీయ ప‌రిప‌క్వ‌త లేదు.

ప‌రిణ‌తి సాధించే క్ర‌మంలో ఇంకా రాజ‌కీయంగా ఓన‌మాలు నేర్చుకునే స్టేజీలోనే ఉన్నాడు. హీరోలా డైలాగులు కొట్టి, యాక్ష‌న్ సీన్ల‌లో ఇర‌గ‌దీసేందుకు ఇది సినిమా కాదు. ఇందులో విల‌న్ ఎవ‌రో ఎంచుకోవాలె.. వ్యూహాత్మ‌కంగా ఎత్త‌గ‌డ వేసి చిత్తు చేస్తూ పోవాలె.. ఊగిపోతూ డైలాగులు చెప్పినంత ఈజీ కాదు అధికారం వెల‌గ‌బెట్ట‌డం. ఆవేశం ఎక్కువ‌.. ఆలోచ‌న త‌క్కువ ఉన్న ప‌వ‌న్ అనాలోచితంగా తీసుకునే కొన్ని నిర్ణ‌యాలు చంద్ర‌బాబును కూడా ఇబ్బంది పెడుతున్నాయి. కానీ ప‌వ‌న్ మాట కాద‌న‌డు. అందుకే ప్రొసీడ్ అంటు ముంద‌డుగే వేస్తున్నారు.

Advertisement

ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ విష‌యంలో కేసులు పెట్ట‌డం, అరెస్టుకు కూడా రంగం సిద్దం చేసుకోవడం.. చంద్ర‌బాబు చేసిన అతిపెద్ద పొర‌పాటు. నాగేశ్వ‌ర్ ఏ పార్టీ స్టాండైనా తీసుకోని.. చెప్పే విశ్లేష‌ణ‌లో కొంచెం బ్యాలెన్స్ పాటిస్తాడు. వినేవారికి అవును క‌దా..! నిజ‌మే అనిపించే విశ్లేష‌ణలో ఆయ‌న స‌క్సెస్ సాధించాడు. ప్రాక్టిక‌ల్‌గా ముందుకుపోతాడు. జ‌నం ఏమ‌నుకుంటున్నారో అనేదాన్నే ప్రామాణికంగా తీసుకుంటాడు. ఈ విష‌యాలేవీ ప‌ట్ట‌లేదు కూట‌మి స‌ర్కార్‌. ప‌వ‌న్ ఆవేశంతో ఊగిపోవ‌డంతో.. ఇక ఉండ‌బ‌ట్ట‌లేక‌.. చేసేదేం లేక బాబు కూడా నాగేశ్వ‌ర్‌పై చ‌ర్య‌లకే ఉప‌క్ర‌మించాడు. ఇటు ఇటూ పోయి ఇది తెలంగాణ‌కు సోకింది సెగ‌.

నాగేశ్వ‌ర్‌ను అరెస్టు చేసే క్ర‌మంలో బాబు .. తెలంగాణ పోలీసుల సాయం కూడా కోరుతున్నాడ‌నే విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది. దీంతో ఇది సీఎం రేవంత్ రెడ్డికి కూడా చుట్టుకున్న‌ట్టైంది. ముందే బాబు, రేవంత్ ఒక్క‌టేన‌నే ముద్ర ఉండ‌నే ఉంది. రేవంతే స్వ‌యంగా మొన్న ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు కూడా ఇద్ద‌రి మ‌ధ్య ఇప్ప‌టికీ ఉన్న సాన్నిహిత్యాన్ని. ఇక దీనిపై తాగాజా టీఆరెస్ చీఫ్ క‌విత కూడా స్పందించారు. నాగేశ్వ‌ర్‌ను అరెస్ట్ చేస్తే ఖ‌బడ్దార్ అన‌డ‌మే కాదు.. ఆమె తెలంగాణ స‌ర్కార్‌కు కూడా వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

దీంతో ఇప్పుడిది రెండు తెలుగు రాష్ట్రాల ఇష్యూగా మారింది. త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా మారింది. కార‌ణం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అవును. అత‌డిని కంట్రోలో పెట్టుకోవ‌డం.. చెప్పిన‌వ‌న్నీ గుడ్డిగా ఫాలో కాక‌పోవ‌డం.. చంద్ర‌బాబు చేయాల్సిన త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం. కానీ కూట‌మి పొత్తుధ‌ర్మంలో భాగంగా ప‌వ‌న్ మాట‌ను కాద‌న‌లేని స్థితిలోనే ఉన్నాడు బాబు. ప‌ర్య‌వ‌సానాలు అనుభ‌విస్తున్నాడు. నాగేశ్వ‌ర్ ను అణిచివేయ‌డం మూలంగా, అరెస్టు చేయ‌డం వ‌ల్ల కూట‌మికి ప్ర‌భుత్వానికి వీస‌మెత్తు లాభం జ‌ర‌గ‌క‌పోగా.. జ‌గ‌న్‌ను హీరో చేసి.. ఆపార్టీకి లేని బూస్టింగును ఇచ్చిన‌వారే అవుతారు.

ఇందులో ఇమిడి ఉన్న ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్స‌వుతున్నారో బాబుగోరు. ఏం చేస్తాడు పాపం.. అంతా పొత్తుధ‌ర్మం.. కాదు కాదు పొత్తుఖ‌ర్మం.. ప‌వ‌న్ పాపం.. త‌లాపిడికెడు అన్న‌ట్టు స‌మిష్టిగానే ఈ నెగెటివ్ ఫ‌లాలు అనుభ‌విస్తున్నారు ఈ విష‌యంలో.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×