E-Paper
Advertisement

బీఆరెస్‌పై ఫ్రీ బ‌స్సు సెంటిమెంట్‌! మ‌హిళ‌ల‌కు మేలు చేసే ప‌థ‌కంపై కుట్ర‌లా!?

బీఆరెస్‌పై ఫ్రీ బ‌స్సు సెంటిమెంట్‌! మ‌హిళ‌ల‌కు మేలు చేసే ప‌థ‌కంపై కుట్ర‌లా!?
Advertisement

ఫ్రీ బ‌స్సు ప‌థ‌కాన్ని ఓ విఫ‌ల ప్ర‌యోగంగా చిత్రీక‌రించాల‌ని చూసిన బీఆరెస్‌పై మ‌హిళ‌లతో సెంటిమెంట్ అస్త్రాన్ని ప్ర‌యోగిస్తోంది స‌ర్కార్‌. ఇవాళ దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. ఫ్రీ బ‌స్సు ప‌థ‌కం వ‌ల్ల ఆటోల‌కు ప‌నిలేకుండా పోయింద‌ని, దాని వ‌ల్ల ఆ కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయ‌ని కేటీఆర్ వారిని రెచ్చ‌గొట్టాడ‌ని సీఎం అన్నారు. రెచ్చ‌గొట్టి రోడ్ల‌పై ధర్నాల‌కు దింపాల‌ని చూశాడ‌ని, కానీ ఆడ‌బిడ్డ‌లు దీనిపై తీవ్రంగా తిర‌గ‌బ‌డ‌టంతో వెన‌క్కి త‌గ్గార‌న్నారు. ఈ విష‌యంలో బీఆరెస్‌పై మ‌హిళ‌ల నుంచి పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త రావ‌డంతో ఏం చేయాలో తెలియ‌క తేలుకుట్టిన దొంగ‌ల్లా ఉండిపోయార‌ని కూడా సీఎం విమర్శించారు.

ఏ వేదిక ఎక్కినా సీఎం .. ఈ ఫ్రీ బ‌స్సు ప‌థ‌కం గురించి ప్ర‌త్యేకంగా చెబుతూ వ‌స్తున్నారు. ఒక్కో ఇంటిలో మ‌హిళ‌కు నెల‌కు ప‌దివేల రూపాయ‌లు దీని ద్వారా ఆదా అవుతున్నాయ‌ని, అంత‌లా ఇది ఉప‌యోగ‌పడుతుంద‌ని ఆయ‌న చెప్తూ వ‌స్తున్నారు. వాస్త‌వంగా.. బ‌య‌ట ప‌నులు చేసుకునే వారికి, ఉపాధి నిమిత్తం నిత్యం బ‌స్సుల్లో ప్ర‌యాణం చేసేవారికి, వ్యాపారం చేసే వారికి ఈ ఫ్రీ బ‌స్సు ప‌థ‌కం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్న‌ది. సీఎం చెప్పిన‌ట్టు నెల‌కు ప‌దివేలు అని కాదుగానీ, ఎంతో కొంత వారి ఫ్యామిలీ బ‌డ్జెట్‌కు ఇది ఊతంగా నిలుస్తోంది. దీనికి బాగా క‌నెక్ట‌య్యారు కూడా మ‌హిళ‌లు. బ‌స్సుచార్జీల ఖ‌ర్చును త‌మ బ‌డ్జెట్ నుంచి తొల‌గించి.. లెక్క‌లు చూసుకుంటున్నారు. ఇంత‌లా క‌నెక్ట‌యిన ఈ ప‌థ‌కం మ‌హిళ‌ల‌కు సెంటిమెంట్‌లాంటిది.

Advertisement

స‌ర్కార్‌పై ఇత‌ర విష‌యాల్లో వ్య‌తిరేక‌త ఉన్నా.. ఈ ఫ్రీ బ‌స్సు బారా ఖూన్ మాఫీలా.. స‌ర్కార్‌ను కాపాడుతుందంటే అతిశ‌యోక్తి కాదు. అలాంటి ప‌థ‌కం ప‌ట్ల కొంత వ్య‌తిరేక‌త భావ‌న తీసుకురావాల‌ని కేటీఆర్ ప్ర‌య‌త్నించిన మాట వాస్త‌వం. కేసీఆర్ కూడా ప‌లు స్పీచుల్లో ఫ్రీ బ‌స్సుల‌పై వెట‌కారంగా మాట్లాడిన సంద‌ర్బాలున్నాయి. కేటీఆర్ అయితే.. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రుస్తూ మాట్లాడాడు ఓ సంద‌ర్బంలో. త‌రువాత త‌ప్పు తెలుసుకుని చెంప‌లేసుకున్నాడు. ఈ ఫ్రీ బ‌స్సు ప‌థ‌కం జోలికి వ‌స్తే.. అంతే సంగ‌తులు.. అనేలా ఇప్ప‌టికే స్ట్రాంగ్ వార్నింగ్ వ‌చ్చింది మ‌హిళ‌ల నుంచి బీఆరెస్ పార్టీకి. అది మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లిన సంద‌ర్భంలో కూడా దీన్ని కాద‌ని ముందుకు వెళ్ల‌లేని ప‌రిస్థితి ఉంది.

అంత‌లా కుటుంబాలకు క‌నెక్ట‌యిన ప‌థ‌కంగా ఈ ఫ్రీ బ‌స్సు ప‌థ‌కం మారిపోయింది. ఇప్పుడు దీన్ని బీఆరెస్‌పై సెంటిమెంట్‌లా ప్ర‌యోగిస్తోంది ప్ర‌భుత్వం. మ‌హిళ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంతో పాటు దీనిపై ఓ చ‌ర్చ వ‌చ్చేలా సీఎం త‌న ప్ర‌సంగాల్లో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తున్నారు. ఓ ర‌కంగా బీఆరెస్‌కు ఈ ప‌థ‌కంపై కోపం ఉంద‌ని, త‌ద్వారా మ‌హిళ‌ల మేలు కోరే విధంగా ఆ పార్టీ ప్ర‌వ‌ర్తించడం లేద‌నే సంకేతాలిస్తున్నారు సీఎం.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×