E-Paper
Advertisement

Jagan – Vijay: జగన్ వ్యూహం.. విజయ్ విజయం, అసలు మేటర్ ఇదా!

Jagan – Vijay: జగన్ వ్యూహం.. విజయ్ విజయం, అసలు మేటర్ ఇదా!
Advertisement

Jagan – Vijay: తమిళ సూపర్ స్టార్, టీవీకే పార్టీ అధినేత విజయ్.. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో దుమ్మురేపారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ యావత్ దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. తమిళనాడులో అత్యధిక స్థానాల్లో గెలుపొందిన అతిపెద్ద పార్టీకి ప్రస్తుతం టీవీకే సత్తా చాటింది. అయితే ఈ స్థాయి సక్సెస్.. విజయ్ ను వరించడంతో దీని వెనుక ఉన్న కారణాలను అన్వేషించే పనిలో చాలా మంది పడ్డారు. ఈ క్రమంలోనే విజయ్ సక్సెస్ వెనుక వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. తనవంతు తోడ్పాటును విజయ్ కు జగన్ అందించినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అటు జగన్ సైతం విజయ్ కు కంగ్రాట్స్ చెప్పడం, వైసీపీ సోషల్ మీడియా టీవీకే విజయాన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది.

జగన్ విషెస్.. ఫొటోలు వైరల్

తమిళనాడులో విజయ్ కు చెందిన టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడటంతో ఏపీలోని వైసీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. గతంలో ఓ ఫంక్షన్ లో జగన్, విజయ్ దిగిన ఫొటోలను ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ సైతం.. విజయ్ ను సోదరుడిగా సంబోదిస్తూ నెట్టింట పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. సోదరుడు విజయ్ కు అభినందనలు అంటూ జగన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ప్రజాజీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్ కు మరింత మంచి జరగాలని జగన్ కోరుకున్నారు. దీంతో విజయ్ – జగన్ మధ్య రాబోయే రోజుల్లో సన్నిహిత సంబంధాలు ఉండనున్నాయని ఇప్పటి నుంచే ప్రచారం మెుదలైంది.

విజయ్, జగన్‌కు పోలికలు..

Advertisement

ఇదిలా ఉంటే తమిళనాడులో ఈ స్థాయిలో విజయ్ సక్సెస్ కావడం వెనుక జగన్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో జగన్ కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. ఈసారి విజయ్ కు సైతం వర్క్ చేశారు. ఏపీలో సింగిల్ గా పోటీ చేసి.. 175 స్థానాలకు గాను 151 గెలిచిన విధానం పీకేకు బాగా తెలుసు. తండ్రి నుంచి వచ్చిన ప్రజాబలం జగన్ ఉంటే.. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫ్యాన్ బేస్ విజయ్ కు ఉంది. దీనికి తోడు.. ఇరువురు క్రిస్టియన్ బ్యాక్ డ్రాప్ కలిగి ఉండటం, ఆయా ఓటర్లలో భారీ ఎత్తున మద్దతు కూడగట్టగలడం సిమిలర్ పాయింగ్ గా చెప్పవచ్చు.

జగన్ వ్యూహం.. విజయ్ విజయం!

జగన్, విజయ్ కు పోలికలు ఉండటంతో పీకే ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ ర్యాలీలో జగన్ కటౌట్ లేదా ఫొటోను ప్రచారం చేయడం ద్వారా అక్కడి తెలుగువారిని విజయ్ పక్షాన చేర్చే వ్యూహాన్ని పీకే రచించినట్లు సమాచారం. అప్పటికే ఓ ఫంక్షన్ లో విజయ్, జగన్ కలవడం.. వారిద్దరు సన్నిహితంగా కెమెరా ముందు కనిపించడంతో జగన్ మద్దతు విజయ్ కు ఉందన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దీంతో జగన్ ను అభిమానించేవారు.. విజయ్ పక్షాన ర్యాలీ అయినట్లు విశ్లేషణలు ఉన్నాయి. తద్వారా జగన్ నేరుగా విజయ్ పక్షాన ప్రచారంలోకి దిగనప్పటికీ.. ఆయన కటౌట్ వాడుకునే కొంతలో కొంతైనా టీవీకే పార్టీ లబ్ది పొందిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Also Read: విజయ్ సునామీలో.. కొట్టుకుపోయిన ద్రవిడ సిద్దాంత పార్టీలు.. 6 దశాబ్దాల చరిత్రకు 6 నెలల్లో చెక్!

మాట నిలబెట్టుకున్న పీకే..!

ఇదిలాఉంటే తమిళనాడు ఎన్నికల్లో టీవీకేను గెలిపించి తీరుతానని గతంలో ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధినేత విజయ్ నిలవడంతో.. అన్నమాట నిలబెట్టుకున్నావంటూ పలువురు వైసీపీ అభిమానులు పీకేను ఆకాశానికి ఎత్తుతున్నారు. గతంలో టీవీకే సభలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్.. తనను తాను ధోనితో పోల్చుకున్నారు. బిహార్ కు చెందిన ఎం.ఎస్. ధోని (ప్రస్తుత ఝార్ఖండ్ ఒకప్పుడు బిహార్ లో అంతర్భాగం).. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను విజేతగా నిలిపాడని అన్నారు. ఇప్పుడు తాను కూడా ధోనిలా మారి.. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీని విజేత నిలుపుతానని ఆ సందర్భంలో హామీ ఇచ్చారు.

Also Read: Roja vs DMK: డీఎంకేను ముంచింది రోజానా? తెలిసి మరీ ఆ తప్పు చేశారా? నెట్టింట ఒకటే రోస్టింగ్!

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×