E-Paper
Advertisement

Vijay – Trisha: విజయ్ సక్సెస్ వెనుక.. త్రిష మాస్టర్ ప్లాన్ ఉందా? తమిళనాట ఆసక్తికర చర్చ!

Vijay – Trisha: విజయ్ సక్సెస్ వెనుక.. త్రిష మాస్టర్ ప్లాన్ ఉందా? తమిళనాట ఆసక్తికర చర్చ!
Advertisement

Vijay – Trisha: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అందరి దృష్టి ప్రముఖ నటి త్రిష వైపునకు మళ్లింది. గత కొద్ది కాలంగా త్రిష, విజయ్ ప్రేమలో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే విడాకుల కోసం విజయ్ భార్య కోర్టుకు సైతం వెళ్లారు. ఇదిలా ఉంటే విజయ్ సూపర్ సక్సెస్ కావడం వెనుక త్రిష పాత్ర కూడా ఉందన్న ప్రచారం తమిళనాట జరుగుతోంది.

విజయ్ సక్సెస్‌లో త్రిష పాత్ర?

విజయ్ కు చెందిన టీవీకే పార్టీలో ప్రస్తుతం త్రిష ఏ అధికారిక పదవిలోనూ లేరు. ఆమె ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో సైతం నిలవలేదు. అయినప్పటికీ విజయ్ విజయంలో ఆమె పాత్ర ఉందంటూ తమిళనాట ప్రచారం చేస్తున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్లిన త్రిష.. అక్కడ మెుక్కులు చెల్లించుకొని నేరుగా విజయ్ ఇంటికే వెళ్లారు. స్వామివారి తీర్ధ ప్రసాదాలను విజయ్ కు అందజేశారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఘన విజయం సాధించాలని ఆమె శ్రీవారిని బలంగా కోరుకున్నట్లు కూడా తెలుస్తోంది.

రాజకీయ విమర్శలకు చెక్..

Advertisement

తమిళనాడు ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ నేత ఒకరు నేరుగా త్రిష పేరును ప్రస్తావిస్తూ విజయ్ ను తీవ్ర విమర్శలు చేశారు. భార్య ఉండగానే మరో స్త్రీతో రిలేషన్ ఏంటన్న అంశాన్ని ఆయన రాజకీయంగా లేవనెత్తారు. ఆ సమయంలో విజయ్ నైతిక విలువలపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలోనే త్రిష కలుగుజేసుకొని.. విజయ్ కు మద్దతుగా నిలిచారు. తనపై విమర్శలు చేసిన బీజేపీ నేతకు ఘాటుగా చురకలు అంటించారు. ఇది విజయ్ రాజకీయ మైలేజీని మరింత పెంచిందని కూడా తమిళనాడులో అంటున్నారు. ఆ రోజు త్రిష స్పందిచకపోయి ఉంటే విజయ్ కు పొలిటికల్ డ్యామేజ్ అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సినీ సెంటిమెంట్..

విజయ్ – త్రిష జోడీకి తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. సరిగ్గా విజయ్ కొత్త పార్టీ ప్రకటించిన తర్వాత నుంచి.. ఈ జంట పెద్ద ఎత్తున మీడియా కంట్లో పడుతూ వచ్చింది. సినిమాల పరంగా తమ జోడీకి ఉన్న క్రేజ్ ను పొలిటికల్ గానూ ఉపయోగించుకోవాలన్న మాస్టర్ ప్లాన్ ను త్రిష వేసిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే విజయ్ గత చిత్రం లియోలో ఆమె నటించడం, అది బ్లాక్ బాస్టర్ కావడంతో ఆ ‘లక్కీ సెంటిమెంట్’ రాజకీయాల్లో కూడా పనిచేసిందని అభిమానులు నమ్ముతున్నారు.

Advertisement

Also Read: బెంగాల్లో బద్దలైన దీదీ కోట.. 15 ఏళ్ల పాలనకు శుభంకార్డ్.. ఫలించిన మోదీ-షా వ్యూహం!

సక్సెస్‌కు నిజమైన కారణాలు..

విజయ్ వెనుక త్రిష ఉందంటూ జరుగుతున్న ప్రచారం కొందరి వ్యక్తిగత అభిప్రాయాలుగా చెప్పవచ్చు. అయితే క్షేత్రస్థాయిలో విజయ్ విజయానికి ప్రధానంగా కొన్ని అంశాలు తోడ్పడ్డాయి. గత రెండేళ్లుగా విజయ్ తన పార్టీ క్యాడర్‌ను క్షేత్రస్థాయిలో బలంగా నిర్మించుకున్నారు. దీనికి తోడు జెన్ జీలో విజయ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మొదటిసారి ఓటు వేస్తున్న యువత భారీగా విజయ్ వైపు మొగ్గు చూపారు. అలాగే దశాబ్దాలుగా మార్పు కోరుకుంటున్న తమిళ ప్రజలకు విజయ్ ఒక బలమైన ‘థర్డ్ ఆల్టర్నేటివ్’గా కనిపించారు. తన మేనిఫెస్టోలో విజయ్ ప్రకటించిన సంక్షేమ పథకాలు, ద్రవిడ పార్టీలపై చేసిన విమర్శలు ప్రజలను ఆకట్టుకున్నాయి. త్రిష ప్రచారాన్ని పక్కన పెడితే.. విజయ్ సక్సెస్ క్రెడిట్ అంతా ఆయన వ్యూహాలు, పార్టీ నేతలు, కార్యకర్తల కష్టానికే దక్కుతుందని చెప్పవచ్చు.

Also Read: తమిళనాట విజయ్ ప్రభంజనం.. డ్రైవర్ కొడుకు అద్భుత విజయం

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×