E-Paper
Advertisement

బీఆరెస్‌ను వెంటాడుతున్న ధ‌ర్నాచౌక్! అక్క‌డే ఆ పార్టీ నిర‌స‌న‌లు..! వారికిప్పుడు అదే గ‌తి..

బీఆరెస్‌ను వెంటాడుతున్న ధ‌ర్నాచౌక్! అక్క‌డే ఆ పార్టీ నిర‌స‌న‌లు..! వారికిప్పుడు అదే గ‌తి..
Advertisement

ఇప్పుడు అధికారంలో ఉన్న‌ట్టే మాట్లాడుతాడు. అధికారంలోకి వ‌చ్చేది ప‌క్కా అని త‌నే డిసైడ్ చేస్తాడు! త‌మను అన‌వ‌స‌రంగా ఓడగొట్టి జ‌న‌మే త‌ప్పు చేశార‌నే విధంగా నింద‌లేస్తాడు. ఇప్పుడు త‌ప్పు తెలుసుకుని కేసీఆర్ మ‌ళ్లీ రావాల‌ని ఆ జ‌నాలే పిలుస్తున్నార‌ని ప్ర‌క‌టించేస్తాడు! నేను చెప్పేది కేటీఆర్ గురించేన‌ని ఇప్ప‌టికే అర్థ‌మై ఉంటుంది మీకు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. త‌మ ప‌దేళ్ల పాల‌న‌లో లోపాలేమీ లేవ‌ని, బంగారు పాల‌నే అన్న‌ట్టుగా మాట్లాడే ఈ కేటీఆర్‌.. తమ త‌ప్పుల‌ను, త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను ఏనాడైనా చ‌ర్చించుకున్నారా? ఆత్మ ప‌రిశీల‌న చేసుకున్నారా? ప‌రివ‌ర్త‌న చెందారా? ఆ మాట తీరు.. వ్య‌వ‌హార శైలి చూస్తే ఈ ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్లు దొరికిపోతాయి.

హైద‌రాబాద్‌లో ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. పార్టీల‌క‌తీతంగా.. కార్మిక‌, క‌ర్ష‌క వ‌ర్గాలన్నీ పాల‌క‌వ‌ర్గాల‌కు నిర‌స‌న తెలియ‌జేసే ధ‌ర్నాచౌక్‌ది ఓ చ‌రిత్ర‌. ఇక్క‌డ ఆందోళ‌న చేసి.. త‌మ స‌మ‌స్య‌ల‌ను , త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌ను స‌ర్కార్ ముందు పెడ‌తారు. ఒత్తిడి తెస్తారు. డిమాండ్ చేస్తారు. ఆందోళ‌న ఉధృతం చేస్తారు. చివ‌ర‌గా స‌మ‌స్య ప‌రిష్క‌రించుకుంటారు. అలాంటి ధ‌ర్నాచౌక్‌ను అక్క‌డ్నుంచి ఎత్తేసింది మ‌న కేసీయారే. అవును.. ఆయ‌న ప‌దేళ్ల పాల‌న‌లో త‌న‌కు న‌చ్చిన‌ట్టు నిర్ణ‌యాలు తీసేసుకున్నాడు. చికాకు తెప్పించే ప‌న‌న్నా.. ప్ర‌శ్నించే వేదిక‌లు, సంస్థ‌ల‌న్నా.. ఆయ‌న‌కు చెడ్డ చిరాకు. వెంట‌నే దానికి అడ్డుక‌ట్ట వేసే ప్ర‌య‌త్నం చేస్తాడు. వీలైతే దాన్ని క‌నిపించ‌కుండానే చేసేస్తాడు.

Advertisement

అలాంటి కోవ‌కు చెందిన‌దే ఈ ధ‌ర్నాచౌక్ ఉదంతం. నిత్యం వేలాది మంది వ‌చ్చీపోయే ద‌గ్గ‌ర ఈ ధ‌ర్నాలేంటండీ? అక్క‌డ ఇక‌పై ధ‌ర్నాలు గిర్నాలు చేయొద్దు.. ఎత్తేయండి దాన్ని..! అని ఓ ఫైన్ మార్నింగ్ ఆర్డ‌ర్ ఇచ్చేశాడు. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లెదురైనాయి. కానీ మ‌న సారు విన‌డు కదా! వింటే కేసీఆర్ ఎందుక‌వుతాడు? ఇది తాము నిర‌స‌న తెలిపేందుకు కేటాయించిన వేదిక‌.. త‌మ హ‌క్కు అని పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు కూడా నడిచాయి. అయినా డోంట్ కేర్‌! కేసీఆర్ వ‌ద్ద‌న్నా.. అక్క‌డ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు, ధ‌ర్నాలు చేప‌డుతూనే ఉన్నారు. ఇదిగో ఇప్పుడు అధికారం పోయిన త‌రువాత ఈ కేసీఆర్ పార్టీకి.. అదే బీఆరెస్‌కే ఆ వేదిక అవ‌స‌రం ప‌డింది.

నిత్యం ఏదో ఒక రూపంలో ధ‌ర్నాలు చేస్తూ.. నిర‌స‌న‌లు తెలియ‌జేసేందుకు ఆ వేదికే అవ‌స‌ర‌మైంది వారికి. కానీ ఆ చౌక్‌ను బాస్ చ‌రిత్ర‌లోంచి తీసేశాడుగా.. ఆ పేరు ఎలా వాడుకోవ‌డం.. అని ఇబ్బందిప‌డి.. చివ‌ర‌గా బీఆరెస్ నేత‌లు ఆ స్థ‌లానికి పెట్టుకున్న పేరు.. ఇందిరాపార్క్ వ‌ద్ద‌. అంతే మ‌రి. ఎక్క‌డ జ‌రిగింది ధ‌ర్నా అంటే.. ఇందిరాపార్క్ వ‌ద్ద.. ధ‌ర్నా చౌక్ పేరు తీస్తే ఒట్టు. ఒక్క‌సారి సార్ వ‌ద్ద‌నుకున్నారంటే.. ఇక వాళ్ల ముఖం చూడ‌డు. అందుకే .. ఈ ధ‌ర్నాచౌక్ పేరును కూడా మేం ఉచ్చ‌రించం.. అని బాస్ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా.. ఆయ‌న నాయ‌క‌త్వాన్ని బ‌లప‌రిచే సైన్య‌మంతా ఇప్పుడు అదే వేదిక‌గా … నిర‌స‌నలు తెలియ‌జేస్తున్న‌ది.

Advertisement

ఒక‌వేళ ధ‌ర్నాచౌక్ అని పిలిస్తే.. అది త‌మ‌కే నామోషీ అనుకున్నారేమో..! కానీ స్థ‌ల‌మైతే కావాలి.. అక్క‌డైతేనే మీడియా క‌వ‌ర్ చేస్తుంది. అంద‌రికీ సెంట‌ర్ పాయింట్‌.. స‌ర్కార్ న‌జ‌ర్లో ప‌డుతుంది…! బాస్ కూడా చూస్తారు..! అంతా బాగ‌నే ఉందిరా బై.. ధ‌ర్నాచౌక్ అంటే మీ ముల్లేం పోయింది.. అంటే.. అన‌రు. అక్క‌డికి రాకుండా మ‌రి మీ తెలంగాణ భ‌వ‌న్‌లో చేసుకోవ‌చ్చు క‌దా.. అంటే ఒక‌రి ముఖాలు ఒక‌రు చూసుకుంటారు. న‌వ్విపోదురు గాక మాకేటి సిగ్గు అన్న‌ట్టుగా .. ఇదిగో ఇవాళ ఇందిరా పార్క్ వ‌ద్ద ధ‌ర్నా చేసినం.. జ‌ర వార్త రాయుర్రే ప్లీజ్‌.. ! అని అడుక్కోవ‌డానికి మాత్రం వెనుకాడ‌రు.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×