E-Paper
Advertisement

మంత్రులకు ఝలకిచ్చిన సీఎం రేవంత్.. మరోదారి లేదా?

మంత్రులకు ఝలకిచ్చిన సీఎం రేవంత్.. మరోదారి లేదా?
Advertisement

రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా మారింది.తమ సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. సమ్మె నోటీసు ఇచ్చి 40 రోజులు అయినా సర్కారు తమను పట్టించుకోవడం లేదని కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే విధులను బహిష్కరించారు. డిమాండ్లు నేరవేరే వరకు సమ్మెలోనే ఉంటామని ఆర్టీసీ ఎండీ, ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. మొత్తం 32 డిమాండ్లను కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచారు.అందులో మూడు డిమాండ్లు మినహా మిగతా వాటికి రేవంత్ సర్కార్ సానుకూలంగా స్పందించింది. మిగతా వాటికి నో చెప్పింది. అవే కీలక డిమాండ్లు అని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

తగ్గేది లేదంటున్న జేఏసీ..

సమ్మె నోటీసులు ఇచ్చాక సైతం ప్రభుత్వం కావాలని కాలయాపన చేసిందని జేఏసీ నాయకులు చెబుతున్నారు.తమను చర్చలకు పిలిపించి డిమాండ్ల మీద కాకుండా ఇతర అంశాల మీద ప్రస్తావించడం ఏంటని ఫైర్ అయ్యారు.అందుకే తాము చర్చల మధ్యలో నుంచి బయటకు వచ్చామని జేఏసీ నేతలు పేర్కొన్నారు.డిమాండ్లు పరిష్కరించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టంచేశారు.నిన్న ఇద్దరు కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అందులో ఒకరు మృతి చెందారు. మరొకరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని, డిమాండ్లు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మంత్రుల బృందం ఆర్టీసీ జేఏసీ నేతలకు వివరించినట్టు తెలుస్తున్నది.

బెనిఫిట్స్, వేతన పెంపు..

Advertisement

ఆర్టీసీ కార్మికులు చాలా మంది ఇప్పటికే పదవీ విరమణ పొందారు. వారిలో కొందరికే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లభించాయి. మిగతా వారికి ఇంకా రాలేదు. దీనికి తోడు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా తమ వేతనాలు పెంచాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్లను పునరుద్ధరించాలని జేఏసీ డిమాండ్ చేస్తున్నది. అందుకు సర్కార్ సుముఖంగా లేనట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి లోపైన గురైన కార్మికులు ఆత్మహత్యయత్నం చేసినట్టు తెలుస్తోంది. 29 డిమాండ్లకు ఓకే చెప్పిన సర్కార్.. మూడు డిమాండ్ల పరిష్కారంలో మాత్రం వెనకడుగు వేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఐస్‌క్రీమ్ ఎక్కువగా తింటున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే భయపడాల్సిందే!
దీంతో పెండింగ్ డిమాండ్లను సైతం త్వరగా పూర్తిచేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వీరి బెనిఫిట్స్ చెల్లింపుల కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం కోత విధించనున్నట్టు నిన్నటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రులు వెల్లడించారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు. ఓవైపు ఆర్టీసీ కార్మికులు, మరోవైపు విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు సైతం నిరసనలు తెలుపుతున్నారు. డిమాండ్ల సాధన కోసం కదం తొక్కుతున్నారు.దీంతో ఏం చేయాలో తోచక రేవంత్ సర్కార్.. ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోతలు విధించాలని నిర్ణయించింది.నేడు డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారులు చర్చించనున్నారు.సమ్మె ఉంటుందా? ముగుస్తుందా? అనేది తెలియాల్సి ఉన్నది.సమ్మె సక్సెస్ అయితే రేపు లేదా సాయంత్రం నుంచి బస్సు సర్వీసులు పున: ప్రారంభంకానున్నాయి.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×