E-Paper
Advertisement

నియోజకవర్గాల పునర్విభజన.. సీఎం చంద్రబాబు క్లారిటీ, ఆ బిల్లులో అదే ఉందని వ్యాఖ్య

నియోజకవర్గాల పునర్విభజన.. సీఎం చంద్రబాబు క్లారిటీ, ఆ బిల్లులో అదే ఉందని వ్యాఖ్య
Advertisement

Delimitation: ఓ వైపు మహిళా రిజర్వేషన్లు.. ఇంకోవైపు డీలిమిటేషన్ బిల్లు గురువారం పార్లమెంటు ఉభయసభల ముందుకు రానుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నష్టం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల మంత్రులు పదే పదే చెబుతున్నారు? దీనిపై కేంద్రం ఇలాంటి క్లారిటీ ఇచ్చింది? సీఎం చంద్రబాబు ఏమన్నారు? రాత్రి కూటమి నేతల భేటీలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయి.

నియోజకవర్గాల పునర్విభజన.. కేంద్రంతో సీఎం చంద్రబాబు మంతనాలు

Advertisement

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై గురువారం రాత్రి అమరావతిలో కూటమి నేతలు భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ హాజరయ్యారు. ఈ రెండు అంశాలపై ప్రధానంగా దాదాపు మూడు గంటలపాటు చర్చించారు. ముసాయిదా బిల్లుల్లో పొందుపరిచిన అంశాలపై చర్చించారు.

లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచుతామని బిల్లులో ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కొన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తిన అంశాలపై చర్చించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌, కిషన్‌రెడ్డి, రామ్మోనాయుడులతో ఫోన్ లో మాట్లాడారు.

Advertisement

క్లారిటీ ఇచ్చిన పలువురు కేంద్రమంత్రులు.. వేడుక నిర్వహించాలని ఆలోచన

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని చెప్పినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. జనాభా సంఖ్యతో సంబంధం లేకుండా అన్నిరాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరుగుతాయని, అదే విషయాన్ని బిల్లులో స్పష్టంగా ఉందని చెప్పారట. కేంద్రం వివరణతో కూటమి నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.

బిల్లును స్వాగతించాలని డిసైడ్ అయ్యారు. కావాలనే కొందరు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయం ఆ భేటీలో వ్యక్తమైంది. జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంచుతారు. లోక్‌సభ స్థానం పరిధిలోని జనాభాకు సంబంధించి రాష్ట్రానికి-రాష్ట్రానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది.

ALSO READ: 2029లో వచ్చేది నేనే.. నీ తాత కూడా ఆపలేడు.. వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

ఈశాన్య రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానంలో జనాభా చాలా తక్కువ. కేరళలో అధిక జనాభా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానానికి ‌సగటు జనాభా 13 లక్షల వరకు ఉంటుందన్న చర్చ ప్రస్తావించారు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 50శాతం పెంచే అంశాన్ని పునర్విభజన ముసాయిదా బిల్లులో ప్రస్తావించలేదు.

దీనిపైనా కేంద్ర మంత్రులు కూటమి నేతలకు క్లారిటీ ఇచ్చారు. ముసాయిదాలో ప్రస్తావించకపోయినా చర్చ సందర్భంగా స్పష్టత ఇస్తామని అన్నట్లు తెలిసింది. అసెంబ్లీ సీట్లు 50 శాతం పెంచే అధికారాన్ని పునర్విభజన కమిటీకి ఇస్తామని కేంద్రమంత్రులు అన్నట్లు తెలిసింది. మహిళా బిల్లు ఆమోదం తర్వాత దాన్ని వేడుకగా నిర్వహించాలని కూటమి నేతలు ఈ భేటీలో డిసైడ్ అయ్యారు.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×