E-Paper
Advertisement

బాల్క సుమ‌న్.. ఉద్య‌మ‌ వీరుడి నుంచి రాజ‌కీయ ఉన్మాది వ‌ర‌కు! బీఆరెస్ మీడియా గ్రూపు నుంచి బాల్క మాట‌లు గాయ‌బ్‌!

బాల్క సుమ‌న్.. ఉద్య‌మ‌ వీరుడి నుంచి రాజ‌కీయ ఉన్మాది వ‌ర‌కు! బీఆరెస్ మీడియా గ్రూపు నుంచి బాల్క మాట‌లు గాయ‌బ్‌!
Advertisement

మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మంలో ఆ దూకుడు అత‌న్ని హీరోను చేసింది. వెనుకాముందు ఆలోచించ‌కుండా క‌ద‌న‌రంగంలో దిగే తీరు.. ఉద్య‌మానికి ఊపిరి పోసింది. గెరిల్లా త‌ర‌హా యుద్ధ విద్య‌లు అమ‌లు చేసిన‌ప్పుడు అంద‌రినీ ఔరా అనిపించేలా చేశాయి. ఇవ‌న్నీఅత‌న్ని అతి చిన్న వ‌య‌స్సులోనే ఓ రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగేందుకు దోహ‌ద‌ప‌డ్డాయి. తెలంగాణ వ‌స్తుందో రాదోన‌నే రోజుల్లో ఆ తెగువ.. సాహ‌సం.. ప్ర‌ద‌ర్శించిన నాయ‌కులు అరుదే. అందులో బాల్క సుమ‌న్ ఒక‌డు. అందుకే కేసీఆర్ ద‌గ్గ‌ర‌కు తీశాడు.

కేటీఆర్ అక్కున చేర్చుకున్నాడు. టీఆరెస్‌కు ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ఉన్న నేప‌థ్యంలో అరుదైన అవ‌కాశాల‌నే పార్టీ ఇచ్చింది. అతి చిన్న వ‌య‌స్సులో ఎంపీ టికెట్ ఇవ్వ‌డం.. గెలిపించుకోవ‌డం కూడా బాల్క‌కు క‌లిసి వ‌చ్చింది. అధిష్టానం ఆశీస్సుల‌తో, అండ‌దండ‌ల‌తో ఎంపీ అయ్యాడు. ఎమ్మెల్యే అయ్యాడు. దీన‌తంటికీ కార‌ణం స‌మ‌య‌స్పూర్తితో, తెగువ ప్ర‌ద‌ర్శించి త‌నకో ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకున్నందుకే. ఎస్సీ కార్డు కూడా అత‌నికి క‌లిసివ‌చ్చింది. కాలం కూడా తోడైంది. అందుకే ప‌ద‌వులు ద‌క్కాయి. అతి త‌క్కువ స‌మ‌యంలో, చిన్న వ‌య‌స్సులో అంద‌ల‌మెక్కాడు. అదే అత‌నికి అహంకారం తెచ్చిపెట్టింది. గ‌ర్వం తోడైంది.

Advertisement

త‌న‌కు కేసీఆర్ ఆశీస్సులున్నాయ‌ని వీర్ర‌వీగాడు. కేటీఆర్ త‌న‌కు బాగా క్లోజ‌ని ఎగెరెగిరిప‌డ్డాడు. అధికారం పోయింది.. మ‌ళ్లీ అధికారంలోకి రావాలంటే ఏవో జిమ్ముక్కులు చేయాలో.. గంద‌ర‌గోళం సృష్టించాలె.. హింసాయుత వాతావ‌ర‌ణం క్రియేట్ చేయాలె. అవ‌స‌ర‌మైతే హింస‌కు తెగబ‌డాలె.. ఇవే ఇప్పుడు అత‌ను అనుస‌రించిన యుద్ద విద్య‌లు. అందుకే అధిష్టానం త‌న‌ను ఎక్క‌డ మ‌రిచిపోయింద‌ని బెంగ ప‌డ్డాడో.. ! అత‌ని ఉనికి క‌నుమ‌రుగైపోతున్న‌ద‌ని భ‌య‌ప‌డ్డాడో తెలియ‌దు కానీ.. మ‌ళ్లీ పెద్ద‌ల ఆశీస్సుల కోసం రెచ్చ‌గొట్టే మాట‌ల‌కు నాంది ప‌లికాడు. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజం సినిమాల త‌ర‌హాలో డైలాగులు దంచ‌డం ప్రారంభించాడు. రండి.. న‌రుకుదాం.. చంపుదాం.. ! త‌గుల‌బెడ‌దాం.. తన్నుదాం.. ! అని హింస‌కు పురిగొల్పి.. నాయ‌కుల‌ను రెచ్చగొట్టి.. ప‌రిస్థితుల‌ను అస్థిర‌ప‌రిచి.. త‌న ఉనికిని కాపాడుకుని.. పెద్ద‌ల న‌జ‌ర్‌లో ప‌డి.. మ‌ళ్లీ పెద్ద పెద్ద ప‌ద‌వులు, శాఖ‌లు పొంది.. ఇదీ బాల్క సుమ‌న్ భ‌విష్య‌త్ రాజ‌కీయ హింసాత్మ‌క కార్య‌చ‌ర‌ణ వెనుక వ్యూహ‌ర‌చ‌న‌.

త‌న‌పై ఉద్య‌మ సమ‌యంలో ఎన్నో కేసులు పెట్టారు.. పెట్టుకోండి అన్నాడు. మ‌ళ్లీ త‌ను అలా రెచ్చ‌గొట్టే మాట‌లు మాట్లాడ‌లేదు.. అంతా ఫ్యాబ్రికేష‌న్ అన్నాడు. మ‌రి బీఆరెస్ మీడియా గ్రూపు నుంచి ఆ లైవ్ వీడియో ఎందుకు డిలేట్ అయ్యింది. ఎందుకంత భ‌యం. అంటే అన్నాన‌ని చెప్పుకో. పాత ఉద్య‌మ స‌మ‌యంలో త‌న గాధ‌ల‌ను మ‌ళ్లీ వ‌ళ్లెవేయ‌డం ఎందుకు? అప్ప‌టి ప‌రిస్థితుల్లో అది క‌రెక్టేమో! ఇప్పుడు నువ్వు చేసేది నీ స్వార్థ రాజ‌కీయ ల‌బ్ది కోసం, అధికార యావ కోసం.. ప‌ద‌వుల పందేరం కోసం… పెద్ద‌ల ప్రాప‌కం కోసం.. ! ఇదీ తేడా. క్లారిటీ. అందుకే దిగ‌జారుడు రాజ‌కీయాల్లోకి బీఆరెస్ ప‌డిపోయింది అనేది.

Advertisement

మీ పెద్ద‌లు చెప్పిన‌ట్టు.. కాంగ్రెస్ ప్ర‌భ‌త్వంపై తీవ్ర ప్ర‌జా వ్యతిరేక‌త వ‌చ్చిన‌ప్పుడు.. ఇలా ఇంత‌లా .. దిగ‌జారాల్సిన పనేం లేదు క‌దా బాల్కా! ఈ చ‌ర్య‌లే చెబుతున్నాయి.. మీరు ఇంకా ఇంకా జ‌నం మెప్పు కోసం వెంప‌ర్లాడుతున్నార‌ని. కానీ ఎంచుకున్న మార్గ‌మే మ‌రీ చీపుగా ఉంది సుమ‌న్‌. ఒక్క మాట మాత్రం నిజం ఒప్పుకున్నాడు. రైతుల ధ‌ర్నాకు అంతా బీఆరెస్ కార్య‌క‌ర్త‌లే హాజ‌ర‌వుతున్నార‌ట‌. అందుకే కేటీఆర్.. ప్ర‌జా ఉద్య‌మాలు వీడి.. సోష‌ల్ మీడియాలో వీరోచిత ఉద్య‌మాలు నిర్మిస్తున్నాడు.. ! అనే విమ‌ర్శ‌లూ ఉన్నాయి. ఇది కూడా చెప్పి ఉంటే బాగుండేది.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×