E-Paper
Advertisement

కుక్క‌కాట్ల‌కు చెప్పుదెబ్బ‌.. కుక్క‌తిట్లు ఇక ఎంచ‌క్కా తిట్టుకోవ‌చ్చ‌బ్బా!

కుక్క‌కాట్ల‌కు చెప్పుదెబ్బ‌.. కుక్క‌తిట్లు ఇక ఎంచ‌క్కా తిట్టుకోవ‌చ్చ‌బ్బా!
Advertisement

కుక్క‌లంటే అంత అలుసా..? అవి జీవాలు కావా? మీరు అస‌లు మ‌నుషులేనా? అని కుక్క‌ల ప్రేమికులు ఎడాపెడా చెడామ‌డా తిట్ట‌కుండా చేసింది సుప్రీంకోర్టు. కుక్క‌లు కుక్క‌లే.. అవి కాట్లు వేస్తుంటే ఆ బాధ‌మీకేం తెలుసు? నిజ‌మే క‌దా? చిన్న‌పిల్ల‌ల్ని, పెద్ద మ‌నుషుల్ని పిక్కలు పీకుతుంటే.. ఆ వీడియోలు చూడ‌టానికే ఒళ్లు గ‌గుర్పొడుస్తుంటే.. ఆ బాధ‌లు వ‌ర్ణించ‌గ‌లమా? భ‌రించ‌గ‌ల‌మా? సుప్రీం తీర్పు బాగుంద‌బ్బా. ఎంత‌లా అంటే.. కుక్క కాటుకు చెప్పుదెబ్బ‌లా. కుక్క‌ల గురించి మాట్లాడితేనే మీద ప‌డి క‌రిచేసినంత ప‌నిచేసే సెల‌బ్రిటీల కాట్ల బాధ మ‌న‌కికలేద‌బ్బా! మ‌నం మ‌నుషులమే కాన‌ట్టు… ఏదో అడ‌వుల్లోంచి పారిపోయి వ‌చ్చిన ఆది మాన‌వులైన‌ట్టు వాళ్లు ఏడుస్తూ శాప‌నార్దాలు పెడుతుంటే.. మ‌న మీద మ‌న‌కే డౌటొచ్చి.. మ‌న క‌న్నా ఆ కుక్క బ‌తుకులే న‌యం క‌దా..! వాటికి ఎంచ‌క్కా ఆ సెల‌బ్రిటీల ప్రేమ దొరుకుతుంది? స‌పోర్టూ ఉంది… అనుకున్న రోజులూ ఉన్నాయి. కానీ, ఇప్పుడు రోజులు మారాయండోయ్‌! అత్యున్న‌త న్యాయ స్థానం కూడా మ‌న బాధ అర్థం చేసుకున్న‌ట్టుంది.

విచ్చ‌ల‌విడిగా సంతతి పెంచుకుని వీధుల్లెంబ‌డి తిరుగుతూ చికెన్ లెగ్ పీసుల కోసం ఇంట్లో పిల్ల‌లు కొట్లాడిన‌ట్టు.. మ‌నిషి పిక్క‌ల కోసం కుక్క‌లు కొట్లాడిన‌ట్టే వుంది చాలా చోట్ల‌. కొంద‌రంటారు.. వాటికి చికెన్ అల‌వాట‌య్యింది.. అందుకే ఆ చిన్నారిని చికెన్ అనుకుని తినేసింది అని. ఇంత‌క‌న్నా దారుణ‌మైన స‌మ‌ర్థింపు ఇంకోటుందా? మ‌న స‌మాజంలో కుక్క‌లు లేకున్నా బ‌తుకుతామేమో గానీ, ప‌సికందుల‌ను కుక్క‌లు పీక్కుతినే స‌న్నివేశాలు చూసుకుంటూ బ‌త‌క‌డ‌మా? కుక్క‌ల‌కు అది సాధ్య‌మేమో.. కుక్కల నోటికి గోరు ముద్ద‌లు తినిపించి … అదే చేత్తో త‌నూ ఎంగిలి ప‌డే ఆ జంతు ప్రేమికుల‌కు సాధ్య‌మేమో..! మ‌న‌కైతే కాద‌బ్బా. ఈ కుక్క‌ల గోల త‌గ్గేలా సుప్రీం స‌ర్కారోళ్ల‌ను కుక్క తిట్లు తిట్టింద‌ట‌గా! మంచిగైంది.

Advertisement

రేబిస్ వ్యాధికి మందులు కూడా స‌రిగ్గా అందివ్వ‌ని స‌ర్కార్లు.. వీధుల్లో కుక్క‌ల సంత‌తిని కంట్రోల్ చేయ‌లేని వీళ్లు.. కుక్క‌ల‌ను చంపితే వీధులెక్కుతారు. కుక్క విశ్వాసానికి మారు పేరు. కాద‌న‌లేం. కానీ ఇక్క‌డ మాట్లాడేది వీధి కుక్క‌ల గురించి. పిక్క‌ల కాట్ల‌కు మ‌రిగిన పిచ్చికుక్క‌ల గురించి. చంపినా త‌ప్పులేదు మ‌రి! విష‌మిచ్చి! ఇది క‌దా ప్రాక్టిక‌ల్‌గా అక్క‌డ అనుభ‌విస్తున్న బాధ‌ను క‌ళ్లారా చూసి ఇచ్చిన తీర్పంటే. ఇది థియ‌రీల‌కు అంద‌దు. జంతు ప్రేమికుల‌కు అస‌లే మింగుడు ప‌డ‌దు. తీర్పే వ‌చ్చింది. బాధ‌లింకా పోలేదు. వీధుల్లో కుక్క‌లు.. మూసీ చుట్టు దోమ‌ల్లా పెరిగి బాగా బ‌లిసి పోయాయి. మ‌నుషుల ఆరోగ్యం గురించి ప‌ట్టించుకోవ‌డంలో నానాటికీ బ‌క్క‌చిక్కిన మ‌న స‌ర్కారోళ్లు ఈ పీడ‌ను విర‌గ‌డ చేయ‌డానికి ఎంత‌కాలం తీసుకుంటారో? అప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ప‌సికందులు బ‌ల‌వ్వాలో!

రాజ‌కీయాల్లో బూతులు కూడా వీధి కుక్క‌ల్లా పెరిగి పేట్రేగిపోతున్న వేళ‌.. ఈ కుక్క‌ల తీర్పు.. సారీ.. కుక్క‌ల మీద తీర్పు న‌యా ట్రెండ్ ఫాలో అయ్యే పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌కు, కొత్త తిట్లు క‌నిపెట్టడంలో జంధ్యాల‌ను మించిపోయిన సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌కు ఎంతో ఉప‌యోగం సుమండీ! తుక్కు తుక్కుగా ఇక కుక్క‌ల కాట్ల‌లా కుక్క‌తిట్లు తిట్టుకోవ‌చ్చు ఎంచ‌క్కా..! ఒక‌రికొక‌రు.. ఒక‌రి మీద ఇంకొక‌రు.. ఒక్క‌డిని చేసి.. ఒంట‌రిగా చూసి కుక్క‌ల మంద ప‌డిన‌ట్టు.. పిచ్చికుక్క‌లా స్వైర విహారం చేసిన‌ట్టు..! అవునూ..ఈ కుక్క‌ల పేరుతో తిట్టే తిట్ల‌కు వ‌చ్చే కిక్కే వేరుగా ఉంట‌దంట‌గా.

Advertisement

మ‌రికెందుకాల‌స్యం? మ‌న ఎన్టీవోడు కూడా కుక్క మూతి పింద‌ల‌ని తిట్టేవాడ‌ట‌. ముద్దుగా ఉంది క‌దా. ఇది తిట్టుగా లేదు. ముద్దుగా మంద‌లించిన‌ట్టుగా ఉంది. ఇక ధిక్కార స్వ‌రం కాలోజీ.. కుక్క‌ల కొడ‌కా! అని ఘాటుగా తిట్టేవాడ‌ట‌. వామ్మో ప‌చ్చి బూతు. ఇది కూడా ఇప్పుడు విరివిగా వాడుక‌లోకి తీసుకుంటే బాగుంటుందేమో ఒక‌సారి తెలుగు రాజ‌కీయ న‌వ‌యువ నేత‌లు, కాబోయే సీఎంలు.. మంత్రులు ఆలోచించాలి. మీరేం అంత‌గా వెనుకాముందాలోచించాల్సిన అవ‌స‌రం లేదు.

మ‌న కేసీయారే అన్నాడు.. సీఎం హోదాలో ఓసారి కుక్క‌ల కొడ‌కా? అని. ఇక మీవీ బ‌తుకులేనా కుక్క‌ల‌లో కుక్క‌ల‌వ‌లే.. పిచ్చికుక్క‌ల వ‌లే!అని సుతిమెత్త‌గా కుక్క‌తిట్టు తిట్ట‌వ‌చ్చు. నీ క‌న్నా ఆ వీధికుక్క న‌యం..! ఇంత‌క‌న్నా దారుణ‌మైన కుక్క తిట్టు ఉండ‌దేమో..! ఊళ్లో పెళ్లికి కుక్క‌ల హ‌డావుడి అంట‌.. మొన్న‌నే మ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనేశాడు. మాటి మాటికి త‌న‌ను విజ‌య్‌తో పోల్చుతున్నార‌ని. ఆపండ్రా జ‌న‌సేనా కుక్క‌ళ్లారా! అని దాని అర్థం. ఇక మీ ఇష్టం ఎన్నైనా తిట్టుకోండి. అందులో కుక్క ఉండ‌టం మాత్రం మ‌రిచిపోవ‌ద్దు.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×