
Shweta Basu Prasad (Image credit:Instagram)
ప్రముఖ సినీనటి శ్వేతా బసు ప్రసాద్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దూరదర్శిని సీరియల్స్ లో బాలనటిగా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె.. ఆ తర్వాత బెంగాలీ, తెలుగు, తమిళ్ సినిమాలలో ప్రధాన పాత్రలు పోషిస్తూ మంచి పేరు దక్కించుకుంది..

Shweta Basu Prasad (Image credit:Instagram)
2002లో మక్దీ సినిమాలో రెండు పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇందులో ఉత్తమ బాలనటిగా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

Shweta Basu Prasad (Image credit:Instagram)
ఇక వెండితెరపై ఈమె విజయం సాధించిన తర్వాత కహాని ఘర్ ఘర్ కీ, కరిష్మా కా కరిష్మా వంటి దూరదర్శిని ధారావాహికల నుండి ఈమెకు అవకాశాలు లభించాయి. ఇక ఆ తర్వాత ఇక్బాల్ చిత్రం తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన ఈమె జర్నలిజం మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

Shweta Basu Prasad (Image credit:Instagram)
ఇక అంతేకాదు క్లాసికల్ మ్యూజిక్ పై డాక్యుమెంటరీ చేసిన ఈమె ఏ ఆర్ రెహమాన్, పండిత్ శివకుమార్ శర్మ , పండిట్ హరిప్రసాద్ చౌరాసియా లాంటి వారు ఈ డాక్యుమెంటరీలో నటించారు.

Shweta Basu Prasad (Image credit:Instagram)
2008లో కొత్త బంగారులోకం సినిమా ద్వారా స్వప్న పాత్రతో తెలుగు అరంగేట్రం చేసిన ఈమె మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Shweta Basu Prasad (Image credit:Instagram)
ఆ తర్వాత రైడ్ , కాస్కో, కలవర్ కింగ్ వంటి చిత్రాలలో చేసిన ఈమె చివరిగా విజేత సినిమా తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు. బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ కెరీర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉన్న ఈమె తాజాగా డ్రెస్సింగ్ రూమ్ నుండి కొన్ని ఫోటోలను పంచుకుంది. అందులో బ్లాక్ డ్రెస్ ధరించిన ఈమె ఎద అందాలను హైలెట్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.