E-Paper
Advertisement

Young Sherlock OTT : ఇండియాలో ఈ మిస్టరీ సిరీస్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు అంటే?

Young Sherlock OTT : ఇండియాలో ఈ మిస్టరీ సిరీస్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు అంటే?
Advertisement

Young Sherlock OTT : ‘ఆఫ్టర్’ మూవీ ఫ్రాంచైజ్ (2019-2023)తో గుర్తింపు పొందిన హీరో ఫియన్నెస్ టిఫిన్. వచ్చే ఏడాది ‘యంగ్ షెర్లాక్ హోమ్స్’‌గా తిరిగి వస్తున్నాడు. రాబర్ట్ డౌనీ జూనియర్, బెనెడిక్ట్ కంబర్‌ బ్యాచ్ షెర్లాక్ పాత్రలతో విశేష ఆదరణ దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు హోమ్స్ టీనేజ్ లో ఎలా ఉండేవాడు? అనే అంశంతో రూపొందిన ఈ సిరీస్ ను ఎప్పుడు, ఏ ఓటీటీలో వీక్షించవచ్చు ? అన్నది తెరపై చూడాల్సిందే.

యంగ్ షెర్లాక్ దేని గురించి?

ఈ బ్రిటిష్ సిరీస్ షెర్లాక్ హోమ్స్ టీనేజ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. అతను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు కళాశాల క్యాంపస్‌లో జరిగిన హత్య ను ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడో ఇందులో చూడవచ్చు. కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతున్న కొద్దీ ఒక పెద్ద కుట్ర బయటపడి, అతను మాస్టర్ డిటెక్టివ్‌గా మారడానికి సహాయపడింది. కథ 1868లో షెర్లాక్‌కు 14 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది. ఆ చిన్న వయస్సులోనే, అతను ఇంగ్లాండ్‌లో మిస్టీరియస్ మరణాల నుండి రష్యా, చైనాలో కుట్రల వరకు నేరాలను పరిష్కరించడం ప్రారంభిస్తాడు.

Advertisement

ఆండ్రూ లేన్ పుస్తకం షెర్లాక్ తన నైపుణ్యాలను ఎలా సంపాదించాడనే విషయాన్ని స్పష్టం ఆయన అభిమానులకు అందించింది. అవి చైనీస్ ట్యూటర్ నుండి మార్షల్ ఆర్ట్, సంగీతకారుడి నుండి వయోలిన్ పాఠాలు వంటివి ఇందులో మెయిన్ హైలెట్. ఈ సిరీస్ కూడా అదే విధంగా ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం ప్రకారం యంగ్ షెర్లాక్ లండన్ బోర్డింగ్ స్కూల్‌లో యుక్తవయసులో హోమ్స్, జాన్ వాట్సన్‌ల పరిచయం, హత్య రహస్యాన్ని ఛేదించడానికి వారు ఎలా కలిసి పని చేశారనే అంశాలను కూడా మేకర్స్ ఇందులో ప్రస్తావించబోతున్నట్టు తెలుస్తోంది.

Read Also :  ఈ వారం ఓటీటీ 20కి పైగా సినిమాలు.. ఆ 3 అస్సలు మిస్ అవ్వకండి..

ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు?

Advertisement

ఈ కొత్త మర్డర్-మిస్టరీ సిరీస్ వచ్చే ఏడాది 2026 మార్చి 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ సిరీస్ ఆండ్రూ లేన్ రాసిన అదే పేరుతో ఉన్న పుస్తకం ఆధారంగా రూపొందింది. 8 ఎపిసోడ్ ఈ సిరీస్ లో హీరో ఫియన్నెస్ టిఫిన్ 19 ఏళ్ల షెర్లాక్ హోమ్స్ పాత్రలో నటించగా, మాక్స్ ఐరన్స్ అతని అన్నయ్య మైక్రోఫ్ట్ పాత్రలో నటించారు. జోసెఫ్ ఫియన్నెస్, నటస్చా మెక్‌ఎల్హోన్ వారి తల్లిదండ్రులుగా నటించారు. డోనాల్ ఫిన్ జేమ్స్ మోరియార్టీగా, జీన్ త్సెంగ్ యువరాణి గులున్ షువాన్‌గా కనిపిస్తారు. కాలిన్ ఫిర్త్ సర్ బుసెఫాలస్ హాడ్జ్‌గా కనిపిస్తారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లను ఇష్టపడే మూవీ లవర్స్ ఈ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వొద్దు. అందులోనూ షెర్లాక్ హోమ్స్ అభిమానులు డోంట్ మిస్.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×