E-Paper
Advertisement

Year Ender 2025 : ఈ సంవత్సరంలో అత్యంత ఖరీదైన OTT డీల్ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

Year Ender 2025 : ఈ సంవత్సరంలో అత్యంత ఖరీదైన OTT డీల్ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?
Advertisement

Year Ender 2025 : ఈ ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. భారీ అంచనాలతో వచ్చిన ఎన్నో సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. కానీ కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు ముందే సగం బడ్జెట్‌లను రాబట్టి, నిర్మాతలకు భారీ లాభాలను ఆర్జించాయి. థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబట్టడమే కాకుండా, నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా భారీగానే రాబట్టాయి. ఈ సంవత్సరం అలా భారీ డీల్స్ కుదుర్చుకున్న అత్యంత ఖరీదైన ఓటీటీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

1. ఓజీ (OG)

పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి నటించిన ‘దే కాల్ హిమ్ ఓజీ’ ఈ సంవత్సరమే విడుదలైంది. చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత, అభిమానులకు ఇమ్రాన్ హష్మి దక్షిణ భారత అరంగేట్రాన్ని చూసే అవకాశం లభించింది. అలాగే పవన్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను రూ.92 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంలో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ తో పాటు ప్రియాంక మోహన్, శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

2. సికందర్ (Sikandar)

Advertisement

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ రిలీజ్ కి ముందు విపరీతమైన హైప్‌ను సృష్టించింది. కానీ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు దీన్ని నెట్‌ఫ్లిక్స్‌లో ఆస్వాదించవచ్చు. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను రూ.85 కోట్లకు సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా థియేటర్లలో రూ.350 కోట్లకు పైగా వసూలు చేస్తే, అంతకంటే ముందే జరిగిన ఓటీటీ డీల్ ద్వారా దాదాపు మేకర్స్ 100 కోట్లు జేబులో వేసుకున్నారు.

3. జన నాయగన్ (Jananayagan)

సౌత్ సూపర్ స్టార్ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ ‘జననాయగన్’ విడుదలకు ముందే వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో రూ. 110 కోట్లకు కొనుగోలు చేసిందని వార్తలు విన్పిస్తున్నాయి.

4. కూలీ (Coolie)

Advertisement

రజనీకాంత్ చిత్రం “కూలీ” బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. మరోసారి ఈ శక్తివంతమైన చిత్రంతో రజనీకాంత్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ మూవీ డిజిటల్ హక్కుల విషయానికొస్తే, “కూలీ”ని ప్రైమ్ వీడియో రూ.120 కోట్లకు కొనుగోలు చేసింది.

5. దురంధర్ (Dhurandhar)

ఆదిత్య ధర్ తీసిన ఈ స్పై యాక్షన్ చిత్రం థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం వరుసగా రెండు వారాలుగా భారీ కలెక్షన్లను రాబట్టింది. సమాచారం ప్రకారం Netflix “ధురంధర్” ఓటీటీ హక్కులను రూ. 285 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వార్తలు నిజమైతే ఈ సంవత్సరం ఇదే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.

Read Also : ‘స్క్విడ్ గేమ్ 3’ నుంచి ‘వీక్ హీరో’ వరకు… ఈ ఏడాది ఓటీటీని ఏలిన కొరియన్ డ్రామాలు ఇవే

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×