E-Paper
Advertisement

Year Ender 2025 : ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి ‘సు ఫ్రమ్ సో’ వరకు… 2025లోనే బెస్ట్ కామెడీ సినిమాలు

Year Ender 2025 : ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి ‘సు ఫ్రమ్ సో’ వరకు… 2025లోనే బెస్ట్ కామెడీ సినిమాలు
Advertisement

Year Ender 2025 : 2025 తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇందుస్ట్రీలలో కామెడీ జానర్‌ ప్రత్యేకంగా నిలిచింది. ప్రతీ సౌత్ భాషలోనూ ఈ ఏడాది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు గుర్తుండిపోయే సినిమాలు వచ్చాయి. పైగా ఆయా సినిమాలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, రొమాంటిక్ కామెడీలు, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో నవ్వులు పంచాయి. మరి 2025 లో వచ్చిన బెస్ట్ కామెడీ సినిమాలు ఏంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి ? అనే విషయాలను ఇయర్ ఎండ్ సందర్భంగా నెమరేసుకుందాం పదండి.

సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam)

వెంకటేష్ దగ్గుబాటి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ‘ సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14 న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ZEE5లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వెర్షన్స్‌తో మార్చి 1 నుండి అందుబాటులో ఉంది. ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ అయిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి స్పెషల్ హిట్.

టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family)

Advertisement

శశికుమార్, సిమ్రాన్, యోగి బాబు, ఎం.ఎస్. భాస్కర్ మెయిన్ లీడ్స్ గా నటించిన ఈ తమిళ మూవీ థియేటర్లలో మే 1న విడుదలై, ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలోనే బెస్ట్ మూవీగా నిలిచింది. డైరెక్టర్ అభిషన్ జీవింత్ రూపొందించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ జూన్ 2 నుండి JioHotstarలో అందుబాటులో ఉంది. ఇదొక హార్ట్‌వార్మింగ్ శ్రీలంకన్ ఫ్యామిలీ కామెడీ అండ్ ఎమోషనల్ కథ.

సు ఫ్రమ్ సో (Su From So) – కన్నడ రిలీజ్ డేట్: జులై 25, 2025 (థియేటర్స్)

ఈ కన్నడ సినిమాలో రాజ్ బి. షెట్టి, షనిల్ గురు, ప్రకాష్ తుమినాడు ప్రధాన పాత్రలు పోషించారు. డైరెక్టర్ జె.పి. తుమినాడు ఈ సినిమాను విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ హర్రర్ థ్రిల్లర్ గా అద్భుతంగా తీర్చిదిద్దారు. JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.

తలైవన్ తలైవీ (Thalaivan Thalaivii) – తమిళ రిలీజ్ డేట్: జులై 25, 2025 (థియేటర్స్)

Advertisement

విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ డ్రామా ‘తలైవన్ తలైవీ’. ఈ తమిళ సినిమా జూలై 25 న థియేటర్లలో రిలీజ్ కాగా, ఆగస్టు 22 నుండి Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. డైరెక్టర్ పాండిరాజ్ఈ చిత్రంలో రొమాంటిక్ కామెడీతో పాటు యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్ కూడా కలగలిపి తెరకెక్కించారు.

డ్యూడ్ (Dude) – తమిళ్రిలీజ్ డేట్: 2025 (థియేటర్స్, దీవాళి స్పెషల్)

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, ఆర్. శరత్‌కుమార్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ తమిళ మూవీ దీపావళి స్పెషల్ గా అక్టోబర్ 17న థియేటర్లలోకి వచ్చింది. కీర్తిశ్వరన్ రూపొందించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా బిగ్ స్క్రీన్ పై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాడమే కాకుండా ఓటీటీలోనూ దుమ్మురేపింది. నవంబర్ 14 నుండి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

పడక్కలం (Padakkalam) 

ఈ మలయాళం మూవీ మే 8 న థియేటర్స్ లో సందడి చేసింది. సూరజ్ వెంజరమూడు, శరఫుద్దీన్, సందీప్ ప్రదీప్ నటించిన ఈ మూవీ థియేటర్లలో కంటే ఓటీటీలోనే అదరగొట్టింది. డైరెక్టర్ మను స్వరాజ్ కాలేజ్ స్టూడెంట్స్ కథతో ఫన్ అండ్ థ్రిల్ కలగలిసిన సూపర్‌నాచురల్ ఫాంటసీ కామెడీ డ్రామాగా మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. జూన్ 10 నుండి ఈ మూవీ JioHotstarలో అందుబాటులో ఉంది.

Read Also : ఏం సినిమా గురూ… చేతబడితో చెమటలు పట్టించే హర్రర్ మూవీ… కల్లోనూ కలవరపెట్టే రియల్ స్టోరీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×