E-Paper
Advertisement

OTT Movie : రోజుకో అబ్బాయితో ఆ పని… కోరిక తీర్చుకుని చంపేసే ఆడ పిశాచి… ఈ సిరీస్ తెలుగులోనే ఉంది

OTT Movie : రోజుకో అబ్బాయితో ఆ పని… కోరిక తీర్చుకుని చంపేసే ఆడ పిశాచి… ఈ సిరీస్ తెలుగులోనే ఉంది
Advertisement

OTT Movie : ఫాంటసీ కంటెంట్ లను రూపొందించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు దర్శకులు. నిర్మాణ సంస్థలు కూడా ఇలాంటి జానర్లకే ఓటు వేస్తున్నాయి. టెక్నాలజీ ఊపందుకుంటున్న ఈ రోజుల్లో విజువల్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటున్నాయి. ఇవి సినిమాలకు, వెబ్ సిరీస్ లకి హైప్ తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజువల్స్ తో ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ ‘యక్షిణి’. నటి వేదిక ప్రధాన పాత్రలో నటించిన ఈ కథ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత ఏడాది ఓటీటీలో ట్రెండింగ్ లో కూడా నడిచింది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? ఈ కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో ఉందంటే

‘యక్షిణి’ (Yakshini) 2024లో వచ్చిన తెలుగు ఫ్యాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. తేజా మార్ని దర్శకత్వంలో వేదిక, రాహుల్ విజయ్, లక్ష్మి మంచు, అజయ్, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ 6 ఎపిసోడ్‌లతో 2024 జూన్ 14న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల అయింది. IMDbలో 7.2/10 రేటింగ్ కూడా పొందింది.

కథలోకి వెళ్తే

Advertisement

మాయా అనే యువతి యక్ష లోకంలో ఉంటుంది. కానీ ఒక తప్పు చేసినందుకు దేవుడు ఆమెను శపిస్తాడు. ఆ శాపం నుంచి బయటపడాలంటే, ఆమె భూమిపై 100 మంది మగవాళ్లను చంపాల్సిఉంటుంది. మాయా మనుషుల రూపంలో భూమిపైకి వస్తుంది. ఆమె అందంతో మగాళ్లను ఆకర్షిస్తూ, శాపం నుంచి బయట పడటానికి చంపడం మొదలెడుతుంది. ఈ సమయంలో కృష్ణ అనే అబ్బాయిని కలుస్తుంది. కృష్ణ మాయాను మనస్పూర్తిగా ప్రేమిస్తాడు. ఆమెకు కూడా అతను నచ్చుతాడు. మాయా మొదట కృష్ణను తన ప్లాన్‌లో భాగం చేయాలనుకుంటుంది. కానీ అతని ప్రేమ వల్ల ఆమె మనసు మారుతుంది. కృష్ణతో సమయం గడిపే కొద్దీ ఆమెకు ప్రేమ ఎక్కువవుతుంది.

Read Also : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

Advertisement

అయితే ఒక రోజు కృష్ణకు మాయా ఒక యక్షిణి అనే నిజం తెలిసిపోతుంది. అతను ఆమెను మనుషుల్ని చంపడం ఆపమని, మంచిగా మారమని చెబుతాడు. అయితే యక్ష లోకం నుంచి కొన్ని చెడు శక్తులు, ఆమె శాపం పూర్తి చేయమని బెదిరిస్తాయి. మాయా తన శాపం, కృష్ణ ప్రేమ మధ్య చిక్కుకుంటుంది. ఇప్పుడు కథ భయంకరమైన ఫ్యాంటసీ సీన్స్, రొమాంటిక్ మూమెంట్స్, థ్రిల్లర్ ట్విస్ట్‌లతో నడుస్తుంది. చివరికి మాయా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. దీంతో స్టోరీ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటి ? 100 మంది మగాళ్లను చంపి, శాపం నుంచి బయట పడుతుందా ? తన లోకానికి పోకుండా కృష్ణ ప్రేమకి లొంగిపోతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×