E-Paper
Advertisement

OTT Movie : గేమ్‌తో డేంజరస్ ఆత్మ రిటర్న్… చావును దగ్గరగా చూపించే మంత్రగత్తె… ఈ సినిమా చూస్తే గూస్ బంప్స్ పక్కా

OTT Movie : గేమ్‌తో డేంజరస్ ఆత్మ రిటర్న్… చావును దగ్గరగా చూపించే మంత్రగత్తె… ఈ సినిమా చూస్తే గూస్ బంప్స్ పక్కా
Advertisement

OTT Movie : దెయ్యాల సినిమాలు ఎక్కువగా ఒక హాంటెడ్ హౌస్, ఓజా బోర్డ్ గేమ్ చుట్టూ తిరుగుతాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఓజా బోర్డ్ కన్నా పవర్ ఫుల్ గేమ్ తో మొదలవుతుంది. ఒక మంత్రగత్తె నాలుగు శతాబ్దాల క్రితం సృష్టిస్తుంది. అయితే స్టోరీ ప్రజెంట్ లో రన్ అవుతుంది. ఈ బోర్డ్ వల్ల భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. దైర్యం ఉన్న వాళ్ళు లైట్ అఫ్ చేసి చుడండి. ధైర్యం లేని వాళ్ళు లైట్ వేసుకునే ఉండండి. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

ఈ అమెరికన్ సూపర్‌ నాచురల్ హారర్ మూవీ పేరు ‘విచ్‌బోర్డ్’ (Witchboard). డైరెక్టర్ చక్ రస్సెల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1986 క్లాసిక్ విచ్‌ బోర్డ్ రీమేక్. ఇందులో మ్యాడిసన్ ఇసెమాన్ (ఎమిలీ), ఆరన్ డోమింగ్వెజ్ (క్రిస్టియన్), క్యాంప్‌బెల్ బౌర్ (మంత్రగాడు) లీడ్ రోల్స్ లో నటించారు. 2025 ఆగస్ట్ 15న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో 100 నిమిషాల నిడివితో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఎమిలీ ఒక పాత బిల్డింగ్ తీసుకుని కాఫీ షాప్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తుంది. రెనోవేషన్ చేస్తుంటే ఎమిలీకి ఒక పాత దుమ్ము పట్టిన విచ్‌ బోర్డ్ దొరుకుతుంది. ఇది సాధారణ ఓజా బోర్డ్ కాదు. దీనిని 17వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో ఒక శక్తివంతమైన విచ్ తయారు చేసింది. ఆ విచ్‌ని ఆమె విలేజ్ వాళ్లు రాళ్లతో కొట్టి బయటికి విసిరేశారు. ఆమె చచ్చిపోయే ముందు ఈ బోర్డ్‌ని స్పిరిట్ వరల్డ్‌కి గేట్‌వేగా మార్చేసింది. ఎవరైతే దీనితో ఆడతారో వాళ్ల శరీరం ఆ స్పిరిట్స్‌కి ఇల్లవుతుంది. ఎమిలీ మొదట్లో దాని గురించి తెలీక, ఫ్రెండ్స్‌తో జస్ట్ ఫన్ కోసం బోర్డ్‌తో ఆడుకుంటుంది. అంతే వెంటనే బోర్డ్ కదలడం మొదలెడుతుంది. ఎమిలీకి మాత్రం ఒక్కసారిగా గొంతు మారిపోయి వేరే వాళ్లలా మాట్లాడడం లాంటివి చేస్తుంది.

Read Also : చావు లేని రాక్షసుడికి ప్రాణం పోస్తే.. అమ్మాయి కావాలంటూ టార్చర్… లాస్ట్ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు భయ్యా

Advertisement

ఆమె ఫ్రెండ్ క్రిస్టియన్ భయపడి ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్తాడు. ఇది ఒక భయంకరమైన ఆత్మలకు ద్వారం అని చెప్తాడు. అయితే ఆ మాంత్రికుడు హెల్ప్ చేయడానికి బదులు, ఆ బోర్డ్ పవర్‌ని కాజేయాలని ప్లాన్ చేస్తాడు. ఇక అక్కడి నుంచి హారర్ మరింత భయంకరంగా మొదలవుతుంది. ఎమిలీ పూర్తిగా పాసెస్ అయిపోతుంది. క్రిస్టియన్ ఆమెని బోర్డ్ నుంచి దూరం పెట్టడానికి ట్రై చేస్తాడు, కానీ మంత్రగాడు రివర్స్ గేమ్ ఆడతాడు. బోర్డ్‌ని నాశనం చేయడానికి బదులు దాన్ని మరింత యూజ్ చేసి ఎమిలీని పూర్తిగా కంట్రోల్ చేస్తాడు. ఎమిలీ శరీరంలో విచ్ పూర్తిగా ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఇప్పుడు క్రిస్టియన్ ఒక్కడే ఆ ఇద్దరితో ఫైట్ చేయాల్సి వస్తుంది. బోర్డ్ డిస్‌ట్రాయ్ అయితేనే ఎమిలీ బతుకుతుందని తెలుస్తుంది. చివరికి ఎవరు బతికారు ? ఎవరు చనిపోతారు ? బోర్డ్ డిస్‌ట్రాయ్ అయిందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×