E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయిలకు డబ్బులిచ్చి మరీ ఆ పార్ట్ కట్… ఈ సైకో కిల్లర్ చేసే పనికి గుండె జారిపోవాల్సిందే మచ్చా

OTT Movie : అమ్మాయిలకు డబ్బులిచ్చి మరీ ఆ పార్ట్ కట్… ఈ సైకో కిల్లర్ చేసే పనికి గుండె జారిపోవాల్సిందే మచ్చా
Advertisement

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని చూడటానికి ఆసక్తిని చూపిస్తున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ థియేటర్లలో అంతగా ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం దూసుకుపోయింది. ఒక సైకో చుట్టూ ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. చివరివరకూ ఈ సినిమా ఉత్కంఠంగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

స్టోరీలోకి వెళితే

Advertisement

మధ్యతరగతికి చెందిన దివ్య తన భర్త అస్రఫ్ తో సంతోషకరమైన జీవితం గడుపుతూఉంటుంది. అయితే, ఒక రోజు పోలీసులు తప్పుగా జరిపిన ఎన్‌కౌంటర్‌లో అస్రఫ్ ప్రాణాలు కోల్పోతాడు. ఈ సంఘటన దివ్య జీవితాన్ని తలకిందులు చేస్తుంది. అస్రఫ్ తీసుకున్న అప్పుల కారణంగా, అప్పులవాళ్ళు దివ్యను వేధించడం మొదలుపెడతారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య ఆమె సతమతం అవుతూ ఉంటుంది. ఈ పరిస్థితిలో ఆమె నాలుగేళ్ల కూతురు దియాను, అప్పు ఇచ్చిన ఒక వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. డబ్బులు ఇస్తేనే కూతుర్ని విడిచిపెడతానని చెప్తాడు. కూతుర్ని  రక్షించడానికి, డబ్బు సంపాదించేందుకు దివ్య వేశ్యగా మారుతుంది. ఈ క్రమంలో ఆమెను ఒక వ్యక్తి బుక్ చేసుకుంటాడు. అయితే అతను ఒక సీరియల్ కిల్లర్ అని తెలీక, అతని చేతిలో చిక్కుకుంటుంది దివ్య. ఈ హంతకుడు మహిళలను లక్ష్యంగా చేసుకుని నేరాలు చేస్తుంటాడు. అందులోనూ వేశ్యలను ఎక్కువగా ఎంచుకుంటుంటాడు.

దివ్య అతని ఇంట్లోకి వెళ్ళిన తరువాత, బాత్ రూంలో ఒక మహిళ వేలు కట్ చేసి ఉండటం చూస్తుంది. ఇది చూసిన దివ్య ఒక్కసారిగా భయంతో వణికిపోతుంది. దివ్య తన కూతురిని కాపాడుకోవడానికి, ఈ ప్రమాదకరమైన హంతకుడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె  చేసిన ఫోన్ కాల్ వెట్రి అనే పోలీసుకు వెళ్తుంది. ఆమె ఎవరో తెలుసుకుని ఆత్మ విమర్శ చేసుకుంటాడు వెట్రి. ఎందుకంటే ఆమె భర్తను పొరపాటున ఎనకౌంటర్ లో కాల్చినది ఇతనే. ఇప్పుడు వెట్రి, దివ్యకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. చివరికి వెట్రి ఆమె ఎక్కడుందో కనిపెడతాడా ? ఆ సైకో ఆమెను ఏమైనా చేస్తాడా ? తన కూతుర్ని ఆమె కాపాడుకుంటుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : పరుగుతో కేక పుట్టించే సూపర్ ఉమెన్… ఐఎండీబీలో 7.4 రేటింగ్… ఈ సూపర్ హీరోయిన్ మూవీని ఇంకా చూడలేదా?

 

ఆహా (aha) లో

ఈ తమిళ థ్రిల్లర్ సినిమా పేరు ‘వైట్ రోజ్’ (White Rose). 2024 లో వచ్చిన ఈ మూవీకి కె. రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆనంది, ఆర్‌కె సురేష్ ప్రధాన పాత్రల్లో నటించారు . ఈ మూవీని పూంబరై మురుగన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్ రంజని నిర్మించారు. ఆహా (aha) ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×