E-Paper
Advertisement

రౌడీని రంగంలోకి దింపే చర్చ్… ఓటీటీలోకి వచ్చిన మలయాళ పీరియాడిక్ యాక్షన్ డ్రామా

రౌడీని రంగంలోకి దింపే చర్చ్… ఓటీటీలోకి వచ్చిన మలయాళ పీరియాడిక్ యాక్షన్ డ్రామా
Advertisement

Action Drama: హృదయాన్ని కదిలించే యాక్షన్ డ్రామాను చూడాలని ఉందా ? అయితే ఈరోజు ఓటీటీలోకి వచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మీ కోసమే. ‘పళ్లిచట్టంబి’ (Pallichattambi) అనే టైటిల్ తో రూపొందిన ఈ మలయాళం సినిమాను 1950ల కేరళలో భూసంస్కరణల కల్లోలం నేపథ్యంలో తెరకెక్కించారు. ఒక మామూలు యువకుడు ఎలా రక్షకుడిగా మారాడు ? అసలు సినిమా స్టోరీ ఏంటి ? ఓటీటీలో తెలుగులో ఉందా లేదా ? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

1950ల చివరలో కథ స్టార్ట్ అవుతుంది. కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, భూసంస్కరణల బిల్లును ప్రవేశపెట్టినప్పటి రాజకీయ కల్లోల వాతావరణం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. కృష్ణ పిళ్లై అనే అనాథ కుర్రాడు మన హీరో. చిన్నతనంలో ఒక ఘోరమైన దాడి నుండి తృణప్రాయంగా తప్పించుకుంటాడు. అతడిని అటు హిందూ, ఇటు క్రిస్టియన్ కుటుంబాలు కలిసి పెంచుతాయి.

Advertisement

కమ్యూనిస్ట్ ప్రభుత్వం తెచ్చిన భూసంస్కరణల వల్ల తమ చర్చి భూములకు ముప్పు వాటిల్లుతుంది. అదే భావించిన మత పెద్దలు, వాటి రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ దళాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ దళానికి నాయకుడిగా, చర్చి రక్షకుడిగా ఒక రౌడీగా నియమిస్తారు. కృష్ణ పిళ్లైనే ‘పోతన్ క్రిస్టోఫర్’ అనే మారుపేరుతో నిలబెడతారు. చర్చి కోసం పోరాడే క్రమంలో, పోతన్‌కు ఒక కమ్యూనిస్ట్ మహిళతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.

ఆ తర్వాత సామాన్య గ్రామీణ ప్రజల కష్టాలను, భూస్వాముల క్రూరత్వాన్ని స్వయంగా చూసిన అతనిలో తీవ్రమైన మార్పు వస్తుంది. అంతలోనే పవర్ ఫుల్ భూస్వామి తిరిగి వచ్చి గ్రామీణ ప్రజల భూములను లాక్కోవాలని చూస్తాడు. కృష్ణ పిళ్లై చర్చి సరిహద్దులను దాటి, ప్రజలందరినీ ఏకం చేసి ఆ అణచివేతపై ఎలా తిరగబడ్డాడు ? చివరికి ఆ పేదల భూములను హీరో ఎలా కాపాడాడు ? హీరో గతం ఏంటో తెలిశాక ఏం జరిగింది ? హీరో తల్లిదండ్రుల చావుకు, అతను అనాథ అవ్వడానికి కారణం ఎవరు ? సినిమాలో అసలు విలన్ ఎవరు ? క్లైమాక్స్ లో వచ్చే షాకింగ్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను మిస్ అవ్వకుండా చూడాల్సిందే.

తెలుగులో ఉందా ?

Advertisement

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘పళ్లిచట్టంబి’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 15న పాన్-ఇండియా వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు SonyLIVలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. కయదు లొహర్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. మంచి ఎమోషనల్ డ్రామాను చూడాలనుకుంటే ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి వీక్షించవచ్చు.

Read Also: కూతురు కోసం ప్రపంచాన్ని పీకి పందిరేసే తండ్రి… ఒక్కో సీన్ మెంటల్ మాస్ మావా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×