// // ప్రతీ ఎపిసోడ్లో ఒక కొత్త కేసు... ట్విస్టులతో మెంటలెక్కించే క్రైమ్ -->
E-Paper
Advertisement

ప్రతీ ఎపిసోడ్లో ఒక కొత్త కేసు… ట్విస్టులతో మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

ప్రతీ ఎపిసోడ్లో ఒక కొత్త కేసు… ట్విస్టులతో మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
Advertisement

Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఉండే థ్రిల్, సస్పెన్స్ మరే ఇతర జానర్లలో కూడా ఉండదేమో. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో ట్విస్ట్ తో సిరీస్ ఎండింగ్ వరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటి సిరీసే. ఆ సిరీస్ పేరు ‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ (Crime Next Door). 2021లో తెరపైకి వచ్చిన ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ లో మన సింగం హీరో పేరు ఇన్‌స్పెక్టర్ షేకవత్. ఆయన సిన్సియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పోలీస్ ఆఫీసర్. అతని కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన, ఘోరమైన మర్డర్ కేసుల ఇన్వెస్టిగేషన్ చుట్టూ సిరీస్ స్టోరీ నడుస్తుంది. షేకవత్ అందరిలాగా నార్మల్ పోలీస్ ఆఫీసర్ కాదు. అతను ప్రతి కేసులోని చిన్న చిన్న క్లూస్‌ను కనెక్ట్ చేసి, హంతకుడి మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తీరు అద్భుతంగా ఉంటుంది. ఈ సిరీస్ మూడు విభిన్న కేసుల కథలుగా తెరకెక్కింది, కానీ అవి ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి.

Advertisement

That Night

రంజీత్ అనే ఫ్లర్టింగు అలవాటున్న బిజినెస్‌మెన్. ఓరోజు రాత్రి మద్యం మత్తులో మరొక అమ్మాయి విషయంలో తన భార్య శ్వేతతో ఘోరంగా గొడవపడతాడు. ఆ గొడవలో అనుకోకుండా ఒక హత్య జరుగుతుంది. రంజీత్ ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి రాత్రంతా నానా అవస్థలు పడతాడు. కానీ ఇన్‌స్పెక్టర్ షేకవత్ ఎంట్రీ ఇచ్చి విచారణ మొదలుపెట్టాక, అసలు కథ వేరొకరు చెప్తున్న అబద్ధాల వెనుక దాగి ఉందని తెలుసుకుంటాడు. ఈ కేసు చూస్తుంటే గొడవలు, మద్యం, ఆవేశం ఎంత పెద్ద నేరాలకు దారితీస్తాయి అనే విషయం అర్థం అవుతుంది.

Advertisement

Morning Bell

ఒక హ్యాపీ కపుల్ సుమారు 25 రోజుల తర్వాత తమ ఇంటి తలుపులు తీసి లోపలికి వెళ్తారు. కానీ ఇంటి బేస్‌మెంట్ నుండి ఒక కుళ్ళిపోయిన శవం దుర్వాసన వస్తుంటుంది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయగా.. ఆ పర్ఫెక్ట్ ఫ్యామిలీ వెనుక ఉన్న డార్క్ సీక్రెట్స్, వివాహేతర బంధాలు, నమ్మకద్రోహాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఈ కేసు చూస్తుంటే ఇంటి గోడల వెనుక ఎంత భయంకరమైన సత్యాలు దాగి ఉంటాయో గుర్తు చేస్తుంది.

I Promise

శ్రీధర్ గుప్తా అనే ఒక పవర్‌ఫుల్ రాజకీయ నాయకుడు ఉంటాడు. అతను తన కూతురు స్నేహ అనుమానాస్పద మృతికి అల్లుడే కారణమంటూ బహిరంగంగా ఆరోపిస్తాడు. ఈ కేసును చేధించే బాధ్యత షేకవత్‌ భుజాలపై పడుతుంది. అయితే ఇన్వెస్టిగేషన్ లో షేకవత్‌కు, ఈ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న అసలు మాస్టర్‌మైండ్ ఎవరనేది తెలిసి షాక్ అవుతాడు.పైకి ఇవన్నీ విడివిడి హత్యలుగా కనిపించినప్పటికీ, ఇన్‌స్పెక్టర్ షేకవత్ తన చాకచక్యంతో ప్రతి కేసులోని క్లూస్‌ను విశ్లేషించినప్పుడు… ఈ నేరాలన్నింటి వెనుక ఒకే నెట్‌వర్క్ లింక్ అయి ఉందని తెలిస్తుంది. మరి ఆ లింకు ఏంటి అనేదే స్టోరీ.

తెలుగులోనూ ఉందా ?

హిందీ క్రైమ్ మిస్టరీ వెబ్ సిరీస్ ‘క్రైమ్ నెక్స్ట్ డోర్’. రవి సాహ్, గిరీష్ కుల్కర్ణి, అనుప్రియ గోయెంకా, వత్సల్ సేథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ అంథాలజీ తరహా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ JioHotstarలో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ ఇంకా అందుబాటులోకి రాలేదు.

Read Also: అవుటర్ స్పేస్ లో అనాథలు… ఒక్కో యాక్షన్ సీక్వెన్స్ కు గూస్ బంప్స్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×