E-Paper
Advertisement

Bha Bha Ba OTT : రిలీజై నెలకూడా కాకముందే ఓటీటీలోకి మలయాళం కామెడీ డ్రామా… ఏ ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చంటే ?

Bha Bha Ba OTT : రిలీజై నెలకూడా కాకముందే ఓటీటీలోకి మలయాళం కామెడీ డ్రామా… ఏ ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చంటే ?
Advertisement

Bha Bha Ba OTT : ప్రముఖ మలయాళం నటుడు దిలీప్ నటించిన కామెడీ చిత్రం “భభబ” డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో, ఎప్పుడు చూడవచ్చు ? దాని కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

మలయాళ అగ్రనటుడు దిలీప్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భభబ'(Bha Bha Ba). భయం భక్తి బహుమానం అనేది ఆ టైటిల్ ఫుల్ ఫామ్. శ్రీ గోకులం మూవీస్ బ్యానర్ ‌పై గోకులం గోపాలన్, కృష్ణమూర్తి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి ధనంజయ్ శంకర్ దర్శకత్వం వహించారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఇందులో గెస్ట్ రోల్ లో కన్పించారు. బాలు వర్గీస్, బైజు సంతోష్, శరణ్య, సిద్ధార్ధ్, అశోకన్, వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్, సాండీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. షాన్ రహమాన్ సంగీతం అందించగా, గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.

Advertisement

కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 18న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలై, బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. ఇక ఇప్పుడు విడుదలై నెల కూడా కాని ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. జనవరి 16న ఉదయం 12 గంటల నుండి సినిమా జీ5 ఓటీటీ (ZEE5)లో అందుబాటులో ఉంటుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మలయాళ మూవీ ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుందా లేదా ? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పాత సినిమాలు, పాపులర్ పాత్రలతో తీసిన ఈ మాస్ స్పూఫ్ మూవీకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Read Also :  రిలీజైన వారంలోనే థియేటర్ల నుంచి అవుట్… ఓటీటీలోనూ ఓ వెర్షన్ మిస్… ఎట్టకేలకు కష్టాలు గట్టెక్కిన హర్రర్ మూవీ

మూవీపై స్పెషల్ ఇంట్రెస్ట్

Advertisement

గత 8 సంవత్సరాల క్రితం మలయాళం హీరోయిన్ పై జరిగిన దాడి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏకంగా 10 మంది దుండగులు ఆమెపై ఈ దాడికి తెగబడ్డారు. మలయాళ స్టార్ దిలీప్ దీన్ని ప్లాన్ చేశాడని ఆరోపణలు రావడంతో, అతనిపై కేసు ఫైల్ చేశారు. తరువాత సదరు హీరో మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించి, అనంతరం బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. అయితే ఈ 8 ఏళ్ల పాటు కేసు విచారణ కొనసాగింది. రీసెంట్ గా ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. దిలీపే ఈ దుర్ఘటనను ప్లాన్ చేశాడు అనడానికి సరైన ఆధారాలు లేవు అంటూ కేసును కొట్టేయడమే కాదు, అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తరువాతే ‘భభబా’ మూవీ విడుదలైంది. నిజానికి ఈ 8 ఏళ్లపాటు దిలీప్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇన్నేళ్ల తరువాత నిర్దోషిగా నిరూపించుకుని, సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఆడియన్స్ నుంచి మాత్రం ఈ సినిమాకు ఆశించిన రెస్పాన్స్ దక్కలేదు.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×