E-Paper
Advertisement

OTT Movie : జనాభా లెక్కల కోసం వెళ్తే ఫ్యూజులు అవుట్ అయ్యే ట్విస్ట్… వీడు మనిషేనా?

OTT Movie : జనాభా లెక్కల కోసం వెళ్తే ఫ్యూజులు అవుట్ అయ్యే ట్విస్ట్… వీడు మనిషేనా?
Advertisement

OTT Movie : రియల్ స్టోరీలను ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో చాలా దారుణంగా వయోలెన్స్ ఉంటుంది. దెయ్యాల కన్నా ఘోరంగా ఉండే మనుషుల ఇంట్లో ఇద్దరు మహిళా టీచర్లు చిక్కుకుంటారు. ఆ తరువాత ఈ స్టోరీని మాటల్లో చెప్పడానికి కూడా భయం వేస్తుంది. అక్కడ అంతలా టార్చర్ ని అనుభవిస్తారు ఆ టీచర్లు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

యూట్యూబ్ (Youtube) లో

Advertisement

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వెల్కమ్ హోమ్’ (Welcome Home). 2020 లో వచ్చిన ఈ మూవీకి పుష్కర్ మహాబల్ దర్శకత్వం వహించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో కశ్మీరా ఇరానీ, స్వర్దా తీగలే, బోలోరామ్ దాస్, శశి భూషణ్, టీనా భాటియా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

అనూజా, నేహా అనే ఇద్దరు టీచర్లు జనాభా లెక్కల సేకరణ కోసం ఒక గ్రామానికి వెళతారు. అందరి ఇళ్ళు అయిపోయాక, ఊరికి దూరంగా ఒంటరిగా ఉండే ఓ ఇంటికి వెళతారు. అక్కడ ప్రేరణ అనే గర్భిణీ స్త్రీ వారిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఈ కుటుంబంలో ఘనశ్యామ్, అతని తల్లి, భోలా అనే వంట వాడు ఉంటారు. అయితే ఆ ఇంట్లో నివసించే కుటుంబం భయంకరమైన రహస్యాలను దాచి పెట్టి ఉంటుంది.

ఆరోజు వర్షం పడటంతో అనూజా, నేహా ఆ ఇంట్లో చిక్కుకుంటారు. ఆ తరువాత వాళ్ళకు ఊహించని సంఘటనలు ఎదురు పడతాయి. అక్కడ ప్రేరణ తండ్రిగా చెప్పుకునే ఘనశ్యామ్ వీళ్ళను ఒకచోట బంధిస్తాడు. వీళ్లపై క్రూర మృగాలకన్నా దారుణంగా ప్రవర్తిస్తాడు. పనివాడితో సహా ఈ టీచర్లపై ఘోరంగా అఘాయిత్యం చేస్తారు. వాళ్ళు తప్పించకోవడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాకుండా పోతుంది. అక్కడ ఇదివరకే ఇలాంటి ఘటనలు జరిగిన ఆనవాళ్ళు కూడా కనబడతాయి.

Read Also : ఇంట్లోనే సైకో కిల్లర్ ను పెట్టుకుని పండగ చేసుకునే బ్యాచ్… భయంతో అరుపులు పెట్టించే థ్రిల్లర్ మూవీ

నిజానికి ఆ ఇంట్లో ఉన్న ప్రేరణ ఘనశ్యామ్ కూతురు కాదు. ఆమెపై కూడా చాలాకాలంగా అఘాయిత్యం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆమె గర్భవతిగా కూడా ఉంటుంది. మానసికంగా చాలా మారిపోయి ఉంటుంది. ఈ క్రమంలో వీళ్ళను వెతుక్కుంటూ ఒక సోదరుడు అక్కడికి వస్తాడు. వాళ్ళ చేతిలో దారుణంగా ఆ వ్యక్తి బలి అవుతాడు. చివరికి ఈ టీచర్లు ఆ మృగాల నుంచి తప్పించుకుంటారా ? వాళ్ళు అసలు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×