E-Paper
Advertisement

కుస్తీ పోటీల్లో ఇరగదీసే భార్య… ఇంట్లోనే స్ట్రగులయ్యే భర్త… తమిళ కామెడీ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు తెలుగులోనే

కుస్తీ పోటీల్లో ఇరగదీసే భార్య… ఇంట్లోనే స్ట్రగులయ్యే భర్త… తమిళ కామెడీ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు తెలుగులోనే
Advertisement

Gatta Kusthi 2 OTT: పెళ్లి తర్వాత భార్యాభర్తల జీవితంలో బాధ్యతలు ఎలా మారతాయో చూపించే సినిమాలు చాలానే వచ్చాయి. కానీ భర్త, భార్య పాత్రలను పూర్తిగా మార్చేసి.. అదే అంశాన్ని ఫుల్ కామెడీతో చూపిస్తే ఎలా ఉంటుంది ? అలాంటి ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది Gatta Kusthi 2. మొదటి భాగం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా వచ్చిన ఈ సీక్వెల్‌లో నవ్వులు, ఎమోషన్స్, కుటుంబ బంధాలు అన్నీ కలిపి మరోసారి ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేశారు. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. పైగా తెలుగులోనూ ఉంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? తెలుగులో ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

మొదటి భాగంలో జరిగిన సంఘటనల తర్వాత వీర జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఒకప్పుడు భార్యను అర్థం చేసుకోలేని అతను… ఇప్పుడు ఆమె కలల కోసం నిలబడే భర్తగా మారిపోతాడు. జాతీయ స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్ కావాలనే కీర్తి లక్ష్యాన్ని తన లక్ష్యంగా భావించి ఆమెకు అండగా ఉంటాడు. కీర్తి కుస్తీ శిక్షణ, పోటీలతో బిజీగా ఉండటంతో… ఇంటి బాధ్యతలన్నీ వీర భుజాలపై పడతాయి. చిన్న కూతురిని చూసుకోవడం, వంట చేయడం, ఇంటి పనులు చేయడం… ఇలా హౌస్ హస్బెండ్‌గా మారిన వీర పడే ఇబ్బందులు నవ్వులు పంచుతాయి.

Advertisement

అయితే అన్నీ సవ్యంగా సాగుతున్న సమయంలో కథలో కొత్త సమస్య మొదలవుతుంది. కీర్తి విజయాలను చూసి అసూయపడే ఒక కోచ్, భార్యాభర్తల మధ్య అపార్థాలు సృష్టించే ప్రయత్నం చేస్తాడు. దీంతో వారి జీవితంలో మరో పరీక్ష మొదలవుతుంది. ఆ అపార్థాలను వీరిద్దరూ ఎలా ఎదుర్కొన్నారు ? కుటుంబం, కెరీర్ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేశారు ? చివరకు కీర్తి తన కలను నెరవేర్చుకుందా ? అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది.

తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి మరోసారి తమ సహజమైన నటనతో ఆకట్టుకోగా, రమ్యకృష్ణ, యోగి బాబు పాత్రలు సినిమాలో మంచి కామెడీ క్రియేట్ చేశాయి. కుటుంబ బాధ్యతలు, మహిళల కెరీర్, దాంపత్య బంధం వంటి అంశాలను హాస్యంతో మేళవించిన తీరు ఈ సీక్వెల్ ప్రత్యేకత.

Advertisement

కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునే సినిమా కోసం చూస్తుంటే ‘గట్ట కుస్తీ 2’ బెస్ట్ ఓటీటీ ఆప్షన్. కామెడీతో పాటు భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, ఒకరి కలలకు మరొకరు అండగా నిలవడం వంటి మంచి సందేశాన్ని కూడా ఈ సినిమా అందిస్తుంది. ఫస్ట్ పార్ట్ నచ్చిన వారికి ఈ సీక్వెల్ మరింత వినోదాన్ని పంచే అవకాశం ఉంది. ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి చూడదగిన ఈ లైట్ హార్ట్‌డ్ ఎంటర్‌టైనర్‌ ను డోంట్ మిస్.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×