E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్… ఆన్లైన్ చాట్ లో అడ్డమైన పనులు… ఆగమయ్యే జీవితాలు

OTT Movie : అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్… ఆన్లైన్ చాట్ లో అడ్డమైన పనులు…  ఆగమయ్యే జీవితాలు
Advertisement

OTT Movie : ఈ రోజుల్లో డబ్బు కోసం ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతటితో ఆగకుండా కొందరు దుర్మార్గులు ప్రేమ పేరుతో అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. వాళ్ళ ప్రైవేట్ వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓక తెలుగు మూవీ సోషల్ మెసేజ్ ఇస్తూ రూపొందింది. రియల్ స్టోరీల ఆధారంగా వచ్చిన ఈ సినిమాని అమ్మాయిలు ఒక్కసారి చూస్తే, ఎవరైనా ఆన్‌లైన్ లవ్‌ చేయడానికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే 

బ్రిజేష్ టాంగి దర్శకత్వం వహించిన ఈ తెలుగు థ్రిల్లర్ మూవీ పేరు ‘వైరల్ ప్రపంచం’. ఈ చిత్రంలో ప్రియాంక శర్మ, నిత్యా శెట్టి, సాయి రోనక్, సన్నీ నవీన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ 2025 మార్చి 7న విడుదలైంది. ప్రస్తుతం Sun NXT లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అదితి హైదరాబాద్‌లో ఉండే IT ఉద్యోగి. ఒక రోజు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఒక బెంగళూరు బాయ్ రాహుల్ అనే ప్రొఫైల్‌కి ఫాలో రిక్వెస్ట్ పంపుతుంది. రాహుల్ ఫోటోస్ చూస్తే హ్యాండ్‌సమ్, జిమ్ బాడీ, లగ్జరీ కార్ లతో రిచ్ కిడ్ లా కనిపిస్తాడు. అదితి ఇన్‌స్టంట్‌గా ఇంప్రెస్ అవుతుంది. ఇద్దరూ చాట్ చేస్తూ, వీడియో కాల్స్ లో రోజూ 4-5 గంటలు మాట్లాడుకోవడం మొదలెడతారు. రాహుల్ నీకోసం హైదరాబాద్ వస్తాను, మనం మ్యారేజ్ చేసుకుందాం అని ప్రామిస్ చేస్తాడు. అదే సమయంలో అదితి బెస్ట్ ఫ్రెండ్ స్వప్నా కూడా ఆన్‌లైన్‌లోనే విక్రమ్ అనే ప్రొఫైల్‌తో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేస్తుంది. విక్రమ్ ఫోటోస్ చూస్తే రిచ్ బిజినెస్‌మెన్ లుక్, దుబాయ్ టూర్స్, ప్రైవేట్ జెట్ పిక్స్ తో ఉంటాయి. స్వప్నా కూడా పూర్తిగా పడిపోతుంది. ఇద్దరూ రోజూ వీడియో కాల్స్‌లో తమ బాయ్‌ఫ్రెండ్స్ తో  అన్నీ షేర్ చేసుకుంటారు.

Read Also : సూర్యుడు అస్తమించని గ్రామంలో తెల్లార్లు నరకం చూపించే దెయ్యాలు… కళ్లముందే కనికట్టు మంత్రాలు

అయితే ఒక రోజు అదితి రాహుల్‌కి డబ్బు అడుగుతాడు. నా బిజినెస్‌లో ప్రాబ్లమ్, 2 లక్షలు పంపు, వచ్చాక ఇంట్రెస్ట్‌తో ఇస్తాను అని చెప్తాడు. అదితి డౌట్ పడుతుంది కానీ ప్రేమలో ఉండి పంపేస్తుంది. అలాగే స్వప్నాకి కూడా విక్రమ్ 5 లక్షలు అడుగుతాడు. ఆమె కూడా పంపుతుంది. ఇక ఆన్ లైన్ లోనే రొమాన్స్ కూడా మొదలు పెడతారు. వీళ్ళ వీడియోలను వాళ్ళు సీక్రెట్ గా రికార్డ్ చేస్తారు. వీళ్ళ దగ్గర మరిన్ని డబ్బులు గుంజాలని చూస్తారు. ఇక ఈ అమ్మాయిలకు వాళ్ళు పెద్ద ఫ్రాడ్ అని తెలిసిపోతుంది. దీంతో ఆ వీడియోలను వైరల్ చేస్తారు. ఆ తరువాత స్టోరీ ఊహించని విధంగా ముగుస్తుంది. చివరికి ఈ అమ్మాయిలు దీని నుంచి బయట పడతారా ? అవమానం తట్టుకోలేక బలవుతారా ? నిందితులకు శిక్ష పడుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
Advertisement

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×