E-Paper
Advertisement

Vincenzo Web series OTT: మాఫియాను ముప్పతిప్పలు పెట్టే లాయర్… ఐయండిబిలో 8.4 రేటింగ్…వ్యూస్ లో కూడా టాప్

Vincenzo Web series OTT: మాఫియాను ముప్పతిప్పలు పెట్టే లాయర్… ఐయండిబిలో 8.4 రేటింగ్…వ్యూస్ లో కూడా టాప్
Advertisement

Vincenzo Web series OTT : 2021లో వచ్చిన ఒక బ్లాక్‌బస్టర్ సౌత్ కొరియన్ డ్రామా గురించి చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకుంది. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితమైన మలుపులతో సాగుతుంది. అలాగే కామెడీ కూడా మరో లెవెల్ లో ఉంటుంది. దీనికి ఐయండిబిలో 8.4/10 రేటింగ్ ఉందంటే ఇది ఏమాత్రం ఉంటుందో అర్థం చేసుకొనచ్చు. ఈ సిరీస్ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎక్కడ చూడవచ్చు?

ఈ యాక్షన్ కామెడీ సిరీస్ పేరు ‘వించెంజో’ (Vincenzo). ఇందులో సాంగ్ జూంగ్-కి, జియోన్ యో-బిన్, ఓక్ టెక్-యోన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇది 2021 ఫిబ్రవరి 20 నుండి 2021 మే 2 వరకు ప్రతి శనివారం కొరియాలో tvNలో ప్రసారం చేయబడింది. ఇది ప్రస్తుతం Netflixలో ప్రసారం చేయడానికి కూడా అందుబాటులో ఉంది. ఇది కొరియన్ టెలివిజన్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పొందిన డ్రామాగా నిలిచింది. ఇది టీవీఎన్ చరిత్రలో ఆరవ అత్యధిక రేటింగ్ పొందిన డ్రామాగా ఉంది. ఈ సిరీస్ Netflix ద్వారా కూడా  ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజాదరణ పొందింది. ప్రపంచంలోని నెట్‌ఫ్లిక్స్‌లోని టాప్ 10 షోలలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అంతేకాకుండా 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా చూసిన కొరియన్ సిరీస్‌ల ఫోర్బ్స్ జాబితాలో ఇది నాల్గవ స్థానంలో నిలిచింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

వించెంజో కసానో అనే ఒక కొరియన్ వ్యక్తి చిన్నప్పుడే ఇటలీకి వెళ్లి అక్కడ పెద్ద మాఫియా ఫ్యామిలీకి లాయర్‌గా, సలహాదారుడిగా ఎదుగుతాడు. అయితే తన బాస్ చనిపోయాక జరిగిన గొడవలతో ఇటలీ వదిలి కొరియాకు తిరిగి వస్తాడు. సెయిల్‌లోని ఒక పాత బిల్డింగ్ అడుగున దాచిన టన్నుల కొద్దీ బంగారాన్ని తవ్వి తీసుకోవడమే అతని ప్లాన్. కానీ ఆ బిల్డింగ్‌ను ఒక అరాచకమైన ‘బాబెల్ గ్రూప్’ అనే కంపెనీ అక్రమంగా లాక్కుంటుంది. ఆ బంగారాన్ని దక్కించుకోవాలంటే ముందు ఆ కంపెనీని అడ్డుకోవాలని వించెంజో డిసైడ్ అవుతాడు.

అక్కడ అతనికి హాంక్ చా-యంగ్ అనే ఒక ఫైర్ బ్రాండ్ లాయర్ పరిచయం అవుతుంది. బాబెల్ గ్రూప్ చేసే అన్యాయాలకు బలైపోయిన తన తండ్రి కోసం ఆమె వించెంజోతో చేతులు కలుపుతుంది. మామూలు చట్టాలతో ఆ పవర్‌ఫుల్ విలన్లను ఓడించడం కష్టమని తెలిసిన వించెంజో, తన మాఫియా స్టైల్‌లోనే వాళ్లకు చుక్కలు చూపిస్తాడు. ఒకవైపు గీమ్గా ప్లాజాలోని వింత మనుషుల కామెడీ, మరోవైపు వించెంజో ఇచ్చే క్రూరమైన శిక్షలతో కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. చివరికి అతను ఆ విలన్ల సామ్రాజ్యాన్ని ఎలా కూల్చాడు ? ఆ బంగారాన్ని ఎలా దక్కించుకున్నాడు ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  70 ఏళ్ల వయసులో విడాకుల కోసం… పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా రొమాంటిక్ కామెడీ ఓటీటీలోకి… ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే?

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×