E-Paper
Advertisement

Viduthalai 2 OTT : ఓటీటీలోకి వచ్చేసిన విడుదల 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Viduthalai 2 OTT : ఓటీటీలోకి వచ్చేసిన విడుదల 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Advertisement

Viduthalai 2 OTT : తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, సూరి కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ విడుదల 2.. గత ఏడాది మహరాజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో పాటుగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ మూవీ తర్వాత విడుదల 2 మూవీతో తో ప్రేక్షకులను పలకరించాడు.. గతంలో విజయం సాధించిన ‘విడుదల పార్ట్‌ 1’కు కొనసాగింపుగా వెట్రిమారన్‌ తెరకెక్కించారు.. మంజు వారియర్స్, సూరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆ మూవీకి సీక్వెల్ గానే ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అయితే మొదటి పార్ట్ రిలీజ్ అయినట్లు ఆ మూవీకి సీక్వెల్ గా విడుదల 2 మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఆ మూవీ ఓటీటీ హక్కులను భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. నేటి నుంచి మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది.. ఓటీటీ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

మూవీ & ఓటీటీ.. 

Advertisement

తమిళ విలక్షణ నటుడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా, విలన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తెలుగులో కూడా ఈయనకు మంచి మార్కెట్ ఉంది. ఈ మధ్య ఆయన నటిస్తున్న ప్రతి మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. గత ఏడాది మహారాజ్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ మూవీని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. డిఫరెంట్ కథతో విడుదలై 2 మూవీ చేశాడు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.. కానీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. వెట్రిమారన్‌ దర్శకత్వం వహించిన ‘విడుదల పార్ట్‌ 1’ చిత్రం 2023లో రిలీజ్‌ కాగా తమిళ్, తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వెట్రిమారన్‌ ‘విడుదల 2’ తెరకెక్కించారు.. అది గత ఏడాది డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే, ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నారు కానీ ఇప్పటికి ముహూర్తం ఫిక్స్ చేశారు. జనవరి 17 నుంచి ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు వర్షన్స్‌ రెండూ ఒకే రోజు అందుబాటులోకి వచ్చింది .

స్టోరీ విషయానికొస్తే.. 

Advertisement

కానిస్టేబుల్ ఇచ్చిన ఒక సమాచారంతో ప్రజాదళం నాయకుడు, నక్సల్‌ పెరుమాళ్‌ అలియాస్‌ మాస్టార్‌ ను అరెస్ట్ చెయ్యడంతో మొదటి పార్ట్ పూర్తయ్యింది. ఇక రెండో పార్ట్ విషయానికొస్తే.. పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టార్‌ పెరుమాళ్‌ జమిందారీ వ్యవస్థ చేస్తున్న ఆగడాల్ని అడ్డుకునే క్రమంలో దళ నాయకుడిగా ఎలా మారాడు? తన జీవితాన్ని మార్చేసిన మహాలక్ష్మి పై ప్రేమ ఎలా పుడుతుంది. అహింసను ఇష్టపడే పెరుమాళ్‌ తన ఉద్యమాన్ని హింసాత్మక బాటలో నడిపించడానికి దారి తీసిన పరిస్థితులేంటి? అసలు అతని జీవితాన్ని మలుపు తిప్పిన పరిస్థితి గురించి ఈ మూవీలో చక్కగా చూపించారు. మొదటి పార్ట్ హిట్ అయ్యింది.. రెండో మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. మరి ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×