E-Paper
Advertisement

OTT Movie : గుడ్డి మొగుడితో కరాటే అమ్మాయి… ఒక్క పంచ్ తో క్రిమినల్స్ కి చుక్కలు… గుండెను పిండేసే ఫ్యామిలీ స్టోరీ

OTT Movie : గుడ్డి మొగుడితో కరాటే అమ్మాయి… ఒక్క పంచ్ తో క్రిమినల్స్ కి చుక్కలు… గుండెను పిండేసే ఫ్యామిలీ స్టోరీ
Advertisement

OTT Movie : సోషల్ మెసేజ్ తో వచ్చిన ఒక తమిళ సినిమా, మంచి కథాశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒక పల్లెటూరి అమ్మాయి కనే కలలు, అవి ఆమె సాధించుకునే తీరు చూడ చక్కగా ఉంటాయి. ఇందులో కరాటే నేర్చుకుంటూ, పోలీస్ కావాలని కలగనే ఒక అమ్మాయికి పెళ్లి జరుగుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేదే అసలు కథ. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ తమిళ మహిళా ఎంపవర్‌మెంట్ తమిళ మూవీ పేరు ‘వేంబు’ (Vembu). 2025 మే 23న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా జస్టిన్ ప్రభు దర్శకత్వం వహించారు. ఇందులో హరి కృష్ణన్ (వేంబు తండ్రి), షీలా రాజ్‌కుమార్ (వేంబు) లీడ్ రోల్స్ లో నటించారు.122 నిమిషాల రన్‌ టైమ్ తో ఐయండిబిలో 7.5/10 రేటింగ్ పొందింది. గోల్డెన్ షూర్స్ ప్రొడక్షన్ లో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు Aha Teluguలో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

తమిళనాడులో ఉండే ఒక గ్రామంలో వేంబు అనే 20 ఏళ్ల అమ్మాయి ఉంటుంది. ఆమె తండ్రి చిన్న రైతు, కానీ చాలా గొప్ప మనసుగల వాడు. వేంబు చిన్నప్పటి నుంచి సిలంబం (తమిళ మార్షల్ ఆర్ట్) మీద ఆసక్తి ఉంటుంది. తండ్రి కూడా పూర్తి సపోర్ట్ ఇస్తాడు. డబ్బులు లేకపోయినా ఆమెకి ట్రైనింగ్, యూనిఫాం, ట్రావెల్ అన్నీ చూసుకుంటాడు. వేంబు కల మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ గెలవడం, పోలీస్ ఉద్యోగం సాధించడం. ఆమె రోజూ ఉదయం 4 గంటలకి లేచి ప్రాక్టీస్ చేస్తుంది. గ్రామంలోని ఇతర అమ్మాయిలకి కూడా ఉచితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తుంది. అందరూ ఆమెని ‘వేంబు అక్క’ అని గౌరవిస్తారు. కానీ ఆమెకు సమస్యలు కూడా మొదలవుతాయి.

Read Also : అమ్మాయిల వరుస హత్యలు… ఆఫీసర్లకు దొరకని క్లూ… ఓటీటీలోకి మలయాళ హారర్ థ్రిల్లర్‌

Advertisement

గ్రామంలో పెద్దలు అమ్మాయి ఇంత పెద్దయ్యింది, పెళ్లి చేయాలి అని ఒత్తిడి చేస్తారు. దీంతో వేంబుకి దగ్గరి బంధువు వెట్రితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. తొందర్లోనే పెళ్లి కూడా జరుగుతుంది. ఒక రోజు ఆమె భర్తకి ఒక ప్రమాదంలో కళ్ళు పోతాయి. ఆపరేషన్ కి డబ్బుకూడా అవసరం అవుతుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. ఈ సమయంలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్న ముగ్గురు క్రిమినల్స్ ని వేంబు మట్టి కరిపిస్తుంది. దీంతో ఆమెను రాజకీయనాయకులు సత్కరిస్తారు. చివరికి ఆమె తన ఆశయాలు సాధిస్తుందా ? భర్తకి కంటి చూపు వస్తుందా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×