E-Paper
Advertisement

ఓటీటీలోకి రాబోతున్న 220 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమా ‘వాలా 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి రాబోతున్న 220 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమా ‘వాలా 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Vaazha 2 OTT: ఇటీవల కాలంలో ఒక భాషలో మంచి సక్సెస్ అందుకున్న సినిమాలు తిరిగి ఇతర భాషలలో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల మలయాళ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఇలా మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో వాలా 2(Vaazha 3) ఒకటి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 220 కోట్ల పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా తెలుగు హక్కులను షైన్ స్క్రీన్ బ్యానర్ అధినేత సాహు గారపాటి(Sahu Garapati) కైవసం చేసుకుని తెలుగులో విడుదల చేశారు.

రెండు వారాలకే ఓటీటీలోకి వాలా2..

తెలుగులో గత నెల ఏప్రిల్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇలా తెలుగు మలయాళ భాషలలో భారీగా కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. తెలుగులో విడుదలైన కేవలం రెండు వారాల వ్యవధిలోని సినిమా ఓటీటీలోకి రావటం విశేషం. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్(Jio Hot Star) కొనుగోలు చేశారు. ఈ సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారక ప్రకటన వెల్లడించారు.

జియో హాట్ స్టార్ లో వాలా 2 స్ట్రీమింగ్..

Advertisement

ఈ సినిమా మే 8వ తేదీ నుంచి డిజిటల్ మీడియాలో ప్రసారం కాబోతుందని తెలియజేశారు. తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తూ బ్రోస్ ఆర్ బ్యాక్ బై డిమాండ్ అంటూ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించిన తేదీని ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ థియేటర్లో మిస్ అయిన వారు ఎంచక్కా డిజిటల్ మీడియాలో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు.

5 కోట్ల బడ్జెట్.. వందల కోట్ల కలెక్షన్స్..

Advertisement

ఇక ఈ సినిమా నలుగురి స్నేహితులు బాగోద్వేగ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముగ్గురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు హషీర్, అలెన్, వినాయక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నలుగురు సామాన్య యువకుల జీవితాలలో ఎదురైన ఒడిదుడుకుల గురించి, వారి మధ్య ఉన్న స్నేహాన్ని తెలియజేస్తూ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకుంది. సావిన్ ఎస్.ఏ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఏకంగా 220 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.ఐఎండీబీలోనూ 8.3 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రమోషన్లను నిర్వహించడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడటమే కాకుండా తెలుగులో కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంది.

Also Read: ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ ‘Lik’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×