E-Paper
Advertisement

OTT Movie : థియేటర్లలోకి కార్తీ కొత్త సినిమా… ఓటీటీ స్ట్రీమింగ్ కూడా అప్పుడే… ఎందులో చూడచ్చంటే ?

OTT Movie : థియేటర్లలోకి కార్తీ కొత్త సినిమా… ఓటీటీ స్ట్రీమింగ్ కూడా అప్పుడే… ఎందులో చూడచ్చంటే ?
Advertisement

OTT Movie : కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వా వాతియార్’ మూవీ థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. ఈ సినిమా అనేక వాయిదాల తరువాత ఈ వారం థియేటర్లలోకి వస్తోంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘వా వాతియార్’ ట్రైలర్‌ను ఇప్పటివరకు 10 మిలియన్లకు పైగా వీక్షించారు. ఇందులో రాజ్‌కిరణ్‌ను MGR అభిమానిగా, కార్తీని పోలీసుగా చూపించారు. అప్పుడే ఈ సినిమా డిజిటల్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి రాబోతోంది ? ఓటీటీ వివరాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

థియేటర్లలోకి ఎప్పుడంటే

నలన్ కుమారసామి దర్శకత్వం వహించిన ఈ తమిళ కామెడీ యాక్షన్ మూవీ ‘వా వాతియార్’ డిసెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో కార్తీ, కృతి శెట్టి, సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, GM సుందర్, రమేష్ తిలక్, PL తేనప్పన్ వంటి నటులు నటించారు. సంతోష్ నారాయణన్ దీనికి సంగీతం అందించారు. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేటర్ల విడుదల తరువాతనే ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ అవుతుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ మూవీ MGR (ఎమ్జీ రామచంద్రన్) డై హార్డ్ ఫ్యాన్ తో మొదలయ్యే ఒక హిలేరియస్ జర్నీ. ఇందులో సత్యరాజ్ అనే పాత్ర, MGRకు మోస్ట్ డెవోటెడ్ ఫ్యాన్. అతను తన మనసులో MGR ఒక దేవుడిలా కొలుస్తాడు. పేదలకు సహాయం, కరప్షన్ కు అగైన్ గా ఉంటూ అందరికీ మార్గదర్శి లాగా ఉంటాడు. తన మనవాడిని (కార్తి) పూర్తిగా MGR స్టైల్ లో పెంచుతాడు. చిన్నప్పటి నుంచే MGR మూవీలు చూపించి, అతని స్టైల్‌లో మాట్లాడటం, నడవడం నేర్పుతాడు. కానీ గ్రాండ్‌సన్ పెద్దయ్యాక, అతని స్వభావం మారిపోతుంది. మోడరన్ వరల్డ్‌లో అతను తాతగారి ఐడియల్స్‌తో కాన్ఫ్లిక్ట్‌లో పడతాడు.

Read Also : బెడ్రూంలో ఇదేం పనిరా అయ్యా… అమ్మాయి వెనకే వచ్చి… ఇంటెన్స్ హై ఆక్టెన్ థ్రిల్లర్… యాక్షన్ ప్రియులకు ఐ ఫీస్ట్

MGR సినిమాల్లో పేదల కోసం పోరాడతాడు. కానీ ఈ యువకుడు ప్రైవేట్ లైఫ్‌లో సెల్ఫ్ సెంటర్డ్ అవుతాడు. మనవడు పెద్దయ్యాక సరదాగా ఉండే పోలీసుగా మారిపోతాడు. దీనివల్ల ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి. ఇది ఫ్యామిలీలో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. హీరోయిన్ ఎంట్రీతో స్టోరీ మలుపు తిరుగుతుంది. ఆమె హీరోను మార్చడానికి ప్రయత్నిస్తుంది. మధ్యలో మరికొన్ని క్యారెక్టర్స్ కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తారు. చివరికి మనవడిలో మార్పు వస్తుందా ? తాతగారి కోరిక తీరుతుందా ? ఈ తాత, మనవడి కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×