E-Paper
Advertisement

UP Coming Movies : మార్చిలో విడుదలయ్యే మోస్ట్ అవైటింగ్ తమిళ చిత్రాలు ఇవే

UP Coming Movies : మార్చిలో విడుదలయ్యే మోస్ట్ అవైటింగ్ తమిళ చిత్రాలు ఇవే
Advertisement

UP Coming Movies : ఫిబ్రవరి నెల దాదాపు ముగిసిపోతోంది, మార్చి వచ్చేస్తోంది. ఈ సంవత్సరం మార్చిలో థియేటర్లలో పెద్ద సినిమాలు ఇంకా రిలీజ్ డేట్స్ ఫిక్స్ కాలేదు. అందుకే ఓటీటీలో ఇది వరకే వచ్చిన తమిళ సినిమాల స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. మార్చి నెలలో ఓటీటీలోకి రాబోతున్న కొన్ని తమిళ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.

1. విత్ లవ్ (With Love)

అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ మధన్ దర్శకత్వంలో వచ్చింది. బ్లైండ్ డేట్‌తో మొదలైన ప్రేమకథలో సత్య, మోనిషా ఒకే పాఠశాలలో సీనియర్-జూనియర్లని, ఒకరినొకరు గుర్తుపట్టకుండా ప్రేమలో పడినట్టు తెలుస్తుంది. అప్పుడు వాళ్లు పాఠశాలకు తిరిగి వెళ్లి తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని డిసైడ్ అవుతారు. థియేటర్లలో మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది ఈ సినిమా. ఇక ఓటీటీలో ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

2. మై లార్డ్ (My Lord)

Advertisement

శశికుమార్, చైత్ర జె ఆచార్ నటించిన ఈ చిత్రం రాజు మురుగన్ దర్శకత్వంలో వచ్చింది. కోవిల్పట్టికి చెందిన ఒక జంటను ప్రభుత్వ రికార్డుల్లో పొరపాటున చనిపోయినట్లు నమోదు చేస్తారు. ఆ దంపతులు తమ ఉనికిని నిరూపించుకోవడానికి చేసే పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ క్రమంలో వాళ్ళు ఒక కిడ్నీ మాఫియా, అవినీతి రాజకీయ నాయకులతో కూడా తలపడాల్సి వస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వచ్చింది. వచ్చే నెలలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

3. పూకీ (Pookki)

టైటిల్‌తోనే క్యూరియాసిటీ పెంచిన సినిమా ‘పూకీ’. ఇదొక కామెడీ ఎంటర్టైనర్. సోషల్ మీడియా ట్రెండ్స్‌ను ఫాలో అయ్యే వారికి, ఫన్ రైడ్ కోరుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్. దీనిని విజయ్ ఆంటోనీ నిర్మించి, సంగీతం కూడా అందించారు. ఈ రొమాంటిక్ కామెడీలో అజయ్ ధీషన్, ఆర్‌కె ధనుష్ ప్రధాన పాత్రల్లో ఉన్నారు. గణేష్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఒక చిన్న రోడ్డు ప్రమాదం కారణంగా జరిగిన గొడవ పెద్దదై ఒక జంట విడిపోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత బ్రేకప్‌ను తట్టుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు, ఇగోలను ఈ సినిమా ఫన్నీగా చూపిస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వచ్చింది. మార్చి మూడో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. దీని స్ట్రీమింగ్ హక్కులను ZEE5 దక్కించుకుంది.

4. థాయ్ కిజావి (Thai Kizhavi)

Advertisement

రాదికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ గ్రామీణ కథ శివకుమార్ మురుగేషన్ దర్శకత్వంలో వచ్చింది. ఈ చిత్రంలో రాదికా పావుంతాయి అనే వృద్ధ మహిళ పాత్రలో కనిపిస్తోంది. గ్రామంలో అందరూ ఆమెకు భయపడతారు. సింగం పులి, అరుల్ దాస్, బాల శరవణన్, మునిష్కాంత్, ఇళవరసు, జార్జ్ మరియన్, ముత్తుకుమార్, రాయచల్ రబెక్కా వంటి నటీనటులు సపోర్టింగ్ రోల్స్‌లో ఉన్నారు. గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగుంటుంది. ఈ సినిమా వచ్చే నెలలో JioHotstar లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

Read Also : తండ్రీకొడుకుల ఎడబాటు… విధి ఆడే వింత నాటకం… మనసును హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×