E-Paper
Advertisement

సీక్రెట్ ఆడియో టేపుల మిస్టరీ… పాడ్ కాస్టర్ ను పట్టి పీడించే దుష్టశక్తి

సీక్రెట్ ఆడియో టేపుల మిస్టరీ… పాడ్ కాస్టర్ ను పట్టి పీడించే దుష్టశక్తి
Advertisement

Psychological horror thriller: కొన్ని సినిమాలు బాగానే ఉంటాయి కానీ మర్చిపోలేనంత ఇంపాక్ట్ మాత్రం చూపించవు. అతి తక్కువ సినిమాలు మాత్రమే రాత్రిపూట కూడా పీడకలల్లా వెంటాడుతూ, ఒక భయంకరమైన థ్రిల్ ఇస్తాయి. అలాంటి సినిమాను మీరు గనుక చూడాలనుకుంటే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ‘అండర్‌టోన్’ (undertone 2026) అనే ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? వణికించే ఈ సినిమా స్టోరీ ఏంటి ? అన్న వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

స్క్రీన్ మీద రెండు పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. అందులో మన కథానాయిక ఒకరు. ఆమె పేరు ఈవీ బాబిక్. మరొ క్యారెక్టర్ ఆమె తల్లి. మిగిలిన అందరూ కేవలం వాయిస్‌లుగా, ఆడియోలుగా మాత్రమే వినబడతారు. ఈ టెక్నిక్ ప్రేక్షకుడి ఊహకు పదును పెట్టి, సినిమాను చూస్తున్నంతసేపు భయాన్ని రెట్టింపు చేస్తుంది. ఇక మన ఈవీ విషయానికి వ్యస్తే… ఆమె పాపులర్ పారానార్మల్ పొడ్‌కాస్ట్ Undertone Podcastను తన స్నేహితుడు జస్టిన్ తో కలిసి నడుపుతుంది.

Advertisement

జస్టిన్ దెయ్యాలు, ఆత్మలపై నమ్మకం ఉన్న వ్యక్తి. కానీ ఈవీ మాత్రం అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తుంది. ఆమె తీవ్ర అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకోవడానికి తన చిన్ననాటి ఇంటికి వస్తుంది. అక్కడ ఒంటరిగా ఉండాల్సి రావడంతో పాటు బాధ్యతలు, గత జ్ఞాపకాలు ఆమెను వేధిస్తాయి. అలాంటి సమయంలో వారి పొడ్‌కాస్ట్‌కు ఒక అపరిచితుడు ఈమెయిల్ పంపుతాడు. అందులో 10 సీక్రెట్ ఆడియో ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్ ఒక గర్భిణీ జంట తమ ఇంట్లో ఎదుర్కొన్న వింత అనుభవాల గురించి రికార్డింగ్‌ చేస్తారు.

ఈవీ – జస్టిన్ ఈ ఆడియోలను తమ లైవ్ ఎపిసోడ్‌లో వింటూ విశ్లేషిస్తారు. మెల్లగా ఆ ఆడియోల్లోని సంఘటనలు ఈవీ నిజ జీవితంలో జరగడం ఆమెను ఆందోళనకు గురి చేస్తుంది. చివరికి వచ్చే ట్విస్ట్ ఏమిటంటే ఆ ఆడియోలు బయటి దెయ్యం కథలు కాదు. మరి ఇంతకీ ఆ స్టోరీలు ఎక్కడి నుంచి వచ్చాయి ? ఆడియో ద్వారా వ్యాపించే ఆ ‘వైరస్’ నుంచి ఈవీ తప్పించుకుందా లేదా ? క్లైమాక్స్ షాకింగ్ ట్విస్ట్ ఏంటి ? అన్నది మూవీలో చూడాల్సిందే.

తెలుగులో ఉందా ?

Advertisement

‘అండర్‌టోన్’ సినిమాను ఖచ్చితంగా హెడ్ ఫోన్స్ పెట్టుకునే చూడాలి. ఎందుకంటే డైలాగ్స్ లేదా దెయ్యాలు పెట్టే భయం కంటే సౌండ్ డిజైన్ తో భయపెట్టడమే ఈ సినిమా ప్రత్యేకత. ఈ సినిమా ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, గూగుల్ ప్లే మూవీస్, యూట్యూబ్‌లలో కూడా రెంట్ కి అందుబాటులో ఉంది. కానీ తెలుగు డబ్బింగ్ లేదు. 2026 లో వచ్చిన ఈ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ కు ఈయాన్ టువాసన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రమే అతని డైరెక్టోరియల్ డెబ్యూ.

Read Also: మాఫియాను పట్టుకోవడానికి ఎరగా మారే లేడీ కానిస్టేబుల్… అన్నీ అవే సీన్లు

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×